ప్రెగ్నెన్సీ టైంలో వ్యాయామం చేస్తే ప్రయోజనాలే ఎక్కువ.. పుట్టబోయే బిడ్డకూ ఆరోగ్యం

ప్రతీకాత్మక చిత్రం

మాములుగా గర్భిణీ స్త్రీలు వ్యాయామం చేయొద్దని చెబుతుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఏదైనా అంతర్లీన సమస్యలుంటే తప్ప ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్సర్ సైజ్ చేస్తే పుట్టబోయే బిడ్డకూ మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 • News18
 • Last Updated :
 • Share this:
  గర్భధారణ సమయంలో స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తనతో పాటు కుడుపులో ఉన్న బిడ్డకు తగినంత పోషకాహారం అందేలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. కడుపులో బిడ్డ ఎదిగే సమయంలో క్రమం తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది. కాగా ప్రెగ్రెన్సీ సమయంలో చాలా మంది స్త్రీలు బ్యాక్ పెయిన్ తో బాధపడుతుంటారు. దీని నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతిరోజూ కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా కండరాలు బలోపేతమవుతాయి. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో వ్యాయామం చేయడం మంచిది కాదు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి, ఏవైనా అంతర్లీన ఆరోగ్య సమస్యలు ఉంటే తప్ప గర్భాదారణ సమయంలో వ్యాయామం చేయడం ప్రమాదకరం కాదు. వ్యాయామం వల్ల తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ దీర్ఘకాలిక ప్రయోజనం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

  గర్భధారణ సమయంలో వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు :

  నేచర్ మెటబాలిజం జర్నల్ లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం గర్భధారణకు ముందు మరియు గర్భధారణ సమయంలో వ్యాయామం చేస్తే పుట్టబోయే బిడ్డకు ఊబకాయం, మధుమేహం మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని తేలింది. అందువల్ల, గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ సిఫార్సు చేసింది. గర్భధారణ సమయంలో చేసే వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

  1. వెన్నునొప్పి నుంచి ఉపశమనం
  గర్భంతో ఉన్న స్త్రీ ప్రతిరోజూ 20 నుంచి 30 నిమిషాల వరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వెన్నునొప్పి, వాటర్ రిటెన్షన్ మరియు ఉబ్బరం వంటి లక్షణాల నుంచి బయటపడొచ్చు.

  2. బలాన్ని మెరుగుపర్చుకోవచ్చు
  గర్భంతో ఉన్న స్త్రీ తొమ్మిది నెలల పాటు శిశువు యొక్క అదనపు బరువును మోయాల్సి ఉంటుంది. ఈ సమయంలో వారికి కండరాల బలం మరియు ఓర్పు చాలా అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కండరాల బలాన్ని మెరుగుపర్చుకోవచ్చు.

  3. నిద్రకు సహాయపడుతుంది
  మహిళ గర్భంలో శిశువు పెరుగుతూ ఉన్న సమయంలో నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. కాబట్టి గర్భాధారణ సమయంలోనూ మంచి నిద్ర రావాలంటే వ్యాయామం చేయడం ఉత్తమం.

  4. మానసిక స్థితి మెరుగుపడుతుంది
  గర్భధారణ సమయంలో ఫీమేల్ హార్మోన్లు మరియు రక్త పరిమాణం పెరగడం వల్ల మానసిక స్థితి తరచుగా మారుతుంటుంది. ఈ క్రమంలో వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని ఎండార్ఫిన్లు, సెరోటోనిన్ మరియు డోపామైన్లను బయటకి విడుదలవుతాయి. తద్వారా వ్యాయామం గర్బిణీ స్త్రీల మానసిక స్థితిని అదుపులో ఉంచడానికి మరియు మంచి అనుభూతిని కలిగించడానికి సహాయపడుతుంది.

  5. డయాబెటిస్ ధరిచేరదు
  గర్భధారణ సమయంలో స్త్రీలు తరచుగా మధుమేహం మరియు రక్తపోటు బారీన పడుతుంటారు. ఈ రెండింటినీ సాధారణ వ్యాయామం ద్వారా అదుపులోకి తేవొచ్చు.

  6. సులభంగా పనిచేయగలరు
  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారు. వ్యాయామం శ్రమ ప్రక్రియను సులభతరం చేసి మీ శరీరానికి స్టామినాను అందజేస్తుంది. దీంతో పాటు శిశువును ప్రసవించే సమయంలో ఇబ్బందులు రాకుండా చేస్తుంది.

  7. బరువు తగ్గడానికి సహాయపడుతుంది
  సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు బరువు పెరుగుతారు. అయితే ప్రసవించిన తర్వాత వీలైనంత త్వరగా బరువు తగ్గాలని ఆలోచిస్తుంటారు. వీరికి చక్కటి పరిష్కారం గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం. అయితే, గర్భధారణ సమయంలో కాంటాక్ట్ స్పోర్ట్స్, బౌన్స్, జంపింగ్, అధిక బరువును ఎత్తడం మరియు కఠినమైన వ్యాయామాలను చేయవద్దు. వీటికి బదులు వాకింగ్, కెగెల్ వ్యాయామాలు, స్విమ్మింగ్, యోగా, డాన్సింగ్, ఏరోబిక్స్ మరియు సైక్లింగ్ వంటి వాటిని వైద్యుడి సలహా మేరకు చేయడం మంచిది.
  Published by:Srinivas Munigala
  First published: