Home /News /life-style /

HEALTH CINNAMON BENEFITS FOR MEN ARE YOU FACING SEXUAL PROBLEMS IN BEDROOM USE CINNAMON IN THESE WAYS SK

Cinnamon Benefits: అంగస్తంభన సమస్యా? బెడ్‌రూమ్‌లో డీలా పడుతున్నారా? దాల్చిన చెక్కను ఇలా వాడండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Health Tips: చాలా మంది పురుషుల్లో ప్రస్తుతం అంగ స్తంభన సమస్యలు కనిపిస్తున్నాయి. అలాంటి వారికి దాల్చిన చెక్క దివ్యమైన ఔషధం. మరి దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలి? ఇంకా ఏమేం ప్రయోజనాలున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

  Cinnamon Benefits For Men: దాల్చిన చెక్క.. చాలా ఆరోగ్యకరమైన మూలిక. దీనిని మన దేశంలో మసాలా దినుసుగా కూడా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కను పొడి రూపంలో ఆహారంలో వాడుతారు. లేదంటే ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. సువాసన వెదజల్లడమే కాదు కూరలకు అద్భుతమైన రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మాంసాహార వంటకాల్లో దాల్చిన చెక్కను ఖచ్చితంగా పడాల్సిందే. దాల్చిన చెక్కల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పురుషులు ఆహారంలో దాల్చిన చెక్కను తప్పకుండా తీసుకోవాలి. దాల్చిన చెక్కలో ఉండే పోషకాలు మగవారి అనేక శారీరక సమస్యలను నయం చేస్తాయి.

  దాల్చినచెక్కలో రకాలు:
  దాల్చినచెక్కలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో సిలోన్ దాల్చినచెక్కను చాల మంది ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే సిలోన్ దాల్చిన చెక్క రుచి భిన్నంగా ఉంటుంది. ఇది శరీరానికి వేడి చేస్తుంది. అందుకే చాలా పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. దాల్చిన చెక్కలో మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, కాల్షియం, మాంగనీస్, కాపర్, జింక్, విటమిన్లు, నియాసిన్, థయామిన్, లైకోపీన్, ఎనర్జీ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఈ పోషకాలన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

  మహిళల్లో ఎక్కువగా వచ్చే కిడ్నీ వ్యాధి.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి..!

  దాల్చినచెక్కతో పురుషులకుప్రయోజనాలు:

  ఈ రోజుల్లో చాలా మంది అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్నారు. శృంగార మాధుర్యాన్ని ఆనందించలేక కుమిలిపోతున్నారు. అంగ స్తంభన సమస్యలున్న వారు రాత్రి పడుకునే ముందు దాల్చినచెక్క పొడిని పాలు లేదా నీటిలో కలిపి తాగాలి. దాల్చిన చెక్క టీ తాగినా మంచిదే.

  మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే... రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి దాల్చిన చెక్క చెక్కగా పనిచేస్తుంది. దాల్చిన చెక్క పాలు, టీ తాగడం వల్ల షుగర్ లెవెల్ నార్మల్‌గా ఉంటుంది. దాల్చిన చెక్క ఎముకలు, కీళ్ల నొప్పులు, వాపుల సమస్యను కూడా తగ్గిస్తుంది.

  పెళ్లై చాలా ఏళ్లయినా తండ్రి కాలేకపోతున్నారంటే మీ వైపు నుంచి సమస్య ఉండవచ్చు. వంధ్యత్వమే కారణం కావచ్చు. ఎంతో మందిలో ఈ సమస్య ఉంది. అలాంటి వారు దాల్చిన చెక్క పొడిని గోరువెచచని పాలతో కలిసి తీసుకోవాలి. దీనిని సలాడ్, స్మూతీ, డికాక్షన్, పెరుగు, కూరగాయలు, సూప్ వంటి వాటితో కూడా తినవచ్చు.

  మీరు శారీరకంగా బలహీనంగా ఉండి.. ఒంట్లో శక్తి నశిస్తున్నట్లుగా అనిపిస్తే.. దాల్చిన చెక్కను నిత్యం తీసుకోండి. దాల్చిన చెక్క పొడిని నీళ్లలో లేదా పాలలో కలిపి తాగడం వల్ల శరీరం కోల్పోయిన శక్తి తిరిగి వస్తుంది. బలంగా ఉంటారు.

  Jaggery Benefits: ఖాళీ కడుపుతో బెల్లం తినడం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

  దాల్చినచెక్క వల్ల లాభాలు:

  దాల్చిన చెక్క ఆకులను జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క ఆకులను పేస్టులా చేసి జుట్టుకు పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేస్తే వెంట్రుకుల కుదుళ్లు గట్టిగా అవుతాయి. తద్వారా జుట్టుఒత్తుగా, దృఢంగా మారుతుంది. వెంట్రుకలు బాగా పెరుగుతాయి.

  దాల్చిన చెక్క కూడా చర్మానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. దాల్చిన చెక్క మొటిమలను, మచ్చలను కూడా తగ్గిస్తుంది. దాల్చిన చెక్క పొడిని తేనెతో కలిపి మొటిమల మీద అప్లై చేయడం వల్ల మేలు జరుగుతుంది. చర్మంపై ముడతలు తొలగిపోవడంతో యవ్వనం పెరుగుతుంది.

  Health Tips: ఆరోగ్య‌క‌ర‌మై శ‌రీరం కోసం.. మీ ఆహారంలో ఏం తీసుకోవాలో తెలుసా..

  ప్రస్తుతం ఎంతో మంది ఫంగల్ ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు ఈ సమస్యలను దూరం చేస్తాయి. ఇందుకోసం దాల్చిన చెక్క పొడితో పాటు నూనెను కూడా ఉపయోగించవచ్చు.

  బరువు తగ్గడానికి, దాల్చిన చెక్క టీ, డికాక్షన్, దాని పొడిని పాలు లేదా నీటిలో కలిపి త్రాగాలి. ఇందులో ఉండే యాంటీ ఒబెసిటీ ఎలిమెంట్ ఊబకాయాన్ని నివారిస్తుంది.

  ఇవే కాదు.. బ్రోన్కైటిస్, నోటి వ్యాధులు, మెదడు వ్యాధులు, అనేక రకాల క్యాన్సర్లు, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తంలో చక్కెర స్థాయి మొదలైన వాటిని నివారించడంలో దాల్చిన చెక్క సహాయపడుతుంది. దాదాపు ప్రతి ఇంట్లో ఉండే ఈ సుగంధ ద్రవ్యం.. నిజంగా దివ్యౌషధం. ఐతే ఒంటికి వేడి చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి.



  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Health, Health benefits, Lifestyle, Sexual Wellness

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు