Home /News /life-style /

HEALTH CALCIUM SOURCES CALCIUM IS ESSENTIAL FOR BONE STRENGTH AND DO YOU KNOW WHICH ONE IS AVAILABLE IN ABUNDANCE GH VB

Calcium Sources: ఎముకల దృఢత్వానికి కాల్షియం అవసరం.. మరి అది వేటిలో పుష్కలంగా లభిస్తుందో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎముకలు, దంతాల దృఢత్వం, గుండె లయను నియంత్రించడం, నరాల పనితీరు మెరుగుపర్చడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత కాల్షియం లేకపోవడంతో పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.

ఆరోగ్యమే(Health) మహా భాగ్యం.. అంటే ఆరోగ్యం బాగా ఉంటే అని ఉన్నట్లే అని అర్థం. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవన శైలిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. జనాలు జంక్ ఫుడ్‌కు(Junk Foods) అలవాటుపడ్డారు. దీంతో ఇటీవల అనారోగ్య సమస్యలు భారీగా పెరిగాయి. మరి ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం(Food) తీసుకోవడం ఎంతో అవసరం. ఇందులో కాల్షియం(Calcium) ఉండేలా చూసుకోండి. ఎముకలు(Bones), దంతాల దృఢత్వం, గుండె(Heart) లయను నియంత్రించడం, నరాల పనితీరు మెరుగుపర్చడంలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత కాల్షియం లేకపోవడంతో పిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. శరీరంలో కాల్షియం లోపం ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అలసిపోయినట్లు అనిపించడం, దంత సమస్యలు, పొడి చర్మం, కండరాల తిమ్మిరి తదితర లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా థైరాయిడ్, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, జీవక్రియ మందగించడం, హార్మోన్ల సమస్యలు, హెచ్‌ఆర్‌టి, నెలసరి సమస్యలు ఉన్న మహిళలు ఎక్కువగా కాల్షియం లోపంతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు అంటున్నారు.

Rare Occurrence: ఆకాశంలో అద్భుతం.. ఒకే సరళరేఖపై కనిపించనున్న నాలుగు గ్రహాలు.. ఎలా చూడాలంటే..


కాల్షియం లోపం కారణంగా శరీరం విటమిన్ డిని ఎక్కువగా గ్రహిస్తుంది. బలమైన ఎముకలు, దంతాలు, జుట్టు కోసం కాల్షియం అవసరం. ఆయుర్వేదం ప్రకారం... జుట్టు ఆరోగ్యం కూడా కాల్షియంపై ఆధారపడి ఉంటుంది. కాల్షియం కండరాల సంకోచాలు, నరాల పనితీరు, హృదయ స్పందనలను నియంత్రిస్తుంది. రక్తం గడ్డకట్టడంలో కూడా కాల్షియం సహాయపడుతుంది.

కొన్ని సందర్భాల్లో విటమిన్- డి లేకపోవడం కారణంగా కాల్షియం లోపాన్ని మనం గమనించవచ్చు. ఫాస్ఫేట్, మెగ్నీషియం, అయాన్‌, కాల్షియంతో పాటు విటమిన్-డి కూడా పేగు ఆరోగ్యాన్ని సులభతరం చేస్తుంది. ఒకవేళ విటమిన్-డి తక్కువగా ఉంటే ఆహారంలోని కాల్షియాన్ని శరీరం సమర్థవంతంగా గ్రహించలేదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటారు. దీనిబట్టి శరీరానికి కాల్షియంతో పాటు విటమిన్-డి కూడా అవసరమే. ఇందుకోసం ప్రతి రోజు ఎండలో 20 నిమిషాలు ఉంటే శరీరానికి కావాల్సిన కాల్షియం దొరుకుతుంది. సహజసిద్ధంగా కాల్షియం అధికంగా లభించే కొన్ని ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం.

* ఉసిరి
ఉసిరికాయలో విటమిన్ సి, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. పచ్చి పండ్లు, రసం, పొడి, షర్బత్ తదితర రూపంలో తీసుకోవచ్చు. అయితే కీళ్ల నొప్పులు ఉన్నవారు ఉసిరి తీసుకోకపోవడమే మంచిది.

Astrology | Zodiac Signs: టీనేజ్‌లో ఎంతో మెచూరిటీతో వ్యవహరించే రాశులవారు వీరే.. మీ రాశి ఉందేమో చూడండి..


* మునగ
వీటి ఆకుల్లో కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, సీ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 1 స్పూన్ మునగ ఆకుల పొడిని తీసుకుంటే పిత్త సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

* నువ్వులు
నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ నలుపు/తెలుపు నువ్వులను తీసుకోండి. వాటిని దోరగా వేయించండి. వాటికి ఒక టీస్పూన్ బెల్లంతోపాటు నెయ్యిని కలపండి. ఆ మిశ్రమాన్ని లడ్డు ఆకారంలో చుట్టండి. వీటిని ప్రతి రోజూ తీసుకుంటే మీలో కాల్షియం స్థాయి రోజురోజుకి పెరిగిపోతాయి.

* పాలు
పాలలోని కాల్షియాన్ని శరీరం సులభంగా గ్రహిస్తుంది. రోజూ ఒక గ్లాసు పాలు తాగడం వల్ల కాల్షియం సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మనిషి శరీరంలో సాధారణ కాల్షియం స్థాయి 8.5 నుండి 10.2 mg/dl వరకు ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Calcium, Health, Health benefits, Lifestyle

తదుపరి వార్తలు