HEALTH DIABETES 8 SWEET SNACKS SAFE FOR DIABETICS KNOW DETAILS HERE GH VB
Diabetics: షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా.. అయినా ఈ 8 స్వీట్ స్నాక్స్ తినొచ్చు.. అవేంటంటే..
ప్రతీకాత్మక చిత్రం
మధుమేహులు ఎనిమిది రకాల స్వీట్ స్నాక్స్ (Sweet Snacks)ను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. ఎందుకంటే షుగర్‌తో బాధపడుతున్నవారికి వీటి వల్ల ఎలాంటి హానీ జరగదు. ఈ స్వీట్ స్నాక్స్‌ను మీరు ఇంటి వద్దే ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిపై ఓ లుక్కేద్దాం.
ఈ రోజుల్లో పేలవమైన జీవనశైలి వల్ల చాలామంది షుగర్ వ్యాధి కోరల్లో చిక్కుకుపోతున్నారు. దీర్ఘకాలిక వ్యాధి అయిన ఈ డయాబెటిస్ (Diabetics) బారిన పడితే స్వీట్స్ గురించి మర్చిపోవాల్సిందే. ఎందుకంటే డయాబెటిస్ రోగుల్లో ఇన్సులిన్ (Insulin) హార్మోన్ గ్లూకోజ్ స్థాయిలను సక్రమంగా నియంత్రించదు. దీనివల్ల రక్తంలో అధిక చక్కెర పేరుకుపోతుంది. ఇలా రక్తంలో చక్కెర పెరిగితే ప్రమాదం కాబట్టి మధుమేహులు తమ చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుకునేందుకు పూర్తిగా తీపి పదార్థాలకు (Sweets) దూరంగా ఉంటారు. ఏదైనా స్వీట్ ఫుడ్ తింటే షుగర్ ప్రమాదకరస్థాయిలో పెరుగుతుందేమో అని వీరు నిత్యం అనుమానాలతో కడుపు మార్చుకుంటారు. స్వీట్స్ తినలేకపోతున్నామని నిరాశ కూడా పడుతుంటారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం, మధుమేహులు ఎనిమిది రకాల స్వీట్ స్నాక్స్ (Sweet Snacks)ను ఎలాంటి భయం లేకుండా తినొచ్చు. ఎందుకంటే షుగర్‌తో బాధపడుతున్నవారికి వీటి వల్ల ఎలాంటి హానీ జరగదు. ఈ స్వీట్ స్నాక్స్‌ను మీరు ఇంటి వద్దే ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటిపై ఓ లుక్కేద్దాం.
డయాబెటిస్ ఉన్నవారు కోకో పౌడర్, షుగర్-ఫ్రీ నట్ బటర్ కలిసి ఒక స్వీట్ టేస్ట్ గల స్నాక్ తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్‌ను యాపిల్ లేదా ఇతర పండుతో కలిపి తింటే టేస్ట్ అదిరిపోతుంది.
2. చియా పుడ్డింగ్ (Chia Pudding)
చియా పుడ్డింగ్ రెసిపీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. చియా విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. చియా గింజల్లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, పొటాషియం మొదలైన వివిధ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. చియా గింజలను పాలు లేదా నట్ మిల్క్ లేదా రసం వంటి ద్రవాలలో కనీసం 2 గంటలు లేదా రాత్రిపూట నానబెట్టి చియా సీడ్ పుడ్డింగ్ తయారు చేస్తారు. ఈ రెసిపీ చాలా స్వీట్ అండ్ టేస్టీగా ఉంటుంది.
పీనట్ బటర్ (Peanut Butter)లో ముంచిన యాపిల్ ముక్కలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక రుచికరమైన స్వీట్ స్నాక్ అవుతుంది. యాపిల్స్, పీనట్ బటర్లో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం మొదలైన వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
4. డార్క్ చాక్లెట్ (Dark chocolate)
డార్క్ చాక్లెట్ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని పరిశోధనల్లో తేలింది. అందుకే డార్క్ చాక్లెట్ బెస్ట్ స్వీట్ స్నాక్ అవుతుంది. డార్క్ చాక్లెట్లో యాంటీఆక్సిడెంట్లు, జింక్, మెగ్నీషియం, పొటాషియం మొదలైనవి కూడా సమృద్ధిగా ఉంటాయి.
5. గ్రీన్ యోగర్ట్ (Green yogurt)
గ్రీన్ లేదా గ్రీక్ యోగర్ట్‌ను తింటూ మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్వీట్ టేస్ట్‌ను ఆస్వాదించవచ్చు. ఈ రకం పెరుగులో స్టెవియాను స్వీటెనర్‌గా యాడ్ చేసుకుంటే చాలా హెల్దీ. ఈ స్నాక్ రుచి, పోషక విలువలను మరింత పెంచడానికి డ్రైఫ్రూట్స్, బెర్రీలు, యాపిల్స్ మొదలైన వాటిని కూడా చేర్చవచ్చు.
6. బేరి (Pears)
యాపిల్స్ లాగానే ఉండే పీయర్స్ లేదా బేరిపండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక వరమని చెప్పవచ్చు. ఈ పండ్లను నట్ బటర్, డార్క్ చాక్లెట్, పెరుగు మొదలైన వాటితో ఆరగించవచ్చు.
7. ఓట్మీల్ (Oatmeal)
ఓట్మీల్, పండిన అరటిపండ్ల గుజ్జు, దాల్చినచెక్కతో ఒక రుచికరమైన స్వీట్ స్నాక్ తయారు చేసుకోవచ్చు. ఈ స్నాక్పై కొబ్బరి యాడ్ చేస్తే దీని రుచి మరింత పెరుగుతుంది.
ఫ్రూట్ పాప్సికల్స్ రెసిపీ షుగర్ వ్యాధితో బాధ పడుతున్న వారితో సహా అన్ని వయసుల వారికి ఒక సమ్మర్ స్నాక్‌గా పనిచేస్తుంది. చక్కగా కోసిన పండ్ల ముక్కలను కలిపి మీరు ఈ ఫ్రూట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు.
పైన పేర్కొన్న ఫుడ్స్‌లో చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి కానీ వాటిని డయాబెటీస్ రోగులు మితంగా మాత్రమే తినాలి. ఎక్కువగా తింటే చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉందని గుర్తుంచుకోవాలి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.