దంపతులు ఒక ఆరోగ్యకరమైన బిడ్డ (Healthy Child)కు జన్మనివ్వడానికి ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి పంట పండించడానికి ఒక రైతుకు సరైన వాతావరణం, సారవంతమైన నేల, మంచి విత్తనాలు ఎలా అవసరమో అవుతాయో, బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే దంపతులకు కూడా సరైన పరిస్థితులు అవసరమవుతాయి. ఈ అవసరాన్ని భారత ప్రాచీన వైద్య విధానం ఆయుర్వేదం (Ayurveda) నొక్కి చెబుతోంది. పిల్లలను కనాలని ప్లాన్ చేసుకునే ముందు దంపతులు పంచకర్మ (Panchakarma) అనే చికిత్సల ద్వారా తమ శరీరాలను శుభ్రపరచుకోవాలని (Detoxify) ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ రేష్మ సూచిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకోండి.
* పంచకర్మ చికిత్సలు
పంచకర్మ చికిత్సలలో వామన (Vamana), విరేచన (Virechana), బస్తీ (Basthi)లతో పాటు మొత్తం ఐదు విధానాలు ఉంటాయి. ఈ చికిత్సలలో తగిన చికిత్సను పొందడం ద్వారా బిడ్డను కనడానికి శరీరాలను హెల్దీగా సిద్ధం చేసుకోవచ్చు.
- వామన చికిత్స అనేది శరీరం నుంచి ఎక్స్‌ట్రా కఫా (కఫం/phlegm)ను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇది సాధారణంగా ఉబ్బసం, బ్రోన్కైటిస్, సైనసిటిస్ వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి చేసే చికిత్స.
- విరేచన చికిత్స అనేది శరీరం నుంచి అదనపు పిత్త/పైత్యము (Bile)ను తొలగించడానికి సహాయపడుతుంది. కామెర్లు, చర్మ వ్యాధులు, ఉదర, ప్రేగుల రుగ్మతలతో బాధపడుతుంటే ఈ చికిత్స చేస్తారు.
- బస్తీ చికిత్స శరీరం నుంచి అదనపు వాత (గాలి)ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, నడుము నొప్పి, సయాటికా వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి చేసే చికిత్స.
- పంచకర్మ చికిత్సలలో నస్య, అభ్యంగ కూడా ఉన్నాయి. నాస్యా అనేది ముక్కు ద్వారా ఔషధ నూనెలు లేదా పౌడర్లు పంపించే చికిత్సా ప్రక్రియ. ఈ ప్రక్రియను తలనొప్పి, సైనసిటిస్, కొన్ని నాడీ సంబంధిత అనారోగ్యాలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. అభ్యంగ చికిత్స మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
* చికిత్సల తర్వాత సెక్స్‌కు దూరం
పంచకర్మ చికిత్సలు ప్రతి వ్యక్తి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. పైన చెప్పినట్లు ఏ సమస్యతో బాధపడుతున్నారో దానికి అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఈ చికిత్సా విధానాలను కలిపి తీసుకుంటే మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాడీ డిటాక్సిఫై అవుతుంది. ఈ చికిత్సల తర్వాత, దంపతులు ఒక నెలపాటు సెక్స్‌కు దూరంగా ఉండాలి. సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి మందులు వాడాలి. ఈ దశలను అనుసరించడం ద్వారా, దంపతుల శరీరాలు గర్భం దాల్చడానికి మెరుగైన స్థితిలో ఉంటాయని, ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశాలు మెరుగుపడతాయని ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ రేష్మ చెబుతున్నారు.
* బీజా సంస్కర్
బీజా సంస్కర్ (Bija Sanskar) అనేది గర్భం ధరించే ముందు దంపతులు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి ఉపయోగించే పదం. బీజా సంస్కర్ అంటే దంపతులు తమ లైఫ్ స్టైల్ హెల్దీగా మార్చుకోవాలి. ఆహారంలో మార్పులు చేయాలి, యోగా, ధ్యానం, ఆయుర్వేద చికిత్సల వంటి పద్ధతులను అనుసరించాలి. దంపతులు బిడ్డ పుట్టడానికి కనీసం 3-6 నెలల ముందు ఈ పద్ధతులను ప్రారంభించాలి. గర్భం దాల్చడానికి ముందు బీజా సంస్కార్ పద్ధతులను అనుసరించే మహిళలు చాలా తక్కువ సమస్యలు ఫేస్ చేస్తారు. అంతేకాదు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తారు. గర్భధారణ సమయంలోనూ వీరికి సుఖవంతమైన మాతృత్వ ప్రయాణం లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health care, Pregnancy