Vitamin D Deficiency: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ?.. అయితే మీకు విటమిన్‌ డి లోపం ఉండే అవకాశం

ప్రతీకాత్మక చిత్రం

Vitamin D Deficiency: కొవిడ్‌-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం మొదలు పెట్టిన తర్వాత రెండు రకాల విటమిన్ల గురించి ప్రపంచం ఆసక్తిగా చర్చించుకుంటోంది.

  • Share this:
మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్లు కీలక పాత్రపోషిస్తాయి. విటమిన్ల పరిమాణం స్వల్పమే అయినప్పటికీ అవి ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతాయి. గతేడాది కొవిడ్‌-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం మొదలు పెట్టిన తర్వాత రెండు రకాల విటమిన్ల గురించి ప్రపంచం ఆసక్తిగా చర్చించుకుంటోంది. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సి ఒకటైతే.. రెండోది సూర్మరశ్మి ద్వారా శరీరం తయారు చేసుకునే విటమిన్‌ డి. మన శరీరంలోని ఎముకలను బలంగా ఉంచడంలోనే కాదు కొన్ని రకాల క్యాన్సర్లను నివారించడంలో విటమిన్‌ డి సాయపడుతుంది.

*విటమిన్‌ డి ఎవరికి ఎంత అవసరం:
విటమిన్‌ డి కి సంబధించిన కొలతను ఇంటర్నేషనల్‌ యూనిట్‌ అంటారు. ఏడాదిలోపు శిశువులకు 400 ఇంటర్నేషనల్‌ యూనిట్స్.. పిల్లలు, టీనేజర్లు, 70 ఏళ్ల లోపు వయస్సు వారికి 600 ఇంటర్నేషనల్‌ యూనిట్స్.. గర్భిణులు, 71 ఏళ్లు పైబడిన వారికి 800 ఇంటర్నేషనల్‌ యూనిట్స్ వరకు ఈ పోషకం అవసరమవుతుంది.

* విటమిన్‌ డి పొందడం ఎలా?
వారంలో రెండు నుంచి మూడుసార్లు ఎండలో 10 నుంచి 15 నిమిషాలు నిల్చుంటే చాలు. ముఖం, మోచేతులు, వీపు, కాళ్లకు ఎండ తగిలేలా చూసుకోవాలి. శరీరానికి కావాల్సిన విటమిన్‌ డి పోషకం అందుతుంది.

* ఎవరిలో ఎక్కువ లోపం కనిపిస్తుంది
ఊబకాయం, డయాబెటిస్‌ రోగుల్లో విటమిన్‌ డి లోపం తరచూ కనిపిస్తుంది. ఈ రెండు వ్యాధులు ఉంటే కొవిడ్‌-19 ద్వారా మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది. మరి ఒక వ్యక్తిలో ఎటువంటి రక్తపరీక్షలు నిర్వహించకుండా విటమిన్‌ డి లేదా ఎండ పోషక లేమి

* విటమిన్ డి లోపాన్ని ఎలా గుర్తించాలి?
విటమిన్‌ డి లోపం ఉంటే మనం శరీరమే సంకేతాలు పంపుతుంది. వాటి ఆధారంగా డాక్టర్లు పరీక్షించి నిర్ధారిస్తారు. సాధారణంగా ఏ వ్యక్తిలోనైనా విటమిన్ డి లోపం తలెత్తితే అది నాలుక ద్వారా బయటపడుతుంది. నాలుక మండినట్టు అనిపించిందంటే.. విటమిన్ డి లోపమే కారణమంటారు డాక్టర్లు. ఈ మండుతున్న నొప్పి అన్నది సాధారణంగా పెదాలు లేదా నాలుక లేదా నోరంతా కూడా ఉంటుంది.

నాలుక మంట, విటమిన్‌ లోపంపై అమెరికాలోని రోచెస్టర్ నగరానికి చెందిన మయో క్లినిక్‌ పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఈ సమస్యతో బాధపడే వారందరికీ రకరకాల పరీక్షలు నిర్వహించారు అక్కడి వైద్యులు. విటమిన్‌ లోపం వల్లే ఆ సమస్య తలెత్తుతోందనే విషయాన్ని వారు గుర్తించారు. అయితే ఆ లోపం ఏంటన్నది డాక్టర్లు మాత్రమే నిర్ధారించగలరు.

Benefits Of Ghee: నెయ్యి వల్ల ఎన్నో ప్రయోజనాలు.. ఈ రకమైన అనారోగ్యాలకు చెక్ పెట్టండి

TSRTC: తెలంగాణ ఆర్టీసీకి సీఎం కేసీఆర్ బిగ్ షాక్... నాలుగు నెలలే గడువు

* విటమిన్‌ డి లోపానికి చికిత్స
నాలుక మంట లక్షణాలు కలిగిన రోగులకు విటమిన్‌ డి సప్లిమెంట్‌ ఇవ్వడం ద్వారా రెండు వారాల్లోనే అది నయమైనట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. ఎండ తక్కువుగా ఉండే చలి కాలంలో చాలా మందికి డాక్టర్లు నోటి ద్వారా తీసుకునే విటమిన్‌ డి ఔషధాలు సూచిస్తారు. 50 ఏళ్లు పైబడిన వారితో పోల్చితే యువతలో విటమిన్‌ డి గ్రహించే శక్తి ఎక్కువుంటుంది. ఈ విటమిన్ డి ని సూర్యరశ్మి ఉపయోగించి చర్మం తయారు చేస్తుంది.
Published by:Kishore Akkaladevi
First published: