హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Coconut: కొబ్బరి బోండాంలో లేత కొబ్బరి తింటున్నారా... ఈ ప్రయోజనాలు మీకే

Coconut: కొబ్బరి బోండాంలో లేత కొబ్బరి తింటున్నారా... ఈ ప్రయోజనాలు మీకే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Coconut Health Benefits: మనమంతా ఎండాకాలం రాగానే కొబ్బరి నీళ్లు తాగుతాం... ఆ బోండాల్లోని లేత కొబ్బరిని మాత్రం వదిలేస్తాం. ఫలితంగా మనం ఎంతో విలువైన పోషకాల్ని కోల్పోతున్నట్లే.

ఈ ప్రకృతిలో మన అదృష్టం కొద్దీ వరంలా వచ్చిన వాటిలో కొబ్బరిబోండాం ఒకటి. కొబ్బరి బోండాం నీళ్ల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని మనకు తెలుసు. ఎండాకాలంలో కొబ్బరి నీళ్లను మించిన ఎనర్జీ డ్రింక్ మరొకటి లేదని తెలుసు. కానీ మనం కొబ్బరి బోండాంలో ఉన్న లేత కొబ్బరిని మాత్రం తినం... ఎందుకంటే బోండాంలో నీరు తాగాక, దాన్ని విసిరేస్తాం. అందులో లేత కొబ్బరిని ఏం తింటాంలే అని లైట్ తీసుకుంటాం. ఆ లేత కొబ్బరి తీసి ఇవ్వమంటే... కొబ్బరి బోండాల షాపు వ్యక్తి ఏమనుకుంటాడో అని ఫీలవుతాం. నిజానికి ఆ లేత కొబ్బరిలో ఎన్నో పోషకాలు, ఎన్నో అద్భుత గుణాలుంటాయి. అందువల్ల మనలో మొహమాటాన్ని పక్కన పెట్టి... ఈసారి బోండాం అడిగేటప్పుడు... కాస్త లేత కొబ్బరి ఉన్నదే కొట్టమని అడగండి. లేత కొబ్బరి ఉన్న బోండాంలో నీరు చాలా రుచిగా, తియ్యగా ఉంటాయి. ఆ నీరు తాగేశాక... అందులో లేత కొబ్బరిని తీసి ఇవ్వమని అడగండి. అది తింటే ఏం ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

* లేత కొబ్బరిలో పీచు పదార్థం ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురగ్గా మార్చేస్తుంది. బరువు తగ్గాలి అనుకొనే వాళ్లు లేత కొబ్బరి తినాలి.

* లేత కొబ్బరి మన శరీరంలో నీటి శాతం కోల్పోకుండా చేస్తుంది. ఎండాకాలం డీహైడ్రేషన్ నుంచీ తప్పించుకోవచ్చు.

* శరీరానికి హాని చేసే కొలెస్ట్రాల్‌ను లేత కొబ్బరి బయటకు పంపేస్తుంది.

* లేత కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి గుండెకు మేలు చేస్తాయి. బాడీలో వ్యర్థాల్ని బయటకు పంపుతాయి. పాడైన కణాల్ని రిపేర్ చేస్తాయి.

* లేత కొబ్బరిలో విటమిన్ ఏ, బీ, సీ, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము ఎక్కువగా ఉంటాయి.

* మల బద్ధకానికి సరైన ఉపశమనం లేత కొబ్బరి. రెండ్రోజులకోసారి ఈ కొబ్బరి తిన్నా చాలు... జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

* లైంగిక శక్తిని పెంచేందుకు, స్పెర్మ్ కౌంట్ వృద్ధి చేసే గుణాలు లేత కొబ్బరిలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Pinto Beans: పింటో బీన్స్‌ తినండి... 7 ఆరోగ్య ప్రయోజనాలు పొందండి

కొబ్బరి కాయల్లో పచ్చి కొబ్బరిని ఎక్కువగా తింటే... దగ్గు, నిమ్ము, ఆయాసం వంటి సమస్యలొస్తాయి. అదే లేత కొబ్బరైతే... ఓ పట్టు పట్టొచ్చు. పెద్దగా సమస్యలేవీ ఉండవు. అందువల్ల వీలు చిక్కినప్పుడల్లా లేత కొబ్బరి తినండి... ఆరోగ్యాన్ని పెంచుకోండి.

First published:

Tags: Health, Health Tips, Life Style, Tips For Women, Women health

ఉత్తమ కథలు