కొత్తిమీరతో ఒంట్లో కొవ్వు కరిగించుకోండిలా...

కొత్తిమీర టీ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్‌, లిపిడ్ లెవ‌ల్స్ తగ్గుతాయి. యువతులలో హార్మోన్లు స‌రిగ్గా ప‌నిచేస్తాయి.

news18-telugu
Updated: December 1, 2019, 10:46 PM IST
కొత్తిమీరతో ఒంట్లో కొవ్వు కరిగించుకోండిలా...
కొత్తిమీర టీ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్‌, లిపిడ్ లెవ‌ల్స్ తగ్గుతాయి. యువతులలో హార్మోన్లు స‌రిగ్గా ప‌నిచేస్తాయి.
  • Share this:
కొత్తిమీర జీర్ణ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తుంది. కొత్తిమీర జ్యూస్‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే జీర్ణ స‌మ‌స్య‌లైన గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. కొత్తిమీర జ్యూస్‌ను రోజూ తాగడం వ‌ల్ల శ‌రీరం శుభ్ర‌మ‌వుతుంది. శ‌రీరంలో ఉండే విష, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. జ్వరం వ‌చ్చిన వారు కొత్తిమీర జ్యూస్ తాగితే ఫ‌లితం ఉంటుంది. కొత్తిమీర‌లో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు అన్ని ర‌కాల జ్వ‌రాల‌ను తగ్గిస్తాయి. జీర్ణకోశంలో గ్యాస్‌ ఉత్పత్తి కానివ్వదు. సులభంగా మూత్ర విసర్జన జరిగేట్టు చేసి కిడ్నీల ఆరోగ్యానికి కొత్తిమీర‌ దోహదపడుతుంది. కొత్తిమీర టీ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్‌, లిపిడ్ లెవ‌ల్స్ తగ్గుతాయి. యువతులలో హార్మోన్లు స‌రిగ్గా ప‌నిచేస్తాయి.
First published: December 1, 2019, 10:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading