Adulterated Food: మీరు ఉపయోగించే మైదాపిండి స్వచ్ఛమైనదేనా? కల్తీని ఎలా గుర్తించాలంటే...

ప్రతీకాత్మక చిత్రం

పాలు, నూనె, పిండి, బెల్లం, మిరియాలు, కారంపొడి, పసుపుపొడి ఇలా ఒకటేమిటి ప్రతి ఆహారపదార్థాన్ని కల్తీ చేసి పడేస్తున్నారు. సామాన్యులు ఈ కల్తీలను గుర్తించడం చాలా కష్టం.

  • Share this:
మనదేశంలోని చాలా ప్రాంతాల్లో ఆహార పదార్థాల కల్తీ సాధారణ విషయంగా మారింది. పండుగల సందర్భాల్లో మరీ ఎక్కువగా ఆహార పదార్థాలను కల్తీ చేస్తుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించేందుకు కొందరు అక్రమార్కులు ఆహార పదార్థాల కల్తీకి పాల్పడుతూ ఉంటారు. దీంతో వీటిని తినే ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 80 కోట్ల మంది కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల ఏదో ఒక సందర్భంలో అనారోగ్యం పాలవుతున్నారని ఒక అంచనా. అంటే ప్రతి పది మందిలో ఒకరు కల్తీ ఆహారం తిని అనారోగ్యం పాలవుతున్నారన్నమాట.

ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆహార కల్తీ వ్యాపారం 2.9 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఇలా మన దేశంలోనూ ఏటా రూ.28,000 కోట్ల విలువైన కల్తీ ఆహారం అమ్ముతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఏ ఆహార పదార్థాల్లో వేటిని కలిపి కల్తీకి పాల్పడుతున్నారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.



పాలు, నూనె, పిండి, బెల్లం, మిరియాలు, కారంపొడి, పసుపుపొడి ఇలా ఒకటేమిటి ప్రతి ఆహారపదార్థాన్ని కల్తీ చేసి పడేస్తున్నారు. సామాన్యులు ఈ కల్తీలను గుర్తించడం చాలా కష్టం. అయితే దేశంలో ఆహారకల్తీని గుర్తించి నియంత్రించే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆహార కల్తీను తేలిగ్గా గుర్తించే అనేక రకాల పరీక్షలను ప్రజలకు పరిచయం చేస్తుంది. కేవలం అధికారులు దాడులు నిర్వహించి ఆహార కల్తీని నియంత్రించడమే కాకుండా, ప్రజలు కూడా ఆహార కల్తీని గుర్తించే విధంగా వారిని అప్రమత్తం చేస్తోంది.

కల్తీ ఆహార పదార్థాలను ఎలా గుర్తించాలి
ఆహార పదార్థాల కల్తీని గుర్తించేందుకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని సూచనలు చేసింది. చిన్న పరీక్షల ద్వారా ఆహార కల్తీని ఇట్టే గుర్తించవచ్చు. ప్రతి వంటింట్లో మైదాపిండి, బియ్యం పిండి వంటలకు వాడుతుంటారు. అవి కల్తీవా, అసలైనవేనా ఎలా తెలసుకోవాలో పరీక్షించి తెలసుకోండి. మైదా పిండిలో బోరిక్ యాసిడ్ కలపడం ద్వారా కల్తీ చేస్తున్నారని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( FSSAI) గుర్తించింది.

ఇది కూడా చదవండి: Food Habits: బరువు తగ్గాలని అన్నం మానేస్తున్నారా.. ఫుడ్‌లో అన్నం ఉండాల్సిందే.. ఈమాటన్నది..

మైదాలో కల్తీని గుర్తించేందుకు FSSAI చేసిన సూచనలు

* ముందుగా ఒక గ్రాము మైదా పిండిని ఓ టెస్ట్ ట్యూబులో తీసుకోవాలి

* అందులో 5 మీ.లీ నీటిని కలపాలి

* అవి రెండు బాగా కలిసేలా బ్యూబ్‌ను ఊపాలి

* తరువాత కొన్ని చుక్కల కాన్సంట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి

* ఈ ద్రావణంలో టర్మరిక్ పేపర్ స్ట్రిప్ ను ముంచాలి

* టర్మరిక్ పేపర్ స్ట్రిప్ రంగు మారకుంటే మైదాపిండిలో ఎలాంటి కల్తీ లేనట్టే. ఇక వేళ టర్మరిక్ పేపర్ స్ట్రిప్ ఎర్రగా మారితే ఆ మైదాపిండిని కల్తీ చేశారని గుర్తించాలి.
Published by:Sambasiva Reddy
First published: