#BlackCoffee: రోజూ తాగితే బ్లాక్ కాఫీ... లైఫ్ హ్యాపీ హ్యాపీ

Black Coffee: కాఫీ తాగ‌డం అంత మంచిది కాదు.. అని అంటుంటారు చాలా మంది. కానీ.. బ్లాక్ కాఫీ తాగ‌డం వ‌ల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయ‌ని తాజా ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

news18-telugu
Updated: February 12, 2019, 11:47 AM IST
#BlackCoffee: రోజూ తాగితే బ్లాక్ కాఫీ... లైఫ్ హ్యాపీ హ్యాపీ
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 12, 2019, 11:47 AM IST
ఉద‌యం లేవ‌గానే వేడివేడి పొగ‌లు క‌క్కుతున్న కాఫీని ఓ సిప్పేస్తే చాలు.. అప్ప‌టివ‌ర‌కు ఉన్న నిద్ర‌మ‌త్తు మొత్తం వ‌ద‌లాల్సిందే. ఎంత అల‌స‌ట‌గా ఉన్నా.. మ‌రెంత ప‌నిలో ఉన్నా స‌రే.. కాఫీని కాసింత తాగి చూడండి. ఆహా.. ఒక్క‌క్ష‌ణంలో ఆ మొత్తం నీర‌సం నీరుగారిపోతుంది. ఈ అనుభూతి పొందిన వారెంద‌రో సినీ క‌వులు.. సాంగ్స్ సింగారంటేనే అర్థ‌మ‌వుతుంది కాఫీ క‌మామీషు ఏంటో.. స‌ర్లేండి ఇంత‌కీ ఏంటి విష‌య‌మంటారా అదే పాయింట్ లోకి వెళ్లిపోదాం.

black coffee uses, black coffee benefits, black coffee diet plan, black coffee benefits for weight loss, black coffee how to make, black coffee health benefits, Health Tips, ఆరోగ్య సూత్రాలు, బ్లాక్ కాఫీ, హెల్త్ టిప్స్
ప్రతీకాత్మక చిత్రం


కాఫీ తాగ‌డం అంత మంచిది కాదు.. అని అంటుంటారు చాలా మంది. కానీ.. బ్లాక్ కాఫీ విష‌యంలో అలా కాదు. సాధార‌ణ కాఫీ కంటే బ్లాక్ కాఫీ తాగ‌డం వ‌ల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయ‌ని తాజా ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. దీనిపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్న వారు కూడా ఈ విష‌యాన్ని బ‌ల్ల‌గుద్దీ మ‌రీ చెబుతున్నారు.

black coffee uses, black coffee benefits, black coffee diet plan, black coffee benefits for weight loss, black coffee how to make, black coffee health benefits, Health Tips, ఆరోగ్య సూత్రాలు, బ్లాక్ కాఫీ, హెల్త్ టిప్స్
బ్లాక్ కాఫీ




రోజుకు 2 క‌ప్పుల బ్లాక్ కాఫీ తాగితే లివ‌ర్ ఆరోగ్యం ఎంతో బాగుంటుద‌ట‌.. సిర్రోసిస్ అనే వ్యాధి 80శాతం త‌గ్గుతుంద‌ని కూడా అంటున్నారు.

black coffee uses, black coffee benefits, black coffee diet plan, black coffee benefits for weight loss, black coffee how to make, black coffee health benefits, Health Tips, ఆరోగ్య సూత్రాలు, బ్లాక్ కాఫీ, హెల్త్ టిప్స్
బ్లాక్ కాఫీ


అంతేకాదండోయ్.. లివ‌ర్ క్యాన్స‌ర్ మ‌న ద‌రిదాపులోకి రాకుండా బ్లాక్ కాఫీ చేస్తుంద‌ట‌. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం, మెద‌డు యాక్టివ్ గా ప‌నిచేయ‌డం, మెట‌బాలిజం శాతం పెరిగి కొలెస్ట్రాల్ త‌గ్గ‌డం అద‌న‌పు లాభాల‌నుకోండి.

black coffee uses, black coffee benefits, black coffee diet plan, black coffee benefits for weight loss, black coffee how to make, black coffee health benefits, Health Tips, ఆరోగ్య సూత్రాలు, బ్లాక్ కాఫీ, హెల్త్ టిప్స్
బ్లాక్ కాఫీ


మీ జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు బరువు తగ్గేందుకు, కడుపుని శుభ్రం చేయడానికి, గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని పరిశోధనల్లో తేలాయి. బ్లాక్ కాఫీలో యాంటియాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ బీ2, బీ3, బీ5, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

black coffee uses, black coffee benefits, black coffee diet plan, black coffee benefits for weight loss, black coffee how to make, black coffee health benefits, Health Tips, ఆరోగ్య సూత్రాలు, బ్లాక్ కాఫీ, హెల్త్ టిప్స్
ప్రతీకాత్మక చిత్రం


చక్కర లేకుండా బ్లాక్ కాఫీ తీసుకోవడం ద్వారా మీరు శారీరకంగా, మానసికంగా యాక్టివ్‌గా ఉండేందుకు ఉపకరిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు మీలో కనిపించకుండా దాచేందుకు ఇది దోహదపడుతుంది.

black coffee uses, black coffee benefits, black coffee diet plan, black coffee benefits for weight loss, black coffee how to make, black coffee health benefits, Health Tips, ఆరోగ్య సూత్రాలు, బ్లాక్ కాఫీ, హెల్త్ టిప్స్
బ్లాక్ కాఫీ


అతి ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ వారికి బ్లాక్ కాఫీ సంజీవ‌నిలాంటిది. ఎందుకంటే ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్ర‌ణ‌లో ఉంచుతుంది. బ‌ద్ద‌క‌స్తుల‌కు కూడా బ్లాక్ కాఫీ మేలే చేస్తుంది. అదెలా సాధ్య‌మండి అంట‌రా? కాఫీ తాగ‌డం వ‌ల్ల వాకింగ్ చేసినంత ప్ర‌యోజ‌నాలని పొందొచ్చ‌ని తేలింది.

black coffee uses, black coffee benefits, black coffee diet plan, black coffee benefits for weight loss, black coffee how to make, black coffee health benefits, Health Tips, ఆరోగ్య సూత్రాలు, బ్లాక్ కాఫీ, హెల్త్ టిప్స్
బ్లాక్ కాఫీ


అలాగే మీరు క్యాన్సర్ బారినపడకుండా రక్షించడంతో పాటు..మానసిక ఒత్తిడి, అలసటను జయించి రోజంతా మీరు యాక్టివ్‌గా ఉంచేందుకు రోజూ ఒకట్రెండు కప్పుల బ్లాక్ కాఫీ సరిపోతుంది.

సో.. ఇంత తెలిసాక మీరు అంటారు కదా..రోజూ తాగితే బ్లాక్ కాఫీ.. లైఫ్ హ్యాపీ హ్యాపీ అని.
First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...