Krishna Kumar NKrishna Kumar N
|
news18-telugu
Updated: June 9, 2020, 4:41 AM IST
ప్రతీకాత్మక చిత్రం
పసి పిల్లల చర్మం చాలా సున్నితంగా, కోమలంగా ఉంటుంది. చుట్టూ ఉన్న వాతావరణంలో వేడి ఎక్కువైనా, చలి ఎక్కువైనా... పిల్లలు తట్టుకోలేరు. వాళ్ల చర్మం ఆ వాతావరణానికి వెంటనే అలవాటు పడలేదు. అందువల్ల చిన్నారుల స్కిన్‌ని కాపాడేందుకు... వాళ్లకు రక్షణ కల్పించేందుకూ... బేబీ ఆయిల్ చక్కగా ఉపయోగపడుతుంది. కాస్త రేటు ఎక్కువైనప్పటికీ... చాలా మంది బేబీ ఆయిల్‌తో పిల్లలకు మసాజ్ చేస్తున్నారంటే... కారణం దాని వల్ల కలిగే చక్కటి ప్రయోజనాలే. ఐతే... బేబీ ఆయిల్... పిల్లలకు మాత్రమే ఉపయోగిస్తామనుకుంటే పొరపాటే... ఆ నూనెని పెద్దవాళ్లు కూడా ఎన్నోవిధాలుగా ఉపయోగించొచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
బేబీ ఆయిల్‌తో ప్రయోజనాలు :* చర్మం పగిలినప్పుడు చాలామంది వేజిలైన్ రాస్తుంటారు. అలాంటి సమయంలో వేజిలైన్ లేకపోతే... ఈ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది.
* ఒక్కోసారి కాలిపాదం చర్మం పెళుసుగా మారుతుంటుంది. రాత్రి పడుకునే టైమ్‌లో ఈ ఆయిల్ రాస్తే బెటరే.
* మేకప్ రిమూవర్‌గా బేబీ ఆయిల్‌ని ఉపయోగించొచ్చు.
* ముఖానికి తేమ సరిగా అందాలంటే ఈ నూనెని తరచూ రాయడం మంచిదే.
* కంటి కింద ఏర్పడిన వలయాలు, నల్లటి గీతలను బేబీ ఆయిల్ తొలగిస్తుంది.
* ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దద్దుర్ల వంటివి ఏర్పడతాయి. వాటిని ఈ నూనె రాయడం వల్ల తగ్గించుకోవచ్చు.
* పొడిచర్మం వారికి దురద, దద్దుర్ల సమస్యల్ని కూడా బేబీ ఆయిల్ దూరం చేస్తుంది.
Published by:
Krishna Kumar N
First published:
June 9, 2020, 4:37 AM IST