Lemon Grass : లెమన్ గ్రాస్... ఆరోగ్య వర ప్రదాయిని...

Health benefits of Lemon Grass : మన ప్రపంచంలో మనకు ఆరోగ్యాన్ని అందించేవి చాలా ఉంటాయి. వాటిలో లెమన్ గ్రాస్ కూడా ఎంతో మేలు చేస్తుంది. దాని ప్రయోజనాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: August 12, 2020, 3:27 AM IST
Lemon Grass : లెమన్ గ్రాస్... ఆరోగ్య వర ప్రదాయిని...
Health Tips : లెమన్ గ్రాస్... ఆరోగ్య వర ప్రదాయిని... (credit - twitter - great oracle)
  • Share this:
Health benefits of Lemon Grass : లెమన్ గ్రాస్‌... పేరులో లెమన్ ఉన్నా... దానికీ నిమ్మకాయకీ సంబంధం లేదు. లెమన్ గ్రాస్ అనేది... వేడి ప్రదేశాల్లో పెరుగుతుంది. ఇది ఆగ్నేయ ఆసియాకు చెందిన గడ్డి మొక్క. కానీ... భారతదేశంతోపాటూ... చాలా ఆసియా దేశాల్లో మందుల తయారీలో దీన్ని వాడుతున్నారు. దీని ఆకులు, కాండాల్లో... సిట్రల్, జెరానియల్, క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి ఎంతో ఆరోగ్యాన్ని కలిగిస్తున్నాయి. ఈ మూలికను తాజాగా వాడొచ్చు లేదా... ఎండ బెట్టి వాడొచ్చు అలాగే... పౌడర్ రూపంలోకి మార్చి కూడా వాడొచ్చు. ఐతే... చాలా మంది తాజా లెమన్ గ్రాస్‌నే ఎక్కువగా వాడుతారు. ఎందుకంటే... అది ఎంతో రంగుతో, కాంతివంతంగా ఉంటుంది. సువాసన వస్తుంది. అదే ఎండిపోతే... చెక్కముక్కల వాసన వస్తుంది.

లెమన్ గ్రాస్ ఆరోగ్య ప్రయోజనాలు :

Aids digestion : జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో రసాన్ని తాగితే... గ్యాస్టిక్స్ సమస్యలు, పొట్టలో నొప్పి వంటివి పోతాయి. వికారం కూడా వదిలిపోతుంది.

A rich source of antioxidants : దీని నిండా యాంటీఆక్సిడెంట్సే ఉంటాయి. ఇది మన బాడీలోని విషవ్యర్థాలను తరిమితరిమి కొడుతుంది. ముసలితనం రాకుండా చేస్తుంది. కాన్సర్ వంటి సీరియస్ అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది.

Heart friendly : గుండెను కాపాడుతుంది. హార్ట్ ఎటాక్, రక్తం గడ్డకట్టడం లాంటి తీవ్రమైన సమస్యలు రాకుండా చేస్తుంది. ఇందులో వేడిని తగ్గించే గుణాలుంటాయి. రక్తనాళాలు, ధమనుల్లో వేడిని తగ్గిస్తుంది. అందువల్ల బాడీ లోపల రక్తం గడ్డకట్టదు. బాడీలో చెడు కొలెస్ట్రాల్‌ని బయటకు పంపేస్తుంది.

Lowers blood pressure : వేడిని తగ్గిస్తూ... రిలాక్స్ ఫీల్ కలిగిస్తూ... లెమన్ గ్రాస్... బీపీని కంట్రోల్ చేస్తుంది. హైబీపీ ఉన్నవారికి ఇది దివ్యౌషధం.

Helps in reducing weight : లెమన్ గ్రాస్‌ను జ్యూస్‌లలో మిక్స్ చేసి తరచూ తీసుకుంటూ ఉంటే... శరీరంలో అధికబరువు తగ్గిపోతుంది. షుగర్ కలిపిన డ్రింక్స్ తాగే బదులు... లెమన్ గ్రాస్ డ్రింక్ తాగితే... ఆరోగ్యం మెరుగై ఫిట్ అవుతారు.

Antifungal and antibacterial : ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటివి వెంటనే రావు. ఇందులోని పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్స్... శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి.

Strengthens immune system: ఈ మూలికలో నిండా విటమిన్లు, మినరల్సూ ఉన్నాయి. ఇవి వ్యాధ నిరోధక శక్తిని బాగా పెంచుతున్నాయి. గొంతులో మంట, గరగర, ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపిస్తే... లెమన్ గ్రాస్ తాగాలి. సెట్ అయిపోతుంది.

ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్ సైట్లలో ఇది పొడి రూపంలోలభిస్తోంది. పెద్దలైతే గోరు వెచ్చటి నీటిలో ఓ టీస్పూన్ వేసుకొని తాగొచ్చు. అదే పిల్లలైతే... అర టీస్పూన్ కలిపి తాగొచ్చు.

Caution: ఇన్ని మంచి గుణాలు ఉన్న లెమన్ గ్రాస్ కొంతమందికి పడదు. దాని వాసన, దాని రుచి ఎందుకో కొందరికి నచ్చదు. అలాంటి వారు దాన్ని వాడకపోవడమే మంచిది. మరో ముఖ్యమైన విషయమేంటంటే... ప్రెగ్నెంట్ అయిన మహిళలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ మూలికను వాడకూడదు. అందువల్ల ఇది వాడే ముందు ఓసారి డాక్టర్‌ని సంప్రదించి వాడటం మేలంటున్నా్రు ఆరోగ్య నిపుణులు.

ఏది ఏమైనా లెమన్ గ్రాస్‌ని సూప్‌లు, ఫ్రైలు, వంటల్లో వాడుతుంటారు. ఇది కొద్దిగా నిమ్మకాయ, కొత్తగి అల్లం వాసన వస్తుంటుంది. తాజా లెమన్ గ్రాస్ అయితే పుదీనా వాసన కూడా వస్తుంది. నిమ్మకాయలో ఎలాంటి తైలాలు ఉంటాయో... అలాంటి తైలాలే ఇందులోనూ ఉంటాయి. అందువల్లే దీన్ని లెమన్ గ్రాస్ అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: August 12, 2020, 3:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading