HEALTH BENEFITS NOT ONLY RED ONION YOU CAN AMAZING HEALTH BENEFITS FROM WHITE ONION ALSO SK
White Onion Benefits: ఎర్ర ఉల్లి మాత్రమే కాదు..తెల్ల ఉల్లితోనూ బోలెడు లాభాలు..అవేంటంటే..
ప్రతీకాత్మక చిత్రం
White onion health benefits: రుచిలో తేడా ఉన్నప్పటికీ.. తెల్ల ఉల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తెల్ల ఉల్లి వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఉల్లి (Onion Health Benefits) చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయల వల్ల అన్ని లాభాలున్నాయి. కూరలకు మంచి రుచి ఇవ్వడం మాత్రమే కాదు..ఉల్లి వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే ప్రతి ఇంట్లో తప్పకుండా ఉల్లిగడ్డలు ఉంటాయి. ప్రతి రోజూ ఏదో ఒక విధంగా ఆహారంలో వినియోగిస్తారు. ఐతే ఎక్కువ మంది ఎర్ర ఉల్లిపాయలనే వినియోగిస్తారు. మార్కెట్లో తెల్ల ఉల్లి దొరికినప్పటికీ రుచి అంతగా బాగోదని చాలా మంది తీసుకోరు. రుచిలో తేడా ఉన్నప్పటికీ.. తెల్ల ఉల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తెల్ల ఉల్లి వల్ల ఎన్నో అద్భుతమైన (White onion health benefits) ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
తెల్ల ఉల్లి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
జులుబు దెబ్బకు పరార్
తెల్ల ఉల్లిపాయల్లో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు అలర్జీల నుంచి మనల్ని రక్షిస్తాయి. అందువల్ల జులుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. చలికాలంలో తెల్ల ఉల్లిపాయను తింటే జలుబు, దగ్గు సమస్యల నుంచి బయటపడవచ్చు.
ఉదర సమస్యలు ఫసక్
తెల్ల ఉల్లిపాయలో ఉండే ఫైబర్, ప్రోబయోటిక్ మూలకాలు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా తెల్ల ఉల్లిపాయలో ఉండే ఇనులిన్ ప్రోబయోటిక్ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీని వల్ల ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రావు.
రోగ నిరోధక శక్తికి బూస్ట్
మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తెల్ల ఉల్లిపాయ కీలక పాత్ర పోషిస్తోంది. తెల్ల ఉల్లిపాయలో ఉండే సెలీనియం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరోనా సమయంలో మీ రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే... తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
క్యాన్సర్కు చెక్
తెల్ల ఉల్లిపాయలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి గుణాలు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతాయి. వీటితో పాటు ఫిసెటిన్, క్వెర్సెటిన్ వంటి లక్షణాలు కూడా తెల్ల ఉల్లిపాయలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఎలాంటి కణితి పెరగకుండా సహాయపడతాయి. అందుకే క్యాన్సర్ వంటి రోగాల బారినప పడకుండా ఉండాలంటే తెల్ల ఉల్లి వంటి పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.