Health Tips : మనలో మెగ్నీషియం లోపిస్తే ఏమవుతుంది... ఇలా చెయ్యండి

Health Tips : మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలం... హెల్త్‌పై శ్రద్ధ పెట్టాలని అనిపించదు. కానీ... ఎప్పుడైనా అనారోగ్యం వస్తే... ఎందుకిలా అయ్యింది అన్న డౌట్ వస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనిపిస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అది ఎందుకు అవసరమో, లోపించకుండా ఏం చెయ్యాలో చూసుకుందాం.

news18-telugu
Updated: November 9, 2019, 2:18 PM IST
Health Tips : మనలో మెగ్నీషియం లోపిస్తే ఏమవుతుంది... ఇలా చెయ్యండి
మనలో మెగ్నీషియం లోపిస్తే ఏమవుతుంది... ఇలా చెయ్యండి
  • Share this:
Health Tips : మెగ్నీషియం మనకు అత్యంత అవసరమైన ఖనిజం. ఇది మనకు ఎనర్జీ ఇస్తుంది. చక్కటి నిద్ర వచ్చేలా చేస్తుంది. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. హార్మోన్స్ సరిగా పనిచేసేందుకు సాయపడుతుంది. ఆకుకూరలు, కూరగాయల్లో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది. వాటితోపాటూ... డార్క్ చాకొలెట్స్ (ఖరీదైన కోకో చాకొలెట్లు)లో కూడా మెగ్నీషియం ఉంటుంది. మనం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం మన బాడీలో ఉండాలి. మన శరీరంలో వందల కొద్దీ ఎంజైముల పనితీరును మెగ్నీషియం మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థాలు), కొవ్వు, ప్రోటీన్స్ (మాంస పదార్థాలు) నుంచీ... మనకు ఎనర్జీ వచ్చేలా చెయ్యడంలో మెగ్నీషియంది కీలక పాత్ర. మన ఎముకలు గట్టిగా ఉండాలన్నా, మన నరాలు, నాడీ వ్యవస్థ చక్కగా ఉండాలంటే కూడా... మెగ్నీషియం అవసరం. బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే మెగ్నీషియం కావాలి. రోజుకు మగవ్యక్తికి 400 మిల్లీ గ్రాముల మెగ్నీషియం అవసరం. మహిళకు 300 మిల్లీ గ్రాములు అవసరం.

మెగ్నీషియం లేకపోతే ఏమవుతుంది : జనరల్‌గా మనం తినే ఆహారంలో సరిపడా మెగ్నీషియం లేకపోతే... కిడ్నీలు తమ దగ్గరున్న మెగ్నీషియంను ఇస్తాయి. అలాగని పదే పదే కిడ్నీలపై ఆధారపడితే... సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాదు... కిడ్నీలు కూడా పాడవుతాయి. మెగ్నీషియం సరిపడా లేనప్పుడు మనకు కొన్ని సింప్టమ్స్ (లక్షణాల) ద్వారా దాన్ని మనం గుర్తించవచ్చు.

లక్షణాలు :

ఆకలి వేయదు. వికారంగా ఉంటుంది. వాంతి (వామ్టింగ్) వస్తున్నట్లు అనిపిస్తుంది. నీరసంగా ఉంటారు. గుండె కొట్టుకునే వేగంలో హెచ్చుతగ్గులు వస్తాయి. కళ్లకు మసకగా అనిపిస్తుంది. కండరాల్లో నొప్పి వస్తుంటుంది. అలసట ఉంటుంది. టెన్షన్ పెరుగుతుంది. నిద్ర సరిగా పట్టదు. హైబీపీ వస్తుంది. ఆస్తమా సమస్య కూడా పెరుగుతుంది.మెగ్నీషియం వెంటనే కావాలంటే... ఓ కాఫీ తాగేయాలి. లేదా... డార్క్ చాకొలెట్ తినేయాలి. ఐతే, అదే పనిగా... డార్క్ చాకొలెట్స్ తినడం మంచిది కాదు. రోజుకొకటి తినొచ్చు. అలాగని... మెగ్నీషియం కోసం దానిపైనే ఆధారపడకుండా... కాయగూరలు, ఆకుకూరలు తినాలి.

మెగ్నీషియం ఉండే ఆహారాలు :
- ఖర్జూరాలు, బఠాణీలు, కోకో, జీడిపప్పు, బాదం, పాస్తా, గింజలు, తృణధాన్యాలు, పప్పులు,
Loading...
- ఆకు కూరలు
- పండ్లు (ఫిగ్స్, ఆవకాడో, అరటిపండ్లు, రాస్ బెర్రీస్)
- బ్రకోలీ, క్యాబేజీ, గ్రీన్ బఠాణీలు, మొలకల వంటివి.
- సీఫుడ్ (సాల్మన్, మాకెరెల్, ట్యూనా ఫిష్)
- బ్రౌన్ రైస్, ఓట్స్
- టోఫు వన్న

మెగ్నీషియం లోపించినట్లు మీకు అనిపిస్తే... మీరు వెంటనే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దాన్ని అశ్రద్ధ చేస్తే... అది రకరకాల వ్యాధులకు దారితీస్తుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే... వీలైనంతవరకూ ఫ్రై పుడ్ తగ్గించి... సహజమైన ఆహారం తినండి. పండ్లు, పప్పులు తినండి. అలాగే... కాయగూరలు, ఆకుకూరలు తినండి. ఐతే... మెగ్నీషియం ఎక్కువైతే కూడా ఇబ్బందే. డయేరియా, కడుపులో నొప్పి వంటివి వస్తాయి. కాబట్టి... ఎంత మెగ్నీషియం అవసరమో డాక్టర్ సలహా పాటించడం మేలు.

 

Pics : బెంగాలీ రసగుల్ల మేఘా చౌదరీ క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :

మద్యం కొద్దికొద్దిగా తాగితే కలిగే లాభాలేంటి?

డయాబెటిస్ బాధిస్తోందా?... మీ లైఫ్‌స్టైల్‌లో ఈ మార్పులు చెయ్యండి

Diabetes Diet : డయాబెటిస్ ఉన్నవారు శీతాకాలంలో తినగలిగే పండ్లు


Health Tips : ఫ్యాట్‌ని తగ్గించే ఫ్రూట్స్... తింటే ఎన్నో బెనిఫిట్స్...

First published: November 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...