Herbal Jam: హెర్బల్ జామ్‌తో.. వేడికి వేయండి బ్రేక్..!

శరీరానికి తగిన పోషకాలతో పాటు రుచినందించే వంటకాలంటే మనలో చాలా మంది ఇష్ట పడతారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నందించే ఆహారాల్లో హెర్బల్ జామ్ ఒకటి.

news18-telugu
Updated: October 1, 2020, 1:01 PM IST
Herbal Jam: హెర్బల్ జామ్‌తో.. వేడికి వేయండి బ్రేక్..!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శరీరానికి తగిన పోషకాలతో పాటు రుచినందించే వంటకాలంటే మనలో చాలా మంది ఇష్ట పడతారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్నందించే ఆహారాల్లో హెర్బల్ జామ్ ఒకటి. ఇప్పపూలతో తయారు చేసే ఈ జామ్ ను మధుకా లేహా అని పిలుస్తారు. దీని వల్ల ఓంట్లో వేడి తగ్గడమే కాకుండా బాలింతల్లో పాల కొరత ఉండదు. ఫలితంగా సంతానం ఆరోగ్యకరంగా ఉంటుంది. మరి ఈ హెర్బల్ జామ్ తయారీని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

హెర్బల్ జామ్ కు అవసరమైన పదార్ధాలు..

ఇప్ప పూలు---------------- 80 గ్రాములు
ఖర్జూర పళ్లు---------------- 80 గ్రాములు
పండిన అరటి పండు----------- 80 గ్రాములు
పచ్చి కందిపప్పు-------------- 80 గ్రాములు
షుగర్ క్యాండి--------------- 700 గ్రాములుబే లీఫ్---------------- 6 గ్రాములు
దాల్చిన చెక్క------------- 6 గ్రాములు
పిప్పలి(లాంగ్ పెప్పర్)-------- 2 గ్రాములు
యాలకులు-------------- 2 గ్రాములు
తేనే------------------ 10 మిల్లీ లీటర్లు
రాగి పిండి-------------- 1 లేదా 2 స్పూన్లు
మొత్తం 400 గ్రాముల హెర్బల్ జామ్ తయారీకి ఈ పదార్ధాలు కావాలి.

హెర్బల్ జామ్ తయారీ విధానం..
ముందుగా ఖర్జూర పళ్లలో విత్తనాలు తీసేసి అరటి పండుతో పాటు ఉడికించాలి. అనంతరం వాటిని మందంగా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. నెయ్యి, షుగర్ క్యాండీని కలిపి వేయించాలి. అది చిక్కగా అయిన యాలకుల పొడితో ఇతర పదార్ధాలను వేయాలి. అనంతరం చల్లార్చి తేనెను కలపాలి. ఆ మిశ్రమానికి రాగిపొడిని కలిపితే రుచికరమైన హెర్బల్ జామ్ సిద్ధమవుతుంది.

ఆరోగ్య ప్రయోజనాలు..
శిశువులకు ఈ హెర్బల్ జామ్ ఎంతో మంచిది. కార్బోహైడ్రేట్లు, త్వరగా జీర్ణమయ్యే ప్రోటీన్లు, ఖనిజాలు ఇందులో ఉంటాయి. ఇప్ప పూలను సంప్రదాయబద్ధంగా వేడి తగ్గేందుకు వాడుతారు. ఇది మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా యాంటీహెల్మింటిక్ లక్షణాలను కలిగి ఉన్న ట్రాన్సిలిటిస్, ఫారింగైటిస్, బ్రోన్కైటిస్ లకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
Published by: Sumanth Kanukula
First published: October 1, 2020, 12:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading