ఆకర్షణీయమైన పొడవాటి జుట్టు మీ అందాన్ని రెట్టింపు(Double) చేస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే, కొంతమంది తమ జుట్టు(Hair) ఎక్కువగా ఊడిపోతుందని బాధపడిపోతుంటారు. వర్షాకాలం రాగానే వాతావరణంలో అధిక తేమ కారణంగా తలపై చుండ్రు ఏర్పడుతుంది. ఈ చుండ్రు సమస్య కేవలం తలపైనే కాదు కనుబొమలు, భుజాలపై కూడా ఏర్పడి చర్మం పొడిబారేలా చేస్తుంది. చుండ్రుకు చెక్‌పెట్టేందుకు ఇంటర్నెట్లో అనేక పద్ధతులు ఉన్నాయి. కానీ సరైన వాస్తవాలను తెలుసుకొని మాత్రమే వాటిని ప్రయత్నించాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మార్కెట్లో దొరికే అన్ని ప్రొడక్ట్స్‌ను ఉపయోగించడం ద్వారా చుండ్రు సమస్య తీరడం అటుంచితే, రెట్టింపయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వయసు, వాతావరణం, అధిక పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, హెయిర్ డ్రయర్స్ విపరీతంగా వాడటం, అలర్జీ వంటి కారణాల వల్ల చుండ్రు సమస్య తరచూ వేధిస్తుంటుంది. ఈ సమయంలో వెంట్రుకలు పెలుసుగా తయారై జట్టు పలుచబడుతుంది. దీంతో విపరీతంగా జుట్టు రాలిపోయి చిన్న వయస్సులోనే బట్టతల వచ్చే ప్రమాదం ఉంది.
Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
అందుకే మొదట్లోనే దీనికి చెక్ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మాడుపై ఉండే చర్మతత్వానికి తగ్గట్లు షాంపూలు, ఇతర హెయిర్ కేర్ ఉత్పత్తులను ఎంచుకోవాలంటున్నారు. సమస్య మరీ ఎక్కువైతే.. సొంత చిట్కాలను వదిలేసి వైద్య సాయం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.
చుండ్రు ఉన్నప్పటికీ స్టైలింగ్ ప్రొడక్ట్స్‌ను వాడవచ్చా?
చుండ్రు సమస్యతో పోరాడుతున్నప్పటికీ, జుట్టు కోసం హెయిర్ ఆయిల్, ఇతర స్టైలిష్ ఉత్పత్తుల వినియోగంపై చాలామంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. అయితే దీని వల్ల ఎటువంటి సమస్య లేనప్పటికీ.. ఉపయోగిస్తున్న ఉత్పత్తులను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచిది. కొన్ని ఉత్పత్తుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. చుండ్రు సమస్య సాధారణంగా చర్మం పొడిగా ఉండే వారిలో అధికంగా ఉంటుంది.
మలస్సేజియా అనే శిలీంధ్రాల జాతికి చెందిన ఫంగస్ కారణంగా ఇది చర్మంపై పుడుతుంది. చుండ్రు తలపై నుంచి భుజాలపై పొలుసులుగా రాలి చూసే వారికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చుండ్రు కేవలం తలపై చర్మాన్ని మాత్రమే కాకుండా ముఖం, శరీరం అంతటిపై దుష్ప్రభావం చూపిస్తుంది. దీని జీవిత కాలం అతి తక్కువే అయినప్పటికీ.. ఇది వేగంగా పెరిగి, విస్తృతంగా వ్యాపిస్తుంది. అందుకే, సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.