పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలో వేడిని తగ్గించి, చలవ చేస్తుంది. ఎండాకాలంలో తినడం ఎంతో మేలు. వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చకాయ. కామ కోరికలు పెంచే లక్షణాలు కూడా పుచ్చకాయల్లో ఉన్నాయి. ఐతే, ఈ రోజుల్లో మార్కెట్‌లో రకరకాల పుచ్చకాయలు అమ్ముతున్నారు. వాటిని కొనుక్కొని ఓ రెండ్రోజుల తర్వాత తిందామంటే కుదరని పని. ఎందుకంటే పుచ్చకాయని కోసి చూపిస్తే తప్ప అది లోపల ఎర్రగా ఉందో లేదో తెలీదు. అలాగని కోసి చూపిస్తే, ఇక దాన్ని మూడు, నాలుగు గంటల్లో తినేయాలి. ఆలస్యం చేస్తే అది పాడై కుళ్లు వాసన వస్తుంది. ఈ సమస్యకు చెక్ పెడుతూ పరిశోధకులు కొన్ని కొత్త విషయాలు చెప్పారు. అవేంటో తెలుసుకుందాం.
ఇలా చెయ్యండి :
* కనీసం 2 కేజీలు, అంతకంటే ఎక్కువ బరువు ఉండే పుచ్చకాయను ఎంచుకోండి.
* పుచ్చకాయ ఏ రంగులో ఉన్నా పర్వాలేదు. పైన చారలు (Stripes) ఉన్నా, లేకపోయినా ఏమీ కాదు.
* పుచ్చకాయ తొడిమ ఎండిపోయినట్లు ఉండాలి. తొడిమ లేకపోతే, తొడిమ ఉండే ప్రాంతం గట్టిగా ఎండినట్లు ఉండాలి.
* పుచ్చకాయ గట్టిగా, బరువుగా ఉండాలి. మెత్తగా ఉంటే అది లోపల పాడైపోయినట్లే.
* కొన్ని పుచ్చకాయలపై గోధుమ లేదా పసుపు రంగు మచ్చలుంటాయి. చారలతో సంబంధం లేకుండా ఆ మచ్చలు దాదాపు గుండ్రంగా ఉంటాయి. మచ్చలు ఎంత ఎక్కువగా ఉంటే ఆ పుచ్చకాయ లోపల అంత ఎర్రగా ఉంటుంది. ఒక్కో పుచ్చకాయకు ఒకటే మచ్చ ఉంటుంది. కొన్నింటికి రెండు మూడు మచ్చలుంటాయి.
* పుచ్చకాయ ఎంత ఎర్రగా ఉంటే అంత ఎక్కువగా అందులో పోషకాలు ఉంటాయి. సో, మచ్చలుండే గట్టి పుచ్చకాయను ఎంచుకొని, తొడిమ ప్రాంతం ఎండిందో లేదో చూసి కొనుక్కోండి. అప్పుడు దాన్ని కట్ చెయ్యకపోయినా లోపల ఎర్రగానే ఉంటుందని పరిశోధకులు తేల్చారు. కట్ చెయ్యని పుచ్చకాయని ఇంట్లో (ఫ్రిడ్జ్‌లో లేదా ఎండ తగలని చోట) ఓ రెండ్రోజులు ఉంచినా పాడవదు.
ఇవి కూడా చదవండి :
ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...
పడక సుఖానికి దివ్య ఔషధం యాలకులు... ఎలా వాడాలంటే...
పండ్లపై ఉప్పు చల్లుకొని తింటున్నారా... ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health Tips, Life Style, Tips For Women, Women health