Dental health: బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా..? అయితే డేంజరే..

ప్రతీకాత్మక చిత్రం

Dental health: మనకు ఎక్కువ ఇన్​ఫెక్షన్లు నోటి ద్వారానే వస్తుంటాయి. అందువల్ల నోటిని ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవడం చాలా కీలకం. అయితే చాలా మంది బ్రష్​ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు.

  • Share this:
కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఉదయం లేవగానే బ్రష్​ చేయడం దగ్గర్నుంచి రాత్రి డిన్నర్​ వరకు అన్నింటిపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మనకు ఎక్కువ ఇన్​ఫెక్షన్లు నోటి ద్వారానే వస్తుంటాయి. అందువల్ల నోటిని ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవడం చాలా కీలకం. అయితే చాలా మంది బ్రష్​ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటి వల్ల దంతాలు, చిగుళ్లపైన ఎఫెక్ట్​ పడి రక్తస్రావం అవుతుంది. అంతేకాదు, అశ్రద్ధగా బ్రష్ చేయడం వల్ల నొప్పి, ఇతర సమస్యలు తలెత్తుతాయి. బ్రెష్ చేసే సమయంలో ప్రజలు ఎటువంటి తప్పులు చేస్తారు? వాటికి పరిష్కారాలేంటి? అనే విషయాలను తెలుసుకుందాం.

సరైన టూత్ బ్రష్ వాడకపోవడం

చాలా మంది నాసిరకం టూత్ బ్రష్​ వాడుతుంటారు. మీడియం లేదా హార్డ్​గా ఉంటే బ్రష్​తో పళ్ళు తోముకుంటే సులభంగా క్లీన్​ అవుతుందని భావిస్తారు. కానీ అలాంటిదేమీ ఉండదు. హార్డ్​ బ్రెష్​ల వల్ల పళ్ళు డ్యామేజ్​ అవుతాయని డెంటిస్ట్​లు చెబుతున్నారు. అందుకే సాఫ్ట్​ బ్రష్​లను మాత్రమే వాడాలని సలహాలిస్తున్నారు.

యాంటీ-సెన్సిటివిటీ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించడం

సరైన టూత్​పేస్ట్​ని ఉపయోగించడం కూడా మీ దంత సంరక్షణలో కీలకం. టూత్​ పేస్ట్​లో ఫ్లోరైడ్​ ఉంటే అది పళ్ళు పుచ్చిపోవడం వంటి సమస్యలను తొలగిస్తుంది. నోటిలో నుంచి చెడు వాసన రాకుండా నియంత్రిస్తుంది. అందుకే, యాంటీ సెన్సిటివిటీ టూత్​పేస్ట్​లకు బదులు ఫ్లోరైడ్​ కలిగి ఉన్న టూత్​ పేస్ట్​లను ఎక్కువగా ఉపయోగించాలని డెంటిస్ట్​లు సలహాలిస్తున్నారు.

ఎక్కువ సార్లు లేదా త్వరగా బ్రష్ చేయడం

దంత సమస్య వచ్చినా సరే మనలో చాలా మంది డెంటిస్ట్ వద్దకు​ వెళ్లేందుకు ప్రయత్నించరు. దీనికి బదులు రోజుకు రెండు, మూడు సార్లు బ్రష్​ చేయడం లేదా త్వరగా బ్రష్​ చేయడం వంటివి పాటిస్తారు. అయితే, అలా చేయడం మంచిది కాదని డెంటిస్ట్​లు హెచ్చరిస్తున్నారు. రోజులో రెండు, మూడు సార్లు బ్రష్​ చేయడం ద్వారా మీ చిగుళ్ళు, ఎనామెల్ దెబ్బతింటాయని చెబుతున్నారు.

తప్పుడు బ్రషింగ్ టెక్నిక్

కొంతమంది ఎలా పడితే అలా తోముకుంటారు. అలా కాకుండా పళ్ళు తోముకునేటప్పుడు స్ట్రోకులు అడ్డంగా కాకుండా నిలువుగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే చిగుళ్లపై ప్రభావం పడుతుంది. మీ బ్రష్‌ను చిగుళ్ళకు 45 డిగ్రీల కోణంలో పట్టుకోవాలి.

హార్డ్ బ్రషింగ్

హార్డ్ బ్రషింగ్ మీ చిగుళ్ళను దెబ్బతీస్తుందని గుర్తుంచుకోండి. అంతేకాదు, రోజుకు 3 నుంచి 4 సార్ల కంటే ఎక్కువ బ్రష్ చేయడం కూడా మంచిది కాదు. ఇది మీ చిగుళ్లను దెబ్బతీసి రక్త స్రావానికి కారణమవుతుంది.
Published by:Sridhar Reddy
First published: