ప్రస్తుతం భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఓ రేంజ్లో ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రత (Rising Temperatures)లతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రతి ఒక్కరి ఆరోగ్యం (Health)పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పసిబిడ్డలకు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు (Heatwaves) ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఈ ప్రాణాంతకమైన వడగాల్పుల నుంచి పిల్లలను (Children), పసిబిడ్డ (Infants)లను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. వడగాలుల తీవ్రత అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో వాటివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను ఎవరూ గుర్తించడం లేదు. ఈ క్రమంలోనే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వడగాల్పుల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల (NDMA-ఎన్డీఎంఏ) అవగాహన కల్పించేందుకు నడుంబిగించింది.
Business Idea: ఈ బిజినెస్ కు సర్కార్ సాయం.. లక్షల కొద్దీ ఆదాయం.. తెలుసుకోండి
హీట్‌వేవ్స్ నుంచి పిల్లలను సంరక్షించేందుకు కొన్ని టిప్స్ కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఆ టిప్స్ ఫాలో అవుతూ పిల్లలను వడగాల్పుల నుంచి ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యలను దూరం చేయడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం, నిరంతరం నీరు తాగడం చాలా కీలకం. కానీ పసిబిడ్డలు సెల్ఫ్ కేర్ తీసుకోలేరు. హీట్‌వేవ్‌కు పిల్లలు మరింత ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల అవసరం లేనంత వరకు వారిని ఇంటి లోపల చల్లటి ప్రదేశంలో ఉంచడం మంచిది. ఈ సమ్మర్లో పిల్లల విషయంలో పెద్దలు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల ఆరోగ్యం కోసం పెద్దలు డైలీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. అలాగే కొన్ని పనులను ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదని ఎన్డీఎంఏ ట్విట్టర్ ద్వారా కోరింది. “మీ పసిబిడ్డలను హీట్‌వేవ్ నుంచి ప్రొటెక్ట్ చేయండి. ఈ Do's & Don'ts అనుసరించడం ద్వారా వడగాల్పుల సమస్యను అధిగమించవచ్చు" అని ఎన్డీఎంఏ (NDMA) ట్వీట్లో పేర్కొంది. అవేంటో చూద్దాం.
Prepare Your #Infants From The #Heatwave. #AvoidHeatwave by following these Do's & Don'ts pic.twitter.com/77JgOGajJ5
— NDMA India | राष्ट्रीय आपदा प्रबंधन प्राधिकरण 🇮🇳 (@ndmaindia) May 4, 2022
- మీరు ఎక్కడికైనా ప్రయాణిస్తున్నట్లయితే, ఎండలో పార్క్ చేసిన కారులో మీ బిడ్డను ఉంచకూడదు. ఎందుకంటే వాహనాల ఉష్ణోగ్రతలు ప్రమాదకరమైన స్థాయిలో వేడెక్కుతాయి. ఎవరి తోడు లేకుండా పిల్లలను ఒంటరిగా కారులో వదిలేయకూడదు. మీ బిడ్డకు తాగడానికి పుష్కలంగా ఫ్లూయిడ్స్ ఇవ్వడం చాలా ముఖ్యం, తద్వారా వారు అన్ని సమయాలలో హైడ్రేట్ గా ఉంటారు.
- పిల్లలలో వేడి-సంబంధిత వ్యాధులను గుర్తించాలి. ఇందుకు ప్రతి అనారోగ్యం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి.
- మీ బిడ్డ డీహైడ్రేషన్‌తో ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి మీ పిల్లల మూత్రంపై ఓ కన్నేయండి. డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతున్నట్లతే మీ బిడ్డ ముదురు రంగులో మూత్రాన్ని విసర్జించవచ్చు. లేదా మీ పిల్లల మూత్రం బాగా దుర్వాసన రావచ్చు.
సాధారణంగా పిల్లలు చెమట రూపంలో తమ శరీర ద్రవాలను వేగంగా కోల్పోతారు. దీని ఫలితంగా డీహైడ్రేషన్ కి గురవ్వచ్చు. అందుకే వారితో తరచుగా నీరు తాగించాలి. తేలికపాటి దుస్తులు తొడగాలి. అలాగే వారి డైపర్ తక్కువగా వెట్ (Wet) అవుతుంటే అప్రమత్తం కావాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Children, Childrens day, Lifestyle, Summer