హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణం చేయవచ్చా..?

ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణం చేయవచ్చా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Travel during Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణం చేస్తే ఏం జరుగుతుంది? గర్భానికి ఏమైనా ప్రమాదం ఉందా? అంటే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.

  బిడ్డను కనడం.. దంపతుల కల. స్త్రీ గర్భం దాల్చిందంటే ఇంటిల్లిపాదికి పండగే. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో చాలా ప్రశ్నలు వస్తుంటాయి. అది చేస్తే మంచిది.. ఇది చేస్తే మంచిది అంటూ చాలా మంది సలహాలు ఇస్తుంటారు. ఇందులో అతి ముఖ్యమైనది ప్రయాణం. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రయాణం చేస్తే ఏం జరుగుతుంది? గర్భానికి ఏమైనా ప్రమాదం ఉందా? అంటే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. స్త్రీ గర్భం దాల్చాక ప్రయాణాలను దాదాపు పక్కన పెట్టేయాలని చెబుతున్నారు. ముఖ్యంగా గర్భం దాల్చినట్లు కన్ఫామ్ కాగానే ప్రయణాలను దూరం పెట్టాలట. ఐదు నెలల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దూర ప్రయాణాలు చేయకూడదని స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత 8 నెలల నుంచి బిడ్డ పుట్టే వరకు కూడా మంచం కదలవద్దని అంటున్నారు. ఇప్పుడున్న ఆహార అలవాట్ల వల్ల చాలా మందికి మిస్ క్యారేజ్ అయ్యే ప్రమాదం ఉంటోందని.. ఒకప్పుడు బలవర్ధక ఆహారం తీసుకోవడం వల్ల గర్భవతులు వ్యవసాయం చేసినా ఏ సమస్య ఉండేది కాదని వివరిస్తున్నారు.

  ఇక.. తప్పనిసరి ప్రయాణాలు చేయాల్సి వస్తే.. వాహనం సౌలభ్యంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రయాణ సమయంలో కచ్చితంగా వైద్య పరీక్షల రిపోర్టులు ఉంచుకోవాలని చెబుతున్నారు. తలనొప్పి, కడుపులో వికారం తదితర ఇబ్బందులు వస్తే ప్రయాణాలను దూరం పెట్టాలని స్పష్టం చేస్తున్నారు.

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: Health benifits, Women health

  ఉత్తమ కథలు