HEALTH BENEFITS OF COFFEE DRINKING COFFEE MAY REDUCE THE RISK OF DIABETIC RETINOPATHY GH VB
Benefits of Coffee: కాఫీ తాగితే డయాబెటిక్ రెటినోపతి రిస్క్ తగ్గే అవకాశం.. వెల్లడించిన తాజా పరిశోధన..
ప్రతీకాత్మక చిత్రం
చాలామందికి కాఫీ తాగనిదే రోజు మొదలు కాదు. లేచిన వెంటనే గొంతులో కాఫీ దిగితే గాని నిద్ర మత్తు వదలదు. షుగర్ వ్యాధి ఉన్నవారిలో డయాబెటిక్ రెటినోపతి ప్రమాదాన్ని తగ్గించడానికి కాఫీ దోహద పడుతుందని ఇటీవల ఓ కొత్త అధ్యయనంలో తేలింది. ఆ వివరాలు..
చాలామందికి కాఫీ తాగనిదే రోజు మొదలు కాదు. లేచిన వెంటనే గొంతులో కాఫీ(Coffee) దిగితే గాని నిద్ర మత్తు వదలదు. అలాగే పని ఒత్తిడి తగ్గించుకోవడానికి, బద్ధకాన్ని వదిలించుకోవడం, తలనొప్పి నుంచి ఉపశమనం పొందడం తదితర కారణాలతో చాలా కాఫీని తాగుతుంటారు. ఇవేకాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. షుగర్ వ్యాధి ఉన్నవారిలో డయాబెటిక్(Diabetics) రెటినోపతి ప్రమాదాన్ని తగ్గించడానికి కాఫీ(Coffee) దోహద పడుతుందని ఇటీవల ఓ కొత్త అధ్యయనంలో తేలింది. డయాబెటిక్ రెటినోపతి (DR)- కాఫీ మధ్య ఉన్న సంబంధాన్ని అంచనా వేయడానికి కొరియన్ పరిశోధకుల బృందం ఇటీవల ఒక అధ్యయనాన్ని చేపట్టింది. ఈ పరిశోధన ప్రత్యేకించి కొరియన్ సమాజంలో చేపట్టారు.
కొరియాలోని ఇంచియాన్‌లో ఉన్న హాంగిల్ ఐ హాస్పిటల్ ఆప్తాల్మాలజీ విభాగానికి చెందిన హక్ జున్ లీ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. ఇందుకు సంబంధించిన అధ్యయన వివరాలు నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
సర్వే ఎలా చేశారు?
డయాబిటిక్ రెటినోపతి- కాఫీ మధ్య ఉన్న క్రాస్ సెక్షనల్ రీసెర్చ్ కోసం కొరియన్ నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ సర్వే నుంచి డేటా తీసుకున్నారు. ఈ సర్వే 2008 నుంచి 2011 మధ్య నిర్వహించారు. డయాబెటిక్ రెటినోపతి (DR) టెస్ట్ పూర్తిచేసిన 37,753 మంది సర్వేలో పాల్గొన్నారు. వీరిలో టైప్ 2 డయాబెటిస్ ఉన్న 1350 మంది రోగుల డేటాను రీసెర్చ్ కోసం విశ్లేషించారు. డయాబెటిక్ రెటినోపతి(DR), కాఫీ తీసుకోవడం మధ్య పరస్పర సంబంధాన్ని పరిశీలించడానికి మల్టీవేరబుల్ లాజిస్టిక్ రిగ్రెషన్ ఫ్రేమ్‌వర్క్‌లను ఉపయోగించారు. ఇందు కోసం వయస్సు, విద్య, లింగం, వృత్తి, ధూమపానం, సంపాదన, ఆల్కహాల్ తీసుకోవడం, శారీరక శ్రమ, BMI, రక్తపోటు, మధుమేహం కాలం, డైస్లిపిడెమియా, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ వంటి వాటితో గ్రూప్‌లుగా విభజించారు.
రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ కాఫీని తాగుతున్న వారిలో DR ప్రభావం తగ్గిందని అధ్యయనంలో తేలింది. అదేవిధంగా రోజుకు ఒక కప్పు కంటే తక్కువ కాఫీ తాగేవారిలో దృష్టి లోపాన్ని కలిగించే డయాబెటిక్ రెటినోపతి ప్రభావం భిన్నంగా ఉన్నట్లు తేలింది. ట్రెండ్ అనాలిసిస్ని ఉపయోగించి కాఫీ తీసుకునే స్థాయికి DR లేదా VTDRకి మధ్య ప్రతికూల సంబంధాన్ని కనుగొన్నారు. క్యాలరీ వినియోగం వంటి వేరియబుల్స్‌ను నియంత్రించిన తర్వాత బ్లాక్ కాఫీ, స్వీటెనర్ లేదా క్రీమ్‌తో కూడిన కాఫీని ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో డయాబెటిక్ రెటినోపతి ప్రభావం తగ్గిందని పరిశోధకులు గుర్తించారు.
డయాబెటిక్ రెటినోపతి ఉన్న 65 ఏళ్లలోపు కొరియన్లలో కాఫీ వినియోగంతో DR ఫ్రీక్వెన్సీకి ప్రతికూల సంబంధం ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాఫీ వినియోగం కారణంగానే DR తగ్గి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే కాఫీ తీసుకోవడం వల్ల DR మధ్య క్రాస్-సెక్షనల్ సంబంధాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి సమన్వయ పరిశోధనలు మరింత జరగాల్సిన అవసరం ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.