Health Tips : వట్టి వేర్లతో ప్రయోజనమేంటి? తెలుసుకుందాం

Health Benefits of Vetiver Roots : వట్టి వేర్లు శరీరంలో వేడిని తగ్గించడమే కాదు... బాడీకి ఉపశమనం కలిగిస్తాయి. మానసికంగా కూడా హాయిగా ఉంటుంది. బుర్ర చల్లగా ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా... కూల్ కూల్‌గా ఉంటుంది.

news18-telugu
Updated: November 10, 2019, 11:21 AM IST
Health Tips : వట్టి వేర్లతో ప్రయోజనమేంటి? తెలుసుకుందాం
వట్టి వేర్లతో ప్రయోజనమేంటి? తెలుసుకుందాం (credit - twitter - EFF)
  • Share this:
వట్టివేర్లు ఇండియాలోనే పుట్టాయి. వీటినే ఖుస్ అంటారు కూడా. ఇవి ఓ రకమైన సువాసన వచ్చే పొడవైన గడ్డి మొక్క వేర్లు. సంప్రదాయ పద్ధతుల్లో ఈ గడ్డి మొక్క వల్ల చాలా ఉపయోగాలున్నాయి. మొక్క కంటే... వేర్ల వల్ల ప్రయోజనాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. శ్రీశైలం లాంటి చోట్ల ఇలాంటి వట్టి వేర్లను అమ్ముతుంటారు. అయితే చాలా మందికి ఈ వేర్లు గొప్పవనీ, మంచివనీ తెలుసు గానీ... వీటిని ఎలా వాడాలో సరిగా తెలియదు. అదెలాగో తెలిస్తే... కచ్చితంగా వీటిని కొంటారు. ఇదేమీ పెద్ద సీక్రెట్ కాదు. ఓ మట్టి కుండలో తాగు నీరు పోసి... అందులో వట్టి వేర్లను వెయ్యాలి. వేర్లు నీటిలో పూర్తిగా మునగాలి. ఇలా కొన్ని గంటలు ఉంచాలి. ఆ తర్వాత నీటిని వడగట్టి... ఆ నీటిని తాగేయడమే.

వట్టి వేర్లు... నీటిని చల్లబరుస్తాయి. అంతేకాదు... శరీరంలో వేడిని తగ్గిస్తాయి. చలవ చేస్తాయి. ఇవి సహజసిద్ధంగా విష వ్యర్థాలు, విష సూక్ష్మక్రిములతో పోరాడతాయి. శరీరంలో వేడిని తగ్గించడమే కాదు... బాడీకి ఉపశమనం కలిగిస్తాయి. మానసికంగా కూడా హాయిగా ఉంటుంది. బుర్ర చల్లగా ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా... కూల్ కూల్‌గా ఉంటుంది. కోపం, ఆవేశం, గొడవల వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉంటారు.

వట్టి వేర్ల నుంచీ వచ్చే తైలం కూడా చాలా మంచిది. ఇది విడిగా మార్కెట్లలో దొరుకుతుంది. ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. ఈ ఆయిల్‌ని చర్మం, జుట్టుకి వాడినప్పుడు... ఇది మొత్తం క్లీన్ చేస్తుంది. నురగలా వచ్చి... శుభ్రపడుతుంది.

మనం వాడేసిన వట్టి వేర్లను పారేయడం కామన్. ఐతే... కొన్ని కంపెనీలు ఈ వేర్లను మ్యాట్స్ (పరుపులు) తయారీకి వాడుతున్నాయి. ఈ పరుపులపై పడుకుంటే... చల్లగా మనస్శాంతిగా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి.



చూశారా... మన దేశంలో దొరికే వట్టి వేర్లతో ఇన్ని ప్రయోజనాలున్నాయి. కానీ... ఇవి ఎక్కడ బడితే అక్కడ దొరకని పరిస్థితి ఉంది. మందుల తయారీ కంపెనీలు ఇలాంటి వాటిని చాలా తక్కువ రేటుకి కొని... మందులు తయారుచేసి అత్యంత ఎక్కువ రేటుకి అమ్ముతుంటే... ఆ మందుల్ని కొనుక్కునే పరిస్థితుల్లో భారతీయులు ఉన్నారనే విమర్శలున్నాయి. ఇలాంటి సహజసిద్ధ మూలికల్ని ప్రజలకు డైరెక్టుగా అలవాటు చెయ్యాలనే డిమాండ్లు ఉన్నా... ఏ ప్రభుత్వమూ ఇలాంటి అంశాలపై దృష్టి సారించట్లేదు.

 

Pics : కేరళ అందాలన్నీ తనలో దాచుకున్న బ్యూటీ దేవికా సంజయ్

Loading...

ఇవి కూడా చదవండి :

1.2 కేజీల పీత... ఎంతకు అమ్ముడైందో తెలిస్తే షాకే...

గులాబ్ జామూన్ పిజ్జా తిన్నారా... నెట్‌లో అదే చర్చ

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ముందు మరో 4 కేసులు...

25వేల ఉద్యోగులు... 10 కోట్ల ఫోన్లు... షామీ విజయప్రస్థానంపై స్పెషల్ రిపోర్ట్

జగన్ మరో సంచలన నిర్ణయం... పేదలకు షాకే...
First published: November 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com