హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Watermelon: పుచ్చకాయ రోజూ తింటే ఏమవుతుంది... డాక్టర్లు ఏం చెబుతున్నారు

Watermelon: పుచ్చకాయ రోజూ తింటే ఏమవుతుంది... డాక్టర్లు ఏం చెబుతున్నారు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Watermelon: ఎండాకాలంలో పుచ్చకాయలు బాగా లభిస్తాయి. కొంత మంది ఫ్రిజ్‌లో ఉంచి... రోజూ తింటుంటారు. దీనిపై డాక్టర్లు ఏమంటున్నారో తెలుసుకుందాం.

పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలో వేడిని తగ్గించి, చలవ చేస్తుంది. ఎండాకాలంలో తినడం ఎంతో మేలు. వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చకాయ. ముఖ్యంగా రోహిణీకార్తె సమయంలో మన శరీరంలో వాటర్ లెవెల్స్ మాటిమాటికీ తగ్గిపోతూ ఉంటాయి. డీహైడ్రేషన్ స్టేజ్‌కి వెళ్లిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు వడ దెబ్బ తగిలి... కళ్లు తిరిగి కిందపడిపోతుంటారు చాలా మంది. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. అందుకే బాడీలో వాటర్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ముక్కలు తినడం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు డాక్టర్లు. పుచ్చకాయలో ఉండే విటమిన్లు, పోషకాలు, వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటి ఆక్సిడెంట్లు, బీ విటమిన్, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, జిటాకేరోటిన్లు, ఆల్కలైన్, విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ సి, సుక్రోజ్ , ఫ్రక్టోజ్, గ్లూకోజ్, ఎలక్ట్రో లైట్లు... ఎండాకాలంలో మన శరీరానికి కావాల్సిన పోషకాల్ని అందిస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు.

సమ్మర్‌లో మామిడిపండ్లతోపాటూ... పుచ్చకాయలు కూడా ఎక్కడబడితే అక్కడ అమ్ముతుంటారు. కొన్ని సందర్భాల్లో మొత్తం కాయను కొనలేకపోయినప్పుడు... ముక్కలుగా అమ్ముతున్నవాటిని కొనుక్కొని తింటే, తాత్కాలికంగా ఎండ దెబ్బ నుంచీ తప్పించుకోవచ్చు. ఐతే... ఈ పుచ్చకాయ ముక్కలను ఐస్‌పై పెట్టి అమ్ముతుంటారు. ఆ ఐస్‌ కోసం వాడిన నీరు మంచిదో, కాదో తెలియదు కాబట్టి... కూలింగ్ లేని, మామూలు ముక్కులను మాత్రమే తినాలని సూచిస్తున్నారు డాక్టర్లు.

ఆరోగ్యానికి మేలు చేసే పుచ్చకాయ

పుచ్చకాయ తింటే కలిగే ప్రయోజనాలు :

- పుచ్చకాయలు రక్తపోటు, గుండె పోటు తగ్గిస్తాయి. మహిళలకు ఎంతో మేలు చేస్తాయి.

- కాన్సర్ వ్యాధిని తగ్గించే లక్షణాలు కూడా పుచ్చకాయలో ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.

- ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు పుచ్చకాయ ముక్కలు తింటే, పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.

- కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు, తేనెతో కలిపి పుచ్చకాయ ముక్కలు తింటే మంచిదట.

- కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, మలబద్ధకంతో బాధపడేవారికి పుచ్చకాయ ఎంతో మంచిది.

- కామెర్లు పైత్యం, వికారం, తలనొప్పి, నోరు తాడారిపోవడం వంటి సమస్యలకు పుచ్చకాయ సరైన ఆప్షన్.

- విరేచనాలు, కడుపునొప్పి, ఉబ్బరం, ACDTకి చెక్ పెట్టాలంటే పుచ్చకాయ ముక్కలు తినాలి. గ్లూకోజ్, తేనె, నిమ్మరసంతో కలిపి తింటే ఎక్కువ మేలు.

- కాల్షియం అధికంగా ఉన్న పుచ్చకాయ తింటే కీళ్లనొప్పులు, వాతం లాంటి రోగాలు నయమవుతాయి.

ఇవి కూడా చదవండి :

ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం

ఎండు ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే.... ప్రయోజనాలు ఇవీ...

సెక్స్ సామర్ధ్యాన్ని పెంచే ప్రకృతి ఔషధం..గొంగళి పురుగు నుంచీ పుట్టే మొక్క

ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి... సమ్మర్ ఫ్రూటైన పుచ్చకాయని మిస్సవకుండా ఇంటికి తీసుకెళ్లండి. కుటుంబ సభ్యులంతా కలిసి హాయిగా తినేయండి.

First published:

Tags: Health, Health Tips, Tips For Women, Women health

ఉత్తమ కథలు