క్యాన్సర్ (Cancer) అనేది ఎక్కువ కాలం బాధించే వ్యాధి (Chronic Disease). దీనిని ముందుగా గుర్తిస్తే చికిత్స (Treatment) చేయవచ్చు. అయితే క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడానికి నిర్దిష్ట సంకేతాలు (Signs) లేదా లక్షణాలు (Symptoms) లాంటివి ఏవీ లేవు. ఫలితంగా క్యాన్సర్‌లు అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు మాత్రమే గుర్తిస్తారు. దీని వల్ల చికిత్స చేయడం కష్టమవుతుంది. అయితే ఫలానా లక్షణం క్యాన్సర్ సూచిస్తుందని కచ్చితంగా చెప్పకపోయినా కొన్ని సంకేతాలు మాత్రం క్యాన్సర్ వ్యాధికి కారణమవ్వచ్చు. ముఖ్యంగా బాడీ పెయిన్స్ క్యాన్సర్‌ను సూచిస్తాయి. ఎర్లీ స్టేజ్‌ల్లో క్యాన్సర్ బాధితుల్లో కనిపించే నొప్పి అధికం. ఈ నొప్పి గురించి నిర్లక్ష్యం చేయకూడదు. ఈ నొప్పిలో చాలా రకాలు ఉంటాయి. మరి నొప్పి క్యాన్సర్ వల్లే వస్తుందా దీన్ని ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాన్సర్ నొప్పి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. నరాలు, ఎముకలు లేదా అవయవాలపై కణితి విస్తరించడం వల్ల క్యాన్సర్ నొప్పి వస్తుంది. కొన్నిసార్లు నొప్పి మీ క్యాన్సర్ చికిత్స కారణంగా వస్తుంది. కీమోథెరపీ వంటి అధునాతన చికిత్స పొందినప్పుడు కూడా క్యాన్సర్ కణితి నొప్పిని కలిగిస్తుంది. అదేవిధంగా, రేడియోథెరపీ చర్మానికి కొంత మేర నష్టం కలిగిస్తుంది.
* క్యాన్సర్ నొప్పిలో వివిధ రకాలు
సోమాటిక్: సోమాటిక్ నొప్పి అనేది క్యాన్సర్ ఉన్న రోగులు అనుభవించే అత్యంత సాధారణ రకమైన నొప్పి. ఈ నొప్పి అడపాదడపా బాధిస్తుంది. నొప్పితో తిమ్మిరి కూడా వస్తుంది.
న్యూరోపతిక్: క్యాన్సర్ వల్ల నరాల దెబ్బతినప్పుడు న్యూరోపతిక్ నొప్పి పుడుతుంది. ఇది కీమోథెరపీ, రేడియోథెరపీ లేదా శస్త్రచికిత్స వంటి చికిత్సల వల్ల కలిగే క్యాన్సర్ నొప్పి. ఈ రకమైన నొప్పి చాలా జలదరింపుతో బాధిస్తుంది.
విసెరల్: విసెరల్ నొప్పి క్యాన్సర్ సంబంధిత నొప్పిలో 28% ఉంటుంది. విసెరా అనేది ఛాతీ, ఉదరం లేదా పొత్తికడుపు వంటి అవయవాలను సూచిస్తుంది. అటువంటి ప్రాంతాల్లో వచ్చే నొప్పిని విసెరల్ నొప్పి అంటారు. క్యాన్సర్ పరంగా, కణితి ఈ అవయవాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఒత్తిడిని కలిగించినప్పుడు, అది నొప్పికి దారి తీస్తుంది.
తీవ్రమైన, దీర్ఘకాలిక నొప్పి: తీవ్రమైన నొప్పి సాధారణంగా అప్పటికప్పుడు వచ్చి వెంటనే పోతుంది. మరోవైపు, దీర్ఘకాలిక నొప్పి నెలల తరబడి ఉంటుంది.
* క్యాన్సర్ పెయిన్ ఎలా ఉంటుంది?
క్యాన్సర్‌తో సంబంధం ఉన్న నొప్పి డల్ గా, నొప్పిగా, షార్ప్ గా లేదా మంటగా ఉంటుంది. క్యాన్సర్ నొప్పి నిరంతరం రావచ్చు. క్యాన్సర్ నొప్పి తేలికపాటి, మితమైన లేదా తీవ్రమైనది కూడా కావచ్చు. క్యాన్సర్ జబ్బు సమీపంలోని కణజాలంలోకి విస్తరించినా లేదా కణజాలాన్ని పాడు చేసినా అది నొప్పికి దారి తీయవచ్చు. కణితి పెరిగేకొద్దీ, అది నరాలు, ఎముకలు లేదా అవయవాలను పాడుచేస్తుంది. ఈ కణితి నొప్పిని కలిగించే రసాయనాలను కూడా విడుదల చేస్తుంది.
డాక్టర్లను ఎప్పుడు సంప్రదించాలి?
మీకు చురుక్కుమనే నొప్పి, నిరంతర నొప్పి లేదా మళ్లీ మళ్లీ నొప్పి వస్తున్నట్లయితే మీరు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీ నొప్పి తీవ్రత, నొప్పి స్థానం, మీకు కత్తిపోటుగా నొప్పి వస్తుంది లేదా వేరే విధంగానా? నొప్పిని అదే సమయంలో పెరుగుతుంది? ఏదైనా పనిచేస్తున్నప్పుడు నొప్పి వస్తుందా? మీరు నొప్పి నివారణ చర్యలు తీసుకున్నారా? తీసుకుంటే అవెలా హెల్ప్ అయ్యాయి? అనే ప్రశ్నలు డాక్టర్ అడిగే అవకాశం ఉంది. అందుకే మిమ్మల్ని మీరు ఒకసారి బాగా పరిశీలించుకుని మీ నొప్పి గురించి పూర్తిగా తెలుసుకోండి. మీకు ఎంత నొప్పి ఉంది అనేది మీకు ఉన్న క్యాన్సర్ రకం, స్థానం, మీరు ఉన్న క్యాన్సర్ స్టేజ్ తో సహా అనేక రకాల కారకాలపై ఆధారపడి ఉండవచ్చు.
ఇగ్నోర్ చేయకూడని క్యాన్సర్ లక్షణాలు
విపరీతమైన అలసట, రక్తస్రావం, అకారణంగా వచ్చే గాయాలు, ఉన్నట్టుండి బరువు తగ్గడం, ఆకస్మికంగా గడ్డల బాడీలో పెరగడం, చర్మంలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవడం చాలా ముఖ్యం.
* క్యాన్సర్ నొప్పికి చికిత్స
క్యాన్సర్ నొప్పికి చికిత్స చేయవచ్చు. మీ నొప్పి తీవ్రతను బట్టి వైద్యులు ఓవర్-ది-కౌంటర్ పెయిన్ రిలీవర్స్, ఇతర ప్రిస్క్రిప్షన్ మందులను సూచించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Health benifits, Lifestyle