Health Tips: మీ శరీరంలోని కొవ్వు ఐస్‌లా కరగాలా? ఈ 10 ఆహార పదార్థాలను తీసుకోండి

అయితే ఎవరూ ఎలాంటి లక్షణాలు లేకుండా మరణించరు. గతంలో వీరికి ఏదో ఒక సమస్య ఉంటుంది. టెన్షన్ లో ఉన్నప్పుడు అరవడం.. ఛాతీలో ఒత్తిడి, నొప్పి, గుంతులో అడ్డుగా ఉనట్లు అనిపిస్తే జాగ్రత్తలు అవసరం. కానీ డయాబెటిస్ రోగులలో ఈ లక్షణాలు కనిపించవు. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవారికి నరాలు దెబ్బతింటాయి. కండరాలు జన్యుపరంగా లావుగా ఉన్నవారిలోనూ ఈ ప్రమాదం ఉంటుంది.

Health Tips: కొవ్వును కరిగించే ఆహారాన్ని తీసుకొని గుండెను పదిలంగా పది కాలాల పాటు ఉంచుకోవచ్చని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమస్యను దూరం చేసే ఆహార పదార్థాల జాబితాను వారు ప్రచురించారు. అవేంటో తెలుసుకుందాం.

  • Share this:
ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య చెడు కొలెస్ట్రాల్. ఇది గుండె జబ్బులతో పాటు ఇతర వ్యాధులకు దారితీస్తుంది. మనం తినే ఆహారం ద్వారానే ఇది శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇలా పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను కొన్ని రకాల ఆహారాల ద్వారా తగ్గించుకోవచ్చట. కొవ్వును కరిగించే ఆహారాన్ని తీసుకొని గుండెను పదిలంగా పది కాలాల పాటు ఉంచుకోవచ్చని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమస్యను దూరం చేసే ఆహార పదార్థాల జాబితాను వారు ప్రచురించారు. అవేంటో తెలుసుకుందాం.

* కూరగాయలు
కూరగాయలు అధికంగా తీసుకుంటే వాటిలో ఉండే ఫైబర్ శరీరానికి ఎంతో శక్తినిస్తుంది. అలాగే శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది. వంకాయ, బెండకాయలో అధికంగా ఫైబర్ ఉంటుంది. రోటీ, చపాతీతో ఎక్కువగా వీటినే చాలామంది తీసుకుంటారు. బ్రకోలి, చిలగడదుంప వంటి వాటికి కూడా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు ఉన్నాయి.

Lungs: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా ? అయితే మీ ఊపిరితిత్తుల్లో ఇబ్బంది ఉన్నట్టే..

* నట్స్
నట్స్‌ లేదా వివిధ రకాల గింజల్లో అసంతృప్త కొవ్వులు ఎక్కువగా, సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎల్‌డీఎల్‌(లో డెన్సిటీ లిపోప్రొటీన్) కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. నట్స్‌లో ఉండే ప్రొటీన్ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దానితో పాటు నట్స్‌లో పుష్కలంగా విటమిన్స్, ప్రొటీన్స్ ఉంటాయి.

* తృణధాన్యాలు
వీటిలో కూడా ఎక్కువగా కరిగే ఫైబర్ ఉంటుంది. ఒక కప్పు బార్లీ లేదా తృణధాన్యాల్లో 6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. 193 కేలరీలు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి.

Avoid Dengue: విజృంభిస్తున్న డెంగీ జ్వరం.. ఈ వైరస్‌కు దూరంగా ఉండండి

* ఓట్స్
ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. చాలామంది ఓట్స్‌ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అది కూడా సాల్యుబుల్.. అంటే కరిగే ఫైబర్. బీటా గ్లూకాన్ రూపంలో ఈ ఫైబర్ ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌ను కరిగించే యాసిడ్స్‌ను బీటా గ్లూకాన్ విడుదల చేస్తుంది. దాని వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగి శరీరంలో నుంచి బయటికి వెళ్లిపోతుంది.

* బీన్స్
త్వరగా ఆకలి వేయకూడదు అని అనుకుంటే బీన్స్‌ను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోండి. వీటిలో కూడా అధిక ఫైబర్ ఉంటుంది. వీటిలో ఉండే హైప్రోటీన్స్ వల్ల త్వరగా ఆకలి వేయదు. దీని వల్ల.. ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండొచ్చు. తద్వారా త్వరగా బరువు తగ్గొచ్చు. బీన్స్‌లోనూ చాలా రకాలు ఉంటాయి. వీటితో చాలా రకాల వంటకాలు కూడా చేసుకోవచ్చు.

పొరపాటున కూడా ఈ ఫుడ్స్‌ను వేడి చేసుకుని తినొద్దు.. అలా తింటే రోగాలను కొని తెచ్చుకున్నట్లే

* వెజిటబుల్ ఆయిల్స్
చాలామందికి కూరల్లో ఏ ఆయిల్ వాడాలో తెలియదు. కానీ చాలా ఆయిల్స్‌లో ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటుంది. వెజిటబుల్ ఆయిల్స్‌లో అంతగా కొలెస్ట్రాల్ ఉండదు. దానితో పాటు వీటిలో విటమిన్ ఈ, కే పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను నిరోధిస్తాయి.

* ఫ్యాటీ ఫిష్
చేపలు తింటే మంచిది అనే విషయం అందరికీ తెలుసు కానీ.. ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్‌ను కలిగి ఉన్న చేపలను తీసుకుంటే.. చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. గుండె జబ్బులు కూడా తగ్గుతాయి.

Head bath: రోజు తల స్నానం చేయడం మంచిదేనా?.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి

* సోయా
సోయా బీన్స్ అనేవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు బెస్ట్ ఫుడ్. ప్రతిరోజు సోయా ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఎల్‌డీఎల్‌ తగ్గుతుంది. సాచురేటెడ్ ఫ్యాట్ కూడా ఇందులో తక్కువగా ఉంటుంది.

ఇలాంటి ఆహార పదార్థాలతో పాటు ఫైబర్ సప్లిమెంట్స్‌ను కూడా తీసుకుంటే శరీరంలో సాల్యుబుల్ ఫైబర్ పెరుగుతుంది. దాని కోసం సైల్లియం అనే ఫుడ్ సప్లిమెంట్‌ను తరుచూ తీసుకుంటే ఫైబర్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అయితే సహజంగా ఆహారం ద్వారా ఎక్కువగా ఫైబర్ తీసుకోలేని వాళ్లు మాత్రమే ఫుడ్ సప్లిమెంట్స్ వాడితే బెటర్.
Published by:Shiva Kumar Addula
First published: