హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Cholesterol Symptoms: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..? అయితే వైద్యులను వెంటనే సంప్రదించండి..

Cholesterol Symptoms: ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా..? అయితే వైద్యులను వెంటనే సంప్రదించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అధిక బరువు లేదా శరీర కొవ్వును బట్టి అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు తెలుసుకుంటారు. అయితే కాళ్లు (Legs) వంటి శరీరంలోని ఇతర భాగాలలో కనిపించే లక్షణాలు కూడా అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు తెలుపుతాయి.

శరీరంలో కొలెస్ట్రాల్(Cholesterol) స్థాయిలు ఎక్కువగా ఉంటే హృదయ సంబంధ వ్యాధులతో సహా ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే అధిక కొలెస్ట్రాల్ (High Cholesterol) తమ శరీరంలో పేరుకుపోయిందనే విషయాన్ని చాలా మంది గుర్తించలేరు. అందుకే హై కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్(Silent Killer) అని పిలుస్తారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను గుర్తించడానికి రక్త పరీక్ష (Blood Test) అవసరం. ప్రజలు సాధారణంగా అధిక బరువు లేదా శరీర కొవ్వును బట్టి అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు తెలుసుకుంటారు. అయితే కాళ్లు (Legs) వంటి శరీరంలోని ఇతర భాగాలలో కనిపించే లక్షణాలు కూడా అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు తెలుపుతాయి.

అధిక కొలెస్ట్రాల్ కారణంగా కొన్ని శరీర భాగాలలోని ధమనుల్లో కొవ్వు పేరుకుపోతుంది. అలా ఏదైనా శరీర భాగంలో కొవ్వు పేరుకుపోయి రక్తప్రసరణ వ్యవస్థకు అడ్డంకి ఏర్పడితే దానిని పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌ (పీఏడీ- PAD) అని పిలుస్తారు. ఒకవేళ కొవ్వు అధికంగా పేరుకుపోతే కొన్ని ధమనులు కాళ్లకు రక్తాన్ని సరఫరా సరిగా చేయలేవు. అందువల్ల, ఈ లక్షణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. మీ కాళ్లలో ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలి. ఇంకా తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* చర్మం రంగు మారడం

అధిక కొలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రసరణ తగ్గి మీ చర్మం రంగు కూడా మార్చవచ్చు. పోషకాలు, ఆక్సిజన్‌ను మోసుకెళ్లే రక్తం శరీర భాగాలకు సరిగా చేరుకోనప్పుడు కణాలకు సరైన పోషణ లభించదు. అప్పుడు స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది. లెగ్స్ పైకి లేపినప్పుడు కాళ్ల చర్మం లేతగా కనిపిస్తుంది. టేబుల్‌ పై నుంచి కిందకి వేలాడదీయడం వల్ల చర్మం పర్పుల్ లేదా బ్లూ కలర్ లో కనిపిస్తుంది.

Cancer Symptoms: బాడీ పెయిన్స్ క్యాన్సర్‌ లక్షణాలు కావచ్చు.. క్యాన్సర్ నొప్పుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు..


* పాదాలు, కాళ్లు చల్లగా అనిపించడం

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు శరీరం లో ఉన్నప్పుడు వేసవిలో కూడా మీ పాదాలు లేదా కాళ్లు ఏడాది పొడవునా చల్లగా ఉంటాయి. ఇది మీరు పెరిఫెరల్‌ ఆర్టరీ డిసీజ్‌ ని కలిగి ఉన్నారని సూచించవచ్చు. కాళ్లు, పాదాలు చల్లగా ఉండటానికి మరో కారణం కూడా ఉండొచ్చు. అందుకే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

* రాత్రివేళ తిమ్మిరి

అధిక కొలెస్ట్రాల్ శరీరంలో ఉంటే నిద్రపోతున్నప్పుడు కాలుకు తిమ్మిర్లు అధికంగా పడతాయి. సాధారణంగా మడమ, ముందరి పాదాలు లేదా కాలి వేళ్లలో తిమ్మిరి వస్తుంది. మంచం మీద నుంచి పాదాన్ని కిందకు ఫ్రీగా వేలాడదీయడం లేదా కూర్చోవడం ద్వారా తిమ్మిర్ల నుంచి ఉపశమనం పొందవచ్చు.

* తీవ్రమైన నొప్పులు

పీఏడీ అత్యంత సాధారణ లక్షణాలలో కాలు నొప్పి ఒకటి. మీ కాళ్ల ధమనులు మూసుకుపోయినప్పుడు, ఆక్సిజన్‌తో కూడిన రక్తం తగినంత, అవసరమైన మొత్తంలో మీ శరీర కింది భాగానికి చేరదు. దీనివల్ల మీ కాళ్ల బరువు పెరుగుతుంది. అలాగే కాళ్లు బాగా అలసిపోతాయి. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న చాలా మంది వ్యక్తులకు అవయవాలలో మంట, నొప్పి కలుగుతుంది. తొడ లేదా వెనుక భాగం వరకు కాలులోని ఏదైనా భాగంలో నొప్పి అనిపించవచ్చు. అది ఒకటి లేదా రెండు కాళ్లలో ఉండవచ్చు. వాకింగ్, జాగింగ్, మెట్లు ఎక్కడం వంటి శారీరక పనులు చేసినప్పుడు నొప్పి తీవ్రతరమవుతుంది.

First published:

Tags: Health benefits, Health problems, Lifestyle

ఉత్తమ కథలు