హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Sunglasses: సమ్మర్‌లో కూలింగ్ గ్లాసెస్ వాడితే కళ్లు డ్యామేజ్ అవుతాయా..?

Sunglasses: సమ్మర్‌లో కూలింగ్ గ్లాసెస్ వాడితే కళ్లు డ్యామేజ్ అవుతాయా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సన్ గ్లాసెస్ ధరించడం వల్ల కళ్లు దెబ్బతింటాయా అని చాలామంది నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే తాజాగా ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Sunglasses: వేసవిలో(Summer) తీవ్రమైన ఎండల నుంచి కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్(Sunglasses) ధరిస్తుంటారు. ముఖ్యంగా బైక్‌లపై వెళ్తున్నప్పుడు వడగాలుల ప్రభావం కంటి మీద పడకుండా చాలామంది కూలింగ్ గ్లాసెస్‌ను వాడుతుంటారు. వీటిని పెట్టుకోవడం వల్ల కళ్ల దగ్గర చల్లగా ఉంటుంది. అయితే సన్ గ్లాసెస్ ధరించడం వల్ల కళ్లు దెబ్బతింటాయా అని చాలామంది నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే తాజాగా ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.

హెల్త్ ఆప్టిమైజింగ్ బయోహ్యాకర్, సైకాలజీ స్పెషలిస్ట్ టిమ్ గ్రే, తన ఇన్ స్టాగ్రామ్‌ అకౌంట్‌లో కళ్ల ఆరోగ్యాన్ని సన్ గ్లాసెస్ ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఓ పోస్ట్ ద్వారా వివరించారు. సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాలు చర్మంతో పాటు కళ్లకు హాని కలిగిస్తాయి. అందుకే చాలా మంది చర్మానికి సన్‌స్క్రీన్‌ అప్లై చేస్తుంటారు. అలాగే కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్ ధరిస్తుంటారు. అయితే వీటి వాడకంతో కంటి ఆరోగ్యం దెబ్బతింటుందని టిమ్ గ్రే అంటున్నారు. అందుకు కారణాలను ఇన్‌స్టా ఫోస్ట్‌లో పేర్కొన్నారు.

* మెదడుకు తప్పుడు సంకేతాలు

‘ఎండ తీవ్రత కారణంగా సూర్యుని నుంచి వచ్చే కిరణాలను కళ్లు ఫిల్టర్ చేస్తాయి. ఎండగా ఉందని మెదడుకు తెలియజేసేందుకు కళ్లు పిట్యుటరీ & పీనియల్ గ్రంథులకు సంకేతాలు పంపుతుంది. చర్మం నేరుగా సూర్యరశ్మి నుంచి విటమిన్ D తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే సన్ గ్లాసెస్ ధరించడంతో పరిసరాలు మేఘావృతమయ్యాయని మెదడు భావించే అవకాశం ఉంది. దీంతో ఎండను తట్టుకునేలా చర్మానికి అవసరమైన సంకేతాలను మెదడు ఇవ్వదు’ అని టిమ్ చెబుతున్నారు. దీంతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు.

‘సన్ గ్లాసెస్ ధరించడం వల్ల మనిషి శరీరంలోని సిర్కాడియన్ రిథమ్‌ దెబ్బతిని నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది. తీవ్రమైన అలసట, డిప్రెషన్, సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు.’ అంటూ టిమ్ ఇన్‌స్టా పోస్ట్‌లో వివరించారు.

Acne: మొటిమలకు, అవయవాల ఆరోగ్యానికి సంబంధం.. ఏ ప్లేస్‌లో మొటిమలు దేనికి సంకేతం?

* కళ్లపై ఒత్తిడితో దృష్టి లోపం

సన్ గ్లాసెస్ అదే పనిగా వాడితే కళ్లు సహజ కాంతిని చూడటానికి ఇబ్బంది ఉంటుందని, కళ్లపై ఒత్తిడి ఏర్పడి, దృష్టి లోపానికి దారితీవయచ్చని గ్రే పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొలంబియా యూనివర్సిటీ చేపట్టిన ఓ స్టడీ రిజల్ట్స్‌ను గ్రే హైలెట్ చేశారు. ‘సన్ గ్లాసెస్ UV కిరణాలను నిరోధించకపోతే కళ్లకు హానికరం. సాధారణంగా కళ్లు కాంతికి అనుగుణంగా ఉంటాయి. ముదురు సన్ గ్లాసెస్ ధరించినప్పుడు, కాంతి మసకగా ఉన్నప్పుడు విజన్ కోసం కళ్లు సహజంగా విస్తరిస్తాయి. ఈ సమయంలో UV కిరణాలను సన్ గ్లాస్ నిరోధించకపోతే కంటిపై తీవ్ర ప్రభావం పడుతుంది.’ అని కొలంబియా యూనివర్సిటీ స్టడీలో వెల్లడయిందని గ్రే పేర్కొన్నారు.

అయితే సన్ గ్లాసెస్ లెన్స్ UV కిరణాలను నిరోధిస్తే వాటిని ధరించడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని, కంటితో పాటు, కళ్ల చుట్టూ ఉండే చర్మానికి ప్రొటెక్షన్ ఉంటుందని గ్రే తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

First published:

Tags: Summer tips

ఉత్తమ కథలు