హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Benefits of Drinking Water in Glass: గాజు బాటిల్‌ల్లోని నీరు తాగితే.. ఏమవుతుందో తెలుసా?

Benefits of Drinking Water in Glass: గాజు బాటిల్‌ల్లోని నీరు తాగితే.. ఏమవుతుందో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Drinking in glass bottle: గాజు గ్లాసులో నీటిని స్టోర్‌ చేసుకోవడం వల్ల వాటి వాసన, రుచి మారదు. వాటర్‌ టెంపరేచర్‌ను ఎక్కువసేపు చల్లగా లేదా వేడిగా ఉంచే గుణం వీటికి ఉంటుంది.

గ్లాస్‌ బాటిల్‌ (glass bottle) గ్లాసులో నీరు తాగడం వల్ల కొన్ని ఆశ్చర్యకర ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఇళ్లలో నీరు తాగడం కోసం స్టీల్‌ గ్లాసు (steel glass) ని ఎక్కువగా వాడతారు. మరికొంతమంది ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో నీటిని స్టోర్‌ చేసుకుంటారు. కానీ, ఈ ముఖ్యమైన గాజు సీసాలు, గ్లాసులను చాలా తక్కువగా వాడతారు. కానీ, ప్రతిరోజూ గాజు బాటిల్లో ఉన్న నీరు తాగడం వల్ల అనేక హెల్త్‌ బెనిఫిట్స్‌ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

సాధారణంగా ప్లాస్టిక్‌ బాటిల్‌ (plastic) లేదా గ్లాసుల్లో నీరు తాగినప్పుడు ఆ నీరు మామూలు వాటి కంటే రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. అదేవిధంగా ఒక రకమైన వాసన అనుభూతి కూడా మనకు కలుగుతుంది.ఎందుకంటే ప్లాస్టిక్‌లో హానికరమైన కెమికల్స్‌ ఉంటాయి. ఇది నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీంతో అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, గాజు సీసా లేదా గ్లాసుల్లో నీరు తాగడం వల్ల ఎటువంటి హానీ ఉండదు. అలాగే వాసన, రుచిలో ఎటువంటి మార్పు ఉండదు.

ఇది కూడా చదవండి: ‘స్క్విడ్‌ గేమ్‌’లోని ఈ కాస్ట్యూమ్స్‌ కోసం తెగ వెతుకుతున్నారట!

నీటి పరిశుభ్రత..

గాజు బాటిల్‌ లేదా గ్లాసులో ఉన్న నీరు రోజంతా.. తాజాగా ఉంటుంది. అదేవిధంగా ఆ నీరు స్వచ్ఛమైందో కాదో? సులభంగా తెలిసిపోతుంది. గాజు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండటం వల్ల నీటిలో ధూళి సులభంగా కనిపిస్తుంది.

తరచూ స్టీల్‌ గ్లాస్‌ లేదా ప్లాస్టిక్‌ గ్లాస్‌లో నీరు తాగడం వల్ల ఎదో ఒక రకమైన వాసన వస్తుంది. అదే గాజు గ్లాసులో నీటిని తాగడం వల్ల ఏమీ అనిపించదు. ఈ గాజు గ్లాసును శుభ్రం చేయడం కూడా సులభం.

ఇది కూడా చదవండి:  ఈ చిట్కాతో 50 శాతం గ్యాస్‌ ఆదా అవుతుంది!

ప్లాస్టిక్, స్టీలు గ్లాసుల్లో సీసాల్లో నీటిని ఉంచడం సర్వసాధారణం. దీని టెంపరేచర్‌ ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. ఆ నీరు ఆరోగ్యానికి మంచిది కాదు. నీటిని గాజు పాత్రలో లేదా సీసాలో ఉంచినప్పుడు ఇటువంటివి జరగవు. ఎందుకంటే గాజు సీసాలు వాటర్‌ టెంపరేచర్‌ను ఎక్కువసేపు చల్లగా లేదా వేడిగా ఉంచగలవు. మీరు నీటిని మాత్రమే కాకుండా ఏదైన ఇతర ఆహార పదార్థాలను కూడా గాజు సీసాల్లో స్టోర్‌ చేసుకోవచ్చు.

గాజు గ్లాసులో నీటిని స్టోర్‌ చేసుకోవడం వల్ల వాటి వాసన, రుచి మారదు. వాటర్‌ టెంపరేచర్‌ను ఎక్కువసేపు చల్లగా లేదా వేడిగా ఉంచే గుణం వీటికి ఉంటుంది.

First published:

Tags: Drinking water, Health benefits

ఉత్తమ కథలు