హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Chinese Biryani: చైనా బిర్యానీ ఎలా తయారు చేస్తారో తెలుసా.. ఈ వైరల్ వీడియో చూడండి..

Chinese Biryani: చైనా బిర్యానీ ఎలా తయారు చేస్తారో తెలుసా.. ఈ వైరల్ వీడియో చూడండి..

బిర్యానీ

బిర్యానీ

మన దేశంలో పావ్ బాజీ, జైన్ బిర్యానీ, ఇండియన్ చైనీస్ బిర్యానీలను అనేక రెస్టారెంట్లు తయారు చేస్తున్నాయి. అయితే ప్రతి బిర్యానీలో ఆయా ప్రాంతాలను బట్టి రుచులు మారుతూ ఉంటాయి. దీని తయారీలో అనేక ప్రయోగాలు చేసి ప్రజల అభిరుచులకు అనుగుణంగా తయారు చేస్తూ ఉంటారు. ఇటీవల ఇలాంటి బిర్యానీనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇంకా చదవండి ...

మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. వివిధ ప్రాంతాల్లో ఒక్కో రకం బిర్యానీ ఫేమస్. ఆయా ప్రాంతాల్లో ప్రజల అభిరుచులకు అనుగుణంగా బిర్యానీలు తయారు చేసుకుంటూ ఉంటారు. మన దేశంలో పావ్ బాజీ, జైన్ బిర్యానీ, ఇండియన్ చైనీస్ బిర్యానీలను అనేక రెస్టారెంట్లు తయారు చేస్తున్నాయి. అయితే ప్రతి బిర్యానీలో ఆయా ప్రాంతాలను బట్టి రుచులు మారుతూ ఉంటాయి. దీని తయారీలో అనేక ప్రయోగాలు చేసి ప్రజల అభిరుచులకు అనుగుణంగా తయారు చేస్తూ ఉంటారు. ఇటీవల ఇలాంటి బిర్యానీనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Success Story: పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి కూతురికి ఐఐటీలో సీటు.. వైరల్ అయిన ఇండియన్ ఆయిల్ చైర్మన్ ట్వీట్..


ఏమిటీ వైరల్ వీడియో..

యూట్యూబ్ లో ఓ వ్యక్తి చైనీస్ బిర్యానీ గురించి షేర్ చేశాడు. కూరగాయల ముక్కలు, చికెన్ తో తయారు చేసిన ఈ బిర్యానీ తయారీ వీడియో వైరల్‌గా మారింది. ఇది చైనీస్ ప్రైడ్ రైస్ మాదిరే కనిపిస్తుంది. అయితే ఈ వీడియో ట్విట్టర్‌లో ఇప్పుడు వైరల్ అయింది కానీ, ఇది గత ఏడాది పోస్ట్ చేసిందే.

నెటిజన్ల స్పందన ఎలా ఉంది?

ప్రతి విషయంలోనూ నెటిజన్లు స్పందిస్తూనే ఉంటారు. ఇక బిర్యానీని వదిలిపెడతారా. అనేక మంది నెటిజన్లు వారి స్పందనను సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది వెజ్ బిర్యానీలా లేదని, ఇది మటన్ , చికెన్ బిర్యానీ మాదిరిగా ఉందని కొందరు కామెంట్లు పెట్టారు. ఇండియాలో జైన్ చైనీస్ పావ్ బాజీ, జైన్ బిర్యానీ, ఇండియన్ చైనీస్ వంటి బిర్యానీలు ఉన్నాయని మరో యూజర్ కామెంట్ చేశారు. చైనీస్ బిర్యానీలో కొన్ని అదనంగా కలిపారు. ఎగ్ బిర్యానీలాగే చైనీస్ బిర్యానీ కూడా అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Viral Video: ఆ బాలుడు చేసే పని.. అందరికీ కన్నీళ్లు పెట్టించాయి.. ఇంతకు అతడు ఏం చేస్తున్నాడు.. ఎందుకు..?


గత వారం భారత, చైనా సైనికులు అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సరిహద్దు వద్ద తలపడ్డాయని అయితే సరిహద్దు వ్యవహారం వేరే కోణంలో చూడాల్సి ఉంటుందని ఆర్మీ అధికారులు చెప్పిన విషయాన్ని అలెక్స్ ఫిలిప్ అనే ట్వీట్ చేశారు. సరిహద్దుల వద్ద పహారా సరేగాని ముందు చైనీస్ బిర్యానీ తయారు చేయడం ఆపండని కౌశల్ వ్యంగంగా సమాధానం ఇచ్చారు.

ఇలా చైనీస్ బిర్యానీ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు వారి అభిరుచులకు అనుగుణంగా స్పందించారు. ఈ ఏడాది ప్రారంభంలోనూ పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి స్ట్రాబెర్రీ బిర్యానీ ఫోటోలను షేర్ చేశాడు. అది అప్పట్లో వైరల్ గా మారింది.

Published by:Veera Babu
First published:

Tags: Recipe, Viral vide

ఉత్తమ కథలు