Diabetes-Friendly Diet: షుగర్ అదుపులో ఉండాలంటే ఇవి తినాలి

Diabetes Diet | క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి.నిజానికి మధుమేహం విషయంలో ఆహార వ్యాయామాల వంటివి ముఖ్యమేగానీ వాటికంటే కూడా.. గ్లూకోజు నియంత్రణకు వైద్యులు చెప్పినట్టుగా మందులు వేసుకోవటం, క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవటం మరింత ముఖ్యం.

Shiva Kumar Addula | news18
Updated: August 22, 2019, 3:21 PM IST
Diabetes-Friendly Diet: షుగర్ అదుపులో ఉండాలంటే ఇవి తినాలి
ప్రతీకాత్మక చిత్రం
  • News18
  • Last Updated: August 22, 2019, 3:21 PM IST
  • Share this:
డయాబెటిస్.. చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య. దీన్నే మధుమేహం, షుగర్, చక్కెర వ్యాధి అని పిలుస్తారు. డాక్టర్లు సూచించిన మందులతో పాటు సరైన ఆహార పద్దుతులను పాటిస్తే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. రక్తంలోని చక్కర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు అధిక రక్త పీడనం వంటి సమస్యలను అదుపులో పెట్టుకోవచ్చు.

షుగర్ పేషెంట్లకు ఉత్తమమైన ఆహారం:


  • చేపలు: మధుమేహ వ్యాధిగ్రస్తులు చేపలు తింటే చాలా మంచిది. హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, అల్బకోర్ ట్యూనా, మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకే వారంలో కేవలం రెండు సార్లు అయిన చేపలను తినటానికి ప్రయత్నించండి.


Crime, marriage Food Poisoning, food poison in marriage, death because of food poisoning, ఫుడ్ పాయిజన్, పెళ్లిలో ఫుడ్ పాయిజన్, ఫుడ్ పాయిజన్ కావడంతో, ఫుడ్ పాయిజన్ వల్ల
  • పప్పు దినుసులు: షుగర్ పేషెంట్ల డైట్ లో పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూడాలి. పప్పు దినుసుల నుండి లభించే ప్రోటీనులు, మాంసాహారం నుండి లభించే ప్రోటీనుల కంటే మేలైనవి.పప్పు దినుసులు ప్రోటీన్, ఫైబర్ అధికంగా కలిగి ఉంటాయి. ఈ మూలకాలు రక్తంలోని చక్కర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి.


క్రాకర్స్ వద్దంటే దీపావళి ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు, Alternate ways to celebrate Diwali instead of burning Crackers

  • ధాన్యం: మధుమేహం ఉన్నవారు గోధుమ, రాగి తప్ప వరి అన్నము తినరాదు అన్నది తప్పు అభిప్రాయం. వరి, గోధుమ, రాగి జొన్నలు, సజ్జలు మొదలైన ధాన్యాలలోనూ 70 శాతం పిండి పదార్థం ఉంటుంది. అందుకే ఏ ధాన్యం తినాలన్నది ముఖ్యంకాదు. ఎంత పరిమాణంలో తింటున్నం అన్నదే ముఖ్యం.


vegs

  • కూరగాయలు: అన్ని రకాల ఆకుకూరలు, వం కాయ, బెండకాయ, ఉల్లి పాయలు, అరటి పువ్వు, బ్రాసెల్స్‌ మొలకలు, క్యాబేజి, కాలిఫ్లవర్‌ ,పుదీన, బొప్పాయి, కరివే పాకు, బ్రకోలి, దోసకాయ, టర్కిప్‌, ముల్లంగి, బెంగుళూరు వంకాయ, అరటిపువ్వు, ములగకాయ, గోరు చిక్కుడు, కొత్తిమీర, పొట్లకాయ, టమాట , బ్రాడ్‌బీన్స్‌, తెల్ల గుమ్మడి, సొరకాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

  • బాదం:ఎక్కువ పోషకాలను అందించే స్నాక్స్ కోసం చూస్తున్నారా.. అయితే వీటికి బాదం చాలా మంచివి. మీరు పని చేసే చోటకి బాదంలను తీసుకు వెళ్ళండి ఖాళీ సమయాల్లో వీటిని తినండి.


diet-foodఓట్స్: శరీరంలో చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, రక్తంలోని చెక్కర స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచే ఆరోగ్యవంతమైన ఫైబర్ ఓట్స్ లో పుష్కలంగా ఉంటుంది. ప్లెయిన్ ఓట్స్ లేదా స్టీల్ కట్ ఓట్స్ ఎక్కువ చక్కెరలను కలిగి ఉండకుండా, నెమ్మదిగా జీర్ణం అవుతాయి.

strawberries-red-fruit-royalty-free-70746

  • బెర్రీస్: బెర్రీస్ తక్కువగా కార్బోహైడ్రేట్స్ ను కలిగి ఉండటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా మంచివి.


వీటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. నీళ్లు ఎక్కుగా తాగాలి.నిజానికి మధుమేహం విషయంలో ఆహార వ్యాయామాల వంటివి ముఖ్యమేగానీ వాటికంటే కూడా.. గ్లూకోజు నియంత్రణకు వైద్యులు చెప్పినట్టుగా మందులు వేసుకోవటం, క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవటం మరింత ముఖ్యం.
Published by: Janardhan V
First published: August 22, 2019, 3:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading