హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Spot Walking: స్పాట్​ వాకింగ్​తో ప్రయోజనాలేంటి? దీని వల్ల క్యాలరీలు కరుగుతాయా? తెలుసుకోండి

Spot Walking: స్పాట్​ వాకింగ్​తో ప్రయోజనాలేంటి? దీని వల్ల క్యాలరీలు కరుగుతాయా? తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా చాలా చోట్ల పార్కులను మూసివేశారు. దీంతో ఇంట్లోనే వ్యాయామం చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ట్రెడ్​మిల్​పై లేదా ఒకే స్థలంలో ఇంట్లో నడుస్తూ కూడా శరీరానికి పని చెబుతున్నారు. అయితే ఇలాంటి స్పాట్ వాకింగ్ నిజంగానే మీ క్యాలరీలను తగ్గిస్తుందా? అనే విషయంపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

ఇంకా చదవండి ...

కరోనా తర్వాత ప్రజల జీవనశైలి చాలా వరకు మారింది. మనిషికి రోగనిధక శక్తి ఎంత అవసరమో తెలిసొచ్చింది. దీంతో ఇప్పుడు చాలామంది వ్యాయామం, బాడీ ఫిట్​నెస్​పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఒకప్పుడు జిమ్​లో బరువులు ఎత్తడం, పార్కుల్లో పరిగెత్తడం వంటివి మాత్రమే వ్యాయామంగా భావించేవారు. కానీ ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణలో నడక ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. నడక అనేది సులభమైన చక్కటి వ్యాయామం. నడక లేదా పరుగెత్తడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే కరోనా కారణంగా చాలా చోట్ల పార్కులను మూసివేశారు. దీంతో ఇంట్లోనే వ్యాయామం చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ట్రెడ్​మిల్​పై లేదా ఒకే స్థలంలో ఇంట్లో నడుస్తూ కూడా శరీరానికి పని చెబుతున్నారు. అయితే ఇలాంటి స్పాట్ వాకింగ్ నిజంగానే మీ క్యాలరీలను తగ్గిస్తుందా? అనే విషయంపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

దీనిపై ఫిట్​నెస్ ట్రైనర్లు క్లారిటీ ఇస్తున్నారు. ఒకే స్థలంలో 30 నిమిషాల నడక కూడా మెరుగైన ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. దీని ద్వారా మీ శరీరంలోని క్యాలరీలను బర్న్ చేసుకోని బరువు తగ్గించుకోవచ్చు. అంతేకాక, మీ హృదయ స్పందన రేటును మెరుగుపర్చుకోవచ్చు. ఇది మీ కండరాలు బాగా పనిచేయడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి బాగా సహకరిస్తుంది. ఎటువంటి అదనపు శ్రమ అవసరం లేకుండా మీ కేలరీలను కాల్చేస్తుంది. ఈ లాక్​డౌన్​ సమయంలో మీ బరువు తగ్గించుకునేందుకు ఇది ఉత్తమమైన మార్గమని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు.

నడక ప్రాధాన్యత ఏంటి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, అనేక హృదయ సంబంధ వ్యాధులు, టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, క్యాన్సర్​ వంటి వ్యాధులకు నడక చెక్​ పెడుతుంది. అందువల్ల, వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎక్కువ సేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చుంటే రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. ఇది అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ పెరగడానికి దారితీస్తుంది. ఇది మీ శరీరానికి చాలా ప్రమాదకరమైనది. అందువల్ల, మీ మెరుగైన ఆరోగ్యం కోసం నడక చాలా సులభమైన మార్గం. మీరు ఒకే స్థలంలో నడిచినా లేదా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి నడిచినా, మీ కొలెస్ట్రాల్ ను కరిగించుకోవచ్చు. నడక ద్వారా మీ హృదయ స్పందన రేటును 60 నుంచి 70 శాతానికి పెంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


ఒకే స్థలంలో నడవడం విసుగు తెప్పిస్తుందా?

బయటి వాతావరణంలో కాకుండా ఒకే చోట నడవడం కాస్త విసుగు తెప్పించే అంశమే. కాకపోతే, ప్రస్తుత కరోనా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ వ్యాయామం మీకు లాభిస్తుంది. మీరు ఒకేసారి ఎక్కువ సమయం నడవడానికి బదులు రోజుకు 5 నిమిషాల పాటు అనేక సార్లు నడవడం ప్రారంభించండి. ప్రస్తుతం, ఎక్కువ మంది వర్క్​ ఫ్రం హోమ్​ చేస్తున్నారు. కాబట్టి, మీ పని మధ్యలో చిన్న విరామం తీసుకొని కాసేపు నడవండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రయత్నం చాలా చిన్నదిగా అనిపించవచ్చు. కానీ ఇవి మీ ఆరోగ్య లక్ష్యాలను సాధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని ట్రైనర్లు విశ్లేషిస్తున్నారు.

First published:

Tags: Lifestyle

ఉత్తమ కథలు