Home /News /life-style /

HEALTH BENEFITS OF EATING WATERMELON QUALITIES THAT MAKE WATERMELON A SUMMER FRUIT MKS GH

Summer Fruit Watermelon: ఎండాకాలంలో పుచ్చకాయతో ప్రయోజనాలు తెలుసా? -ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా..

పుచ్చకాయ ప్రయోజనాలు

పుచ్చకాయ ప్రయోజనాలు

ఎండాకాలానికి పుచ్చకాయ పర్యాయపదంగా మారింది. శరీరం వడదెబ్బకు గురికాకుండా హైడ్రేట్ చేయడంలో పుచ్చకాయను మించినది లేదు. ప్రత్యేకమైన రుచిని కలిగిన ఈ సమ్మర్ ఫ్రూట్ వల్ల ఇంకా ఎన్ని ప్రయోజనాలంటే..

వేసవి తీవ్రత పెరిగింది. రోజు‌రోజుకు ఎండలు ముదురుతున్నాయి. వేడి నుంచి ఉపశమనం పొందడానికి జానాలు చేయని ప్రయత్నం ఉండదు. ముఖ్యంగా ఈ కాలంలో పుచ్చకాయలకు డిమాండ్ భలేగా ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే ఎండాకాలానికి పుచ్చకాయ పర్యాయపదంగా మారింది. శరీరం వడదెబ్బకు గురికాకుండా హైడ్రేట్ చేయడంలో పుచ్చకాయను మించినది లేదు. ఇది ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది.

పుచ్చకాయలో దాదాపు 92% నీరు ఉంటుంది. దీన్ని తరుచు తీసుకోవడం వల్ల వేడివాతావారణం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మిమ్మల్ని చల్లగా ఉంచడంతోపాటు మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వేసవిలో పుచ్చకాయలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

Vastu Tips: ఇవి పాటిస్తే మీ ఇంట్లో ధన ప్రవాహమే.. ఆరోగ్యం, ఆనందాన్ని ఇచ్చే వాస్తు నియమాలు..


* రోగనిరోధక శక్తి: ఒక పుచ్చకాయలో మనకు ఒక రోజుకు అవసరమైన విటమిన్ సి, దాదాపు 16 శాతం ఉంటుంది. శరీరంలో తెల్లరక్తకణాలను ఉత్పత్తి చేయడానికి విటమిన్ సి అవసరం. ఇది శరీరాన్ని ఇతర ఇన్ ఫెక్షన్‌ల బారి నుంచి రక్షిస్తుంది. జలుబు నుంచి ఉపశమనం పొందడానికి పుచ్చకాయను తీసుకుంటే మంచిది. దీంతో రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.

* శారీరక శ్రమ: వర్కౌట్లకు ముందు, వ్యాయామం తరువాత కూడా పుచ్చకాయ తీసుకోవచ్చు. దీంట్లో సిట్రులైన్ అనే పదార్థం ఉంటుంది. శరీరం శారీరక శ్రమకు గురైనప్పుడు అవసరమైన అమైనో ఆమ్లాల వినియోగాన్ని పెంచడంలో ఇది కీలకపాత్ర వహిస్తుంది. వ్యాయామం తర్వాత పుచ్చకాయ తింటే కండరాలు బలంగా తయారుకావడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో గ్రోత్ హార్మోన్ స్థాయిలను పెంచుతుంది.

LIC IPO: ఎల్ఐసీ మెగా ఐపీవో ఇప్పట్లో లేనట్టే.. Russia Ukraine War దెబ్బకు ఇలా..


* గుండెకు రక్షణగా: పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా లైకోపిన్ అధికంగా ఉంటుంది. గుండెను ఆరోగ్యవంతంగా ఉంచడంలో ఈ యాంటీఆక్సిడెంట్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే వాసోడిలేటర్ పనిచేయడమే కాకుండా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడటానికి లైకోపిన్ బాగా ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో పుచ్చకాయలు కీలకపాత్ర వహిస్తాయని నిపుణులు అంటున్నారు.

* కంటి ఆరోగ్యం: బీటా-కెరోటిన్, లుటిన్, విటమిన్ సి, జియాక్సంతిన్ వంటి పోషకాల కలయికతో పుచ్చకాయను తీసుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి లోపల ఉన్న మచ్చలను నివారించడంలో పుచ్చకాయ బాగా పనిచేస్తుంది. గ్లాకోమా, ఆప్టిక్ నరాలు, కళ్లు పొడిబారడం వంటి వ్యాధుల నుంచి కంటిని రక్షించడంలో పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది.

Petrol Diesel: పెట్రో ధరలపై కేంద్రం కీలక ప్రకటన.. అక్కడ 50శాతం పెంపు.. Ukraine Warతో ఇలా


* వ్యర్థాలను తొలగించడం: పుచ్చకాయలో కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ తగినంత పరిమాణంలో ఉన్నాయి. దీంతో ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. మూత్రపిండాలు దెబ్బతినకుండా పుచ్చకాయ కాపాడుతుంది. శరీరంపై అనవసరమైన ఒత్తిడి లేకుండా మూత్రం ప్రవాహంలో అవరోధానలను నివారిస్తుంది.

*పుచ్చకాయ చరిత్ర తెలుసా?: పుచ్చకాయ అనేది ఒక పువ్వులు పూసే మొక్క. ఇది ఆఫ్రికాలో పుట్టిందని నమ్ముతారు. ప్రపంచంలోని పొడి ప్రాంతాలలో ఇది పెరుగుతుంది. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. దీంతో అదనపు బరువు పెరగకుండా ఉండాలంటే పుచ్చకాయలు తింటే సరి. ఎర్ర రంగు గుజ్జు ఉన్న పుచ్చకాయల రుచి ఉత్తమంగా ఉంటుంది. పుచ్చకాయలను ప్రపంచంలో అత్యధికంగా పండిస్తున్న దేశం చైనా. మనదేశంలో ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌లో వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: Fruits, Health tip, Summer, Summer special

తదుపరి వార్తలు