Home /News /life-style /

HEALTH DID YOU KNOW ABOUT THESE 5 SIDE EFFECTS OF TAKING EXCESS VITAMIN D SUPPLEMENTS GH VB

Vitamin D: అధిక మోతాదులో విటమిన్ D తీసుకుంటుంన్నారా.. ఈ 5 సైడ్​ ఎఫెక్ట్స్ గురించి తప్పక తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోగ నిరోధక శక్తి పెంచుకోవాలనే ఉద్దేశంతో అధిక పోషకాలున్న పదార్థాలు తింటే మొదటికే మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విటమిన్​ డి అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవద్దని చెబుతున్నారు.

కరోనా వేరియంట్ల(Corona Varients) నేపథ్యంలో అందరూ ఆహారం పట్ల అధిక శ్రద్ధ వహిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని (Immunity) అందించే పోషక పదార్థాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. అయితే, రోగ నిరోధక శక్తి పెంచుకోవాలనే ఉద్దేశంతో అధిక పోషకాలున్న పదార్థాలు తింటే మొదటికే మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విటమిన్​ డి (Vitamin-D) అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవద్దని చెబుతున్నారు. విటమిన్​ డి గాయాలను నయం చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయన్న విషయం తెలిసిందే. అందువల్ల, శరీరాన్ని పోషకాలతో లోడ్​ చేసేందుకు వీటిని ఎక్కువగా తీసుకుంటారు చాలా మంది. అయితే, ఇలా చేయడం మూలాన మీకు కొన్ని దుష్ప్రభావాలు (Side effects) కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

How to Become Rich: ధనవంతులు కావాలనుకుంటున్నారా..? అయితే ఈ 5 సూత్రాలు పాటించండి..


దాదాపు 76% మంది భారతీయులకు విటమిన్ డి తగినంత స్థాయిలో లేదని, అందుకే ఎక్కువ మంది విటమిన్​ డీ ఉన్న పదార్థాలను అధికంగా తీసుకుంటున్నారని అధ్యయనాల్లో తేలింది. అయితే, డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా అధికంగా విటమిన్​ డి ఉన్న పదార్థాలను తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉంది. అవేంటో చూద్దాం.

కిడ్నీ ఫెయిల్యూర్..
విటమిన్ డి అధిక మోతాదుతో తీసుకుంటే చాలా దుష్ప్రభావాలు కలుగుతాయి. దీని వల్ల రక్తంలో కాల్షియం అధిక స్థాయికి చేరకుంటుంది. రక్త ప్రవాహంలో కాల్షియం స్థాయిలు పెరగడం వల్ల కణజాలం, అవయవాలు కూడా దెబ్బతింటాయి. మూత్రపిండాలకు కూడా హాని జరిగే అవకాశం ఉంది. ఇది క్రమంలో కిడ్నీ ఫెయిల్యూర్​కి దారి తీస్తుంది.

Winter Tips: చలికాలంలో మరీ బద్దకంగా ఉంటుందా..? యాక్టివ్‌గా ఉండేందుకు ఈ 10 చిట్కాలు పాటించండి..


ఎముకలు పెళుసుగా మారుతాయి..
విటమిన్​ డి అధికంగా తీసుకోవడం ద్వారా రక్తంలో కాల్షియం అధికంగా చేరుతుంది. ఈ కారణంగా ఎముకలు పెళుసుగా మారే ప్రమాదం ఉంది. వెన్ను, కీళ్ల నొప్పులు, అస్థిరత, కీళ్లలో వాపును అనుభవించవచ్చు.

ఊపిరితిత్తులకు ప్రమాదం..
మీ శరీరంలో విటమిన్ డి సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో కాల్షియం, ఫాస్ఫేట్ స్ఫటికాలు ఏర్పడతాయి. ఈ స్ఫటికాలు ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి వాటిని దెబ్బతీస్తాయి. ఇవి క్రమంగా ఛాతీ నొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగజేస్తాయి.

జీర్ణశయాంతర సమస్యలు..
పెద్ద మోతాదులో విటమిన్ డి తీసుకోవడం వల్ల మీ గట్ బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది. పెరిగిన కాల్షియం లెవల్స్​తో ఆకలి తగ్గడం, అతిసారం, మలబద్ధకం కూడా సంభవిస్తాయి. వాంతులు, వికారం వంటి సమస్యలొస్తాయి.

మానసిక ఆరోగ్య సమస్యలు..
అధిక మోతాదులో విటమిన్​ డీ తీసుకోవడం అనేది మీ ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. అంతేకాదు, మానసిక సమస్యలను పెంచుతుంది. ఇది డిప్రెషన్, సైకోసిస్, ఆందోళన వంటి లక్షణాలకు దారితీస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: Health, Life Style, Vitamin d, Vitamins

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు