హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Health Tips: బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి కాదు... ఎందుకంటే... ఇవీ కారణాలు...

Health Tips: బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరి కాదు... ఎందుకంటే... ఇవీ కారణాలు...

బరువు తగ్గాలనుకుంటున్నా, ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ తినడం ఇష్టం లేకపోయినా... మీకు ఈ ఆర్టికల్ బాగా నచ్చుతుంది. కారణమేంటో తెలుసుకోండి మరి.

బరువు తగ్గాలనుకుంటున్నా, ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ తినడం ఇష్టం లేకపోయినా... మీకు ఈ ఆర్టికల్ బాగా నచ్చుతుంది. కారణమేంటో తెలుసుకోండి మరి.

బరువు తగ్గాలనుకుంటున్నా, ఉదయం వేళ బ్రేక్‌ఫాస్ట్ తినడం ఇష్టం లేకపోయినా... మీకు ఈ ఆర్టికల్ బాగా నచ్చుతుంది. కారణమేంటో తెలుసుకోండి మరి.

ఉదయం లేచిన గంటలోపే బ్రేక్‌ఫాస్ట్ చేయాలన్నది ఇన్నాళ్లూ చెబుతున్న మాట. తాజాగా కొన్ని అధ్యయనాలు, జర్నల్స్, ది కరెంట్ పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ జర్నల్ ప్రకారం... బ్రేక్‌ఫాస్ట్ కంటే... మధ్యాహ్నం తినే భోజనం అతి ముఖ్యమైనది. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం చాలా ఎనర్జీని ఉపయోగించుకుంటుంది. అందువల్ల లేవగానే బలమైన ఆహారం తినాలని డాక్టర్లు ఇన్నాళ్లూ చెబుతూ వచ్చారు. ఉదయం వేళ అరటిపండ్లు, ధాన్యాలు, బాదం, పాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలని వివరించారు. కానీ... బ్రేక్‌ఫాస్ట్ అంత ముఖ్యమైనదేమీ కాదంటున్నాయి తాజా అధ్యయనాలు. చాలా మంది రాత్రివేళ ఎక్కువగానే భోజనం చేస్తున్నారు. ఆ తర్వాత వెంటనే నిద్రపోతున్నారు. అలా నిద్రపోయినప్పుడు ఆహారం అరగకుండా... పొట్టలోనే ఉండిపోతోంది. తెల్లారి లేచిన తర్వాత... అది అరిగేలోపే... బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. ఫలితంగా కేలరీలు ఎక్కువవుతున్నాయి.

మీరు కేలరీలు తగ్గించుకోవాలనుకుంటే, బరువు తగ్గాలనుకుంటే... బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తినకపోవడమే మంచిది. ఎవరెవరో ఏదేదో చెబుతుంటే... అవన్నీ పాటించడం మానేసి... మీ పొట్ట మాట వినండి. పొట్టలో ఆల్రెడీ ఆహారం ఉన్నట్లుగా, బరువుగా అనిపిస్తే... బ్రేక్ ఫాస్ట్ ఎగ్గొట్టినా తప్పులేదు. ఆకలి లేనప్పుడు బలవంతంగా తినడం కరెక్టు కాదు.

Breakfast-Feature
ప్రతీకాత్మక చిత్రం

బాడీకి ఆహారం అవసరమైతే... ఆటోమేటిక్‌గా ఆకలి వేస్తుందనీ, అప్పుడు మాత్రమే ఆహారం తీసుకుంటే, మంచిదంని సూచిస్తున్నారు సెలబ్రిటీ లైఫ్‌స్టైల్ కోచ్ ల్యూక్ కౌటిన్హో. బాడీ నుంచీ వ్యర్థాలు బయటకు వెళ్లిపోయిన తర్వాతే... ఆహారం తీసుకోవడం సరైనది అని సూచిస్తున్నారు.

తాజా అధ్యయనాల ప్రకారం... ఉదయం వేళ ఎక్కువ ఆహారం తినడం కరెక్టు కాదు. దాని బదులు... మధ్యాహ్నం భోజనం చక్కగా చేసి... సాయంత్రం స్నాక్స్ తిని... రాత్రికి మళ్లీ భోజనం చేస్తే మంచిదంటున్నారు. సాయంత్రం స్నాక్స్ కింద... వేరుశనగ గింజలు, బఠాణీలు, మరమరాలు వంటివి తినమంటున్నారు. అవి సరిపోవు అనుకుంటే, చపాతీ, ఇడ్లీ, పోహ వంటివి కూడా తినవచ్చని చెబుతున్నారు. సాయంత్రం వేళ టీ, కాఫీ లాంటివి తాగేసి ఊరుకోవద్దంటున్నారు. అలా చేస్తే... యాసీడీటీ సమస్య వస్తుందని హెచ్చరిస్తున్నారు.

breakfast ideas, breakfast food, healthy breakfast, healthy breakfast indian, healthy breakfast ideas, breakfast food ideas, అల్పాహారం, బ్రేక్ ఫాస్ట్, ఆరోగ్యం, మంచి అల్పాహారం
ప్రతీకాత్మక చిత్రం

ఈవెనింగ్ స్నాక్స్ తినడం వల్ల... రాత్రివేళ ఎక్కువ ఆహారం తినాల్సిన అవసరం ఉండదు. అందువల్ల తెల్లారి... పొట్ట బరువుగా అనిపించదు. ఆకలి వేసేందుకు, లైట్‌గా బ్రేక్‌ఫాస్ట్ తీసుకునేందుకు కూడా వీలవుతుంది. కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ మానేసినా పర్వాలేదు గానీ... సాయంత్రం స్నాక్స్ మాత్రం మానవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు.

First published:

Tags: Health, Health benifits, Tips For Women, Women health

ఉత్తమ కథలు