Butterfly Pea flower: శంకుపుష్పంతో ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా?

శంకుపుష్పంతో ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా? (credit - twitter)

Health benefits of Butterfly Pea flower : మన పల్లెటూర్లలో చాలా చోట్ల కనిపించే మొక్క శంకు మొక్క. పాకుతూ పోయే ఈ మొక్కకు పూసే నీలి రంగు శంకుపుష్పాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

  • Share this:
    శంకుపుష్పం లేదా బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ లేదా డార్విన్ పీ ఫ్లవర్ అనేది... పాకుతూ పెరిగే మొక్క. సాధారణంగా దీన్ని డెకరేషన్ కోసం పెంచుతుంటారు. ఐతే... ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీని ఆకులు, వేర్లు, విత్తనాలు, పువ్వులు అన్నింటినీ ఆయుర్వేదంలో రకరకాల వ్యాధుల నివారణకు వాడుతారు. పురాతన కాలం నుంచీ ఈ శంకు పుష్పాలను సంప్రదాయ మందుల్లో వాడుతున్నారు. ఇది బ్రెయిన్‌కి టానిక్‌లా పనిచేసి... మెమరీ పవర్‌, తెలివితేటల్ని పెంచుతుంది. కళ్లు, గొంతులో సమస్యల్ని నివారిస్తుంది. చర్మం, మూత్ర సంబంధ వ్యాధుల్ని కూడా ఇది నయం చేస్తుంది. ఒత్తిడి, నీరసం, మతిమరపు, నిద్ర లేమి, కంటి చూపు సమస్యలు, జుట్టు రాలిపోవుట, చర్మం వదులుగా అవ్వుట వంటి సమస్యలు వస్తుంటే ఈ పూలను ఉపయోగించడం సరైన పరిష్కారం. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, పెప్టైడ్స్ మంచి ఫలితాల్ని ఇస్తున్నాయి. మీకు తెలిసే ఉంటుంది... చాలా వంటల్లో కలర్ కోసం ఈ పువ్వుల్ని వాడుతారు. వీటిని పిండిలో ముంచి... ఫ్రై చేసి తింటారు. అలాగే... వీటితో టీ, షర్బత్ కూడా చేస్తారు. కాబట్టి ఈసారి నర్సరీకి వెళ్తే... ఈ మొక్క తెచ్చుకోండి. ఎందుకంటే దీనితో ఏం చేసుకోవచ్చో కింద మాట్లాడుకుందాం.

    health benefits,health tips,home remedies,health secrets,ayurveda health tips,health care,ayurvedic diet,ఆరోగ్య రహస్యాలు, ఆరోగ్య చిట్కాలు,హెల్త్ సీక్రెట్స్,
    శంకుపుష్పంతో ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా? (credit - twitter)


    శంకపుష్పం టీ : కావాల్సినవి -
    శంకపుష్పాలు - 2
    నీరు - 1 కప్పు
    అల్లం - టీస్పూన్‌లో నాలుగో వంతు (మెత్తగా చేసుకోవాలి)
    సోంపు లేదా సోపు - టీస్పూన్‌లో నాలుగోవంతు. (పొడి చేసుకోవాలి)
    షుగర్ లేదా బెల్లం లేదా తేనె (కావాల్సినంత)
    నిమ్మ గడ్డి (Lemon grass) - ఇంచులో నాలుగోవంతు

    తయారీ విధానం -
    ఓ గిన్నెలో నీరు పోసి వేడి చెయ్యండి. అందులో అల్లం ముద్ద, సోపు పొడి, నిమ్మగడ్డి, పూలను వేసి ఉడకబెట్టాలి.
    సిమ్‌లో ఐదారు నిమిషాలు ఉడికాక... మంట ఆర్పేసి... గిన్నెపై మూత పెట్టాలి. రెండు నిమిషాలు ఉంచి... వడగట్టి... తాగేయడమే.

    శంకపుష్పం షర్బత్ : కావాల్సినవి -
    నీరు - 1 గ్లాస్ (చల్లగా ఉండాలి)
    నిమ్మ రసం - అర బద్ద రసం
    తులసి విత్తనాలు - 1 టీ స్పూన్ (నానబెట్టినవి)
    షుగర్ లేదా బెల్లం లేదా తేనె (కావాల్సినంత)
    శంకుపుష్పాలు - 4

    తయారీ విధానం -
    ఓ గిన్నెలో వేడి నీరు పోసి అందులో శంకుపుష్పాలు వెయ్యాలి. పైన మూత పెట్టి... పువ్వుల రంగు నీటిలో కలిసేవరకూ ఉంచాలి.
    ఇప్పుడు నీటిని వడగట్టి... అందులో నిమ్మరసం, తులసి విత్తనాలు, షుగర్ వంటివి వేసి కలిపి తాగేయడమే. ఇది కూల్ చేసుకొని తాగితే బాగుంటుంది.

    శంకుపుష్పం షీరా : కావాల్సినవి
    రవ్వ లేదా సెమొలినా - 1 కప్పు
    షుగర్ - కప్పులో మూడో వంతు
    యాలకులు - 2 (పొడి చేసుకోవాలి)
    నువ్వులు - 1 టీ స్పూన్
    నెయ్యి - 4 టీ స్పూన్లు
    శంకుపుష్పాలు - 8
    నీరు - 3 కప్పులు

    ఇది కూడా చదవండి: Vastusashtra: అప్పులు పోయి... డబ్బు సంపాదించాలా... ఇంట్లో ఈ మార్పులు చెయ్యండి

    తయారీ విధానం :
    - కడాయ్‌లో నువ్వుల్ని వేపి... పక్కన పెట్టాలి.
    - ఇప్పుడు కడాయ్‌లో నెయ్యి వేసి... రవ్వను... గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేపాలి. దాన్ని పక్కన పెట్టాలి.
    - ఇప్పుడు కడాయ్‌లో 3 కప్పుల నీరు వేసి... మరగనివ్వాలి. అప్పుడు శంకుపుష్పాలు వేసి... వేపిన రవ్వ కూడా వేసి... సిమ్‌లో ఉడికించాలి.
    - రవ్వ పూర్తిగా ఉడికాక... అందులో షుగర్, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చివర్లో నువ్వులు కూడా వెయ్యాలి.
    - ఇప్పుడు బాగా కలుపుతూ స్టవ్ ఆర్పేయాలి. ఇప్పుడు అందరికీ సెర్వ్ చేసి తినేయడమే.
    Published by:Krishna Kumar N
    First published: