Health Tips : త్రిఫల చూర్ణం ప్రయోజనాలేంటి... ఎలా వాడాలి?

Health benefits of triphala : మన దేశం ఎన్నో ఆయుర్వేద మూలికలకు నిలయం. మన దేశం నుంచీ వాటిని తక్కువ రేటుకి కొంటున్న ఫార్మా కంపెనీలు... వాటితో మందులు తయారుచేసి... మళ్లీ మనకే ఎక్కువ రేటుకు అమ్ముతున్నాయి. అసలా మూలికల ప్రయోజనాల్ని మనమే తెలుసుకుంటే, వాటిని డైరెక్టుగా మనమే వాడొచ్చు.

news18-telugu
Updated: May 15, 2020, 3:41 PM IST
Health Tips : త్రిఫల చూర్ణం ప్రయోజనాలేంటి... ఎలా వాడాలి?
త్రిఫల చూర్ణం ప్రయోజనాలేంటి... ఎలా వాడాలి?
  • Share this:
Health benefits of triphala : త్రిఫల చూర్ణం అనే పేరు వినే ఉంటారు. ఆయుర్వేద నిపుణులకు ఇది బాగా తెలిసిన మూలికా ఔషధం. త్రిఫల అనేది ఓ ప్రాచీన ఔషదం. దీన్లో ఫుల్లుగా యాంటీఆక్సిడెంట్స్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా గుణాలున్నాయి. అందువల్ల దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మన నోటిని కాపాడటం, జీర్ణక్రియను సరిచేయడం, చర్మాన్ని రిపేర్ చెయ్యడం ఇలా ఎన్నో లాభాలు. అందుకే ఆయుర్వేద మందుల్లో త్రిఫల చూర్ణాన్ని ఉపయోగిస్తారు. ఇండియాలో లభించే మూడు ఫలాల్ని కలిపి త్రిఫల చూర్ణాన్ని తయారుచేస్తారు. అవి 1.కొండ ఉసిరి 2.కరక్కాయ 3.తానికాయ (Terminalia bellirica). ఆయుర్వేదంలో మన శరీరానికి మూడు రకాల ఎనర్జీలుంటాయి. ఈ మూడింటినీ క్రమబద్ధీకరించడం ద్వారా ఎక్కువ ఆరోగ్యాన్ని పొందగలం. మూడు ఫలాల పొడులు సరైన మోతాదులో కలపడం ద్వారా... త్రిఫల చూర్ణం సరైన ప్రభావం చూపగలదు.

ఇంగ్లీష్ మందులను తట్టుకునే బ్యాక్టీరియాను తరిమికొట్టే శక్తి త్రిఫల చూర్ణానికి ఉందని పరిశోధనల్లో తేలింది. ఐతే, దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. త్రిఫలను నీటిలో కలిపి... కషాయంలాగా తాగొచ్చు. లేదంటే రాత్రివేళ పాలు లేదా తేనెతో కలిపి తీసుకోవచ్చు. ఇది మరీ ఎక్కువగా తీసుకోకూడదు. అందువల్ల ఎంత తాగాలో ఆయుర్వేద నిపుణుల సలహా తీసుకోవాలి. సాధారణంగా రోజూ 2 నుంచీ 5 గ్రాములు తీసుకుంటారు.

వైద్యుని సలహాననుసరించి రోజూ రెండు నుండి అయిదు గ్రాముల త్రిఫల చూర్ణం ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు. ఇది ఆయుర్వేద షాపుల్లో లభిస్తుంది. మాత్రల రూపంలో కూడా ఉంటుంది.

త్రిఫల చూర్ణం వల్ల కలిగే ప్రయోజనాలు :
- త్రిఫల చూర్ణం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాసీడీటీ సమస్యను తగ్గిస్తుంది.
- టైప్ 2 డయాబెటిస్‌ని కంట్రోల్ చేసే శక్తి ఈ చూర్ణానికి ఉంది.
- ఈ చూర్ణం వల్ల ఆకలి బాగా వేస్తుంది. పెద్ద పేగు శుభ్రపడుతుంది.- కళ్లకు, చర్మానికి, గుండె, లివర్‌కి ఇది ఎంతో మేలు చేస్తుంది.
- సంతాన సామర్థ్యాన్ని ఇది బాగా పెంచుతుంది.
- ముసలితనం త్వరగా రానివ్వదు. జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు తెల్లబడదు.
- ఆస్తమా లాంటి శ్వాస సమస్యలు రావు. ఆల్రెడీ ఉంటే అవి అదుపులో ఉంటాయి.
- జ్ఞాపకశక్తిని బాగా పెంచుతుంది.
- అధికబరువు ఉన్నవారు త్రిఫల చూర్ణం వాడితే మేలు.
- రక్త హీనత ఉన్నవారు ఈ చూర్ణం వాడితే ఎర్రకక్త కణాలు పెరుగుతాయి.
- చర్మ కణాలను కాపాడి, కాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
- బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
- అడ్డమైన రోగాలూ రాకుండా ఉంటాయి.
- HIVని అడ్డుకోగల శక్తి త్రిఫల చూర్ణానికి ఉంది.

ఇలా త్రిఫల చూర్ణంతో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

 

Pics : హాఫ్ శారీలో అదరగొడుతున్న అను ఇమాన్యూయేల్




ఇవి కూడా చదవండి :

Health Tips : పింటో బీన్స్‌ తినండి... ఈ ప్రయోజనాలు పొందండి

Health Tips : డయాబెటిస్‌కి ఆవకాడోతో చెక్... ఇలా చెయ్యండి

Health Tips : జలుబు జ్వరానికి గ్రీన్ టీతో చెక్... ఇలా చెయ్యండి.

Health Tips : వైట్ టీ తాగుతున్నారా... ఆరోగ్యానికి మేలు

Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు

First published: May 15, 2020, 3:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading