Best Foods For Teeth: మెరిసే దంతాల కోసం చూస్తున్నారా.. అయితే, మీ రోజూవారి ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..
ప్రతీకాత్మక చిత్రం
Best Foods For Teeth:నోటి ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. పంచదారతో తయారు చేసిన పదార్థాలు, దంతాలకు ఎక్కువ సమయం అతుక్కుని ఉండే తినుబండారాలు దంతాల ఆరోగ్యానికి హాని చేస్తాయి. పండ్లు, కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు, కూరగాయలు దంతాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి.
నోటి ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. పంచదారతో తయారు చేసిన పదార్థాలు, దంతాలకు ఎక్కువ సమయం అతుక్కుని ఉండే తినుబండారాలు దంతాల ఆరోగ్యానికి హాని చేస్తాయి. పండ్లు, కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు, కూరగాయలు దంతాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. క్రిములను నివారించడంలో ఈ ఆహారాలు సహాయపడతాయి. ఇవి దంతాలపై ఉండే పెర్లీ వైట్ కు అవసరమైన పోషకాలు అందిస్తాయి. పంచదారతో కూడిన పదార్థాలు అనేకసార్లు తినడం వల్ల కూడా దంతాలకు హాని చేస్తాయి. వీటి వల్ల దంత క్షయం వచ్చే ప్రమాదం ఉంది.
మధ్యాహ్న భోజనం తరవాత యాపిల్, నారింజ పండు మొత్తం తినడం వల్ల దంతాలు శుభ్రపడతాయి. ఇవి మీ దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాల్షియం, ఎక్కువ ప్రొటీన్లు ఉండే పదార్థాలు తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి నోటి ఆరోగ్యం మెరుగుపడుతుందని క్యాప్చర్ లైఫ్ డెంటల్ కేర్ వ్యవస్థాపకుడు, సీఈవో డాక్టర్ నమ్రతా రూపానీ వెల్లడించారు. పండ్లు తినడం వల్ల అందులో ఉండే కాల్షియం దంతాలను సహజంగా శుభ్రపరుస్తుంది. అవసరమైన పోషకాలు అందించడంలో పండ్లు సహాయపడతాయి. శీతల పానీయాలు, చాక్లెట్లు దంతాలకు హాని చేస్తాయి.
దంతాలకు ఉత్తమ ఆహారాలు
ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు దంతాల చిగుళ్లను సహజంగా శుభ్రపరుస్తాయి. ఇవి దవడ కండరాలకు కూడా వ్యాయామాన్ని అందిస్తాయి. చిగుళ్ల వ్యాధికి వ్యతిరేకంగా ఈ పదార్థాలు బలమైన సహజ రక్షణ అందిస్తాయని డాక్టర్ నమ్రతా రూపానీ తెలిపారు.
పాల ఉత్పత్తులు
కాల్షియం సమృద్ధిగా ఉండే పాలు, జున్ను, పాల పదార్థాలు దంతాల్లో ఖనిజాలను పునరుద్దరించడంలో సహాయపడతాయి. దంతాలపై ఉండే ఎనామిల్ సరిచేయడానికి పాల పదార్థాలు ఉపయోగపడతాయని డాక్టర్ రూపానీ చెప్పారు.
గ్రీన్, బ్లాక్ టీలు
ఈ టీల్లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి దంతాలను నాశనం చేసే యాసిడ్ వృద్ధి చెందకుండా నిరోధిస్తాయి. బ్యాక్టీరియాను చంపుతాయి. టీ తయారు చేయడానికి ఉపయోగించే నీటిలో ఫ్లోరైడ్ ఉంటే దంతాలను నాశనం చేస్తుంది.
దంతాలకు చెడు చేసే ఆహారాలు.. మిఠాయిలు, చాక్లెట్లు
ఇవి తిన్న తరవాత ఎక్కువ సమయం దంతాల్లో నిలిచిపోతాయి. స్వీట్లు తినాలనుకుంటే నోట్లో వేగంగా కరిగిపోయేవి తినాలి. లాలీపాప్ లు,పంచదార పాకం, శుద్ధి చేసిన పంచదారతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలని డాక్టర్ రూపానీ చెపుబుతున్నారు.
పిండి పదార్థాలు, అతుక్కునే ఆహారాలు
పిండి పదార్థాలు దంతాలపై పేరుకుపోతాయి. బ్రెడ్, బంగాళదుంపల చిప్స్ తినడం ద్వారా దంతాలకు హాని చేస్తాయి. అతుక్కునే ఆహారాలు దంతాలకు ఎక్కువ నష్టం చేకూరుస్తాయి.
శీతల, కార్బోనేటెడ్ పానీయాలు
చక్కెర అధికంగా ఉండే శీతల పానీయాలు, సిట్రిక్ యాసిడ్ లు ఉండే పదార్థాలు దంతాలకు హాని చేస్తాయి. దంతాలపై ఉండే ఎనామిల్ ను నాశనం చేస్తాయని డాక్టర్ రూపానీ వెల్లడించారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.