శనగపిండి షర్బత్ ట్రై చేశారా... ఎండాకాలంలో తాగాల్సిన డ్రింక్

Sattu Drink : ఎండాకాలంలో శనగపిండి షర్బత్ తాగితే ఆరోగ్యానికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇందులోని అద్భుతమైన పోషకాలు... వేసవి తాపం నుంచీ మనల్ని కాపాడతాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: March 12, 2019, 3:05 AM IST
శనగపిండి షర్బత్ ట్రై చేశారా... ఎండాకాలంలో తాగాల్సిన డ్రింక్
శనగపిండి షర్బత్ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: March 12, 2019, 3:05 AM IST
శనగపిండి షర్బత్ మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా తాగరు కానీ బీహార్, జార్ఖండ్‌లో చాలా ఎక్కువగా తాగుతారు. కారణం అక్కడ ఎండాకాలం వస్తే భరించలేనంత ఎండలుంటాయి. వాటి నుంచీ ఉపశమనం కోసం అక్కడి ప్రజలు ఎక్కువగా ఆధారపడే వాటిలో ఈ షర్బత్ కూడా ఉంది. ఈ డ్రింకులో ఎన్నో పోషకాలున్నాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. మిగతా కోల్డ్ డ్రింక్స్ కంటే ఇది గొప్పదే. ఇది శరీరంలో చాలా ఈజీగా కలిసిపోతుంది. సహజ సిద్ధంగా మంచి రుచితోపాటూ... తేలిగ్గా జీర్ణం అవుతుంది. అన్ని వయసుల వారూ ఈ షర్బత్ తాగొచ్చు. ఇందులోని పీచు (Fibre) పదార్థం మన పేగులకు మేలు చేస్తుంది. మనం తినే ఆహారంలో అతిగా ఉండే ఆయిల్‌ను ఇది బయటకు పంపేస్తుంది. తాగిన వెంటనే ఎనర్జీ ఇస్తుంది. మన చర్మాన్ని మెరిసేలా చేసే లక్షణం కూడా ఈ షర్బత్‌కి ఉంది. డయాబెటిస్, బీపీ ఉన్నవారు కూడా ఈ డ్రింక్ తాగొచ్చు.

summer drink, sattu sharbat recipe, meetha sattu recipe, beverages, drinks north indian drink, sattu drink recipe, how to make sattu drink, sattu sharbat, శనగపిండి షర్బత్, వేసవి కాలంలో డ్రింక్, ఆరోగ్యం, సమ్మర్ డ్రింక్
శనగపిండి (File)


శనగపిండి షర్బత్ ఎలా చెయ్యాలంటే : ముందుగా పావు కేజీ పచ్చి శనగలు (తొక్కలు లేనివి) తీసుకోవాలి. వాటిని దోరగా వేయించాలి. పచ్చి వాసన పోయేంతవరకూ వేయిస్తే మంచిది. అవి వేడి చల్లారాక, మిక్సీలో వేసి పొడి చెయ్యాలి. లీటర్ నీటిలో 5 టేబుల్ స్పూన్ల శనగపిండిని కలపాలి. దానికి అదనంగా పంచదార (sugar) లేదా బెల్లం లేదా తేనె కలుపుకోవచ్చు. ఈ డ్రింకును డైరెక్టుగా కానీ, ఫ్రిడ్జ్‌లో కూలింగ్ చేసుకొని గానీ తాగితే వేసవి కాలంలో ఎంతో మంచిది.

శనగపిండి పొడిని బాటిల్‌లో వేసి నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు షర్బత్ చేసుకొని తాగితే ఎండల ఉక్కపోత, వేడి నుంచీ ఉపశమనం పొందొచ్చు. 

ఇవి కూడా చదవండి :

పుచ్చకాయ కొయ్యకుండానే ఎర్రగా ఉందో లేదో గుర్తించడం ఎలా... ఇలా...
Loading...
ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...

పడక సుఖానికి దివ్య ఔషధం యాలకులు... ఎలా వాడాలంటే...
First published: March 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...