Skincare: మొటిమలకు కారణమయ్యే అలవాట్లు ఇవే.. సమస్యను ఎలా దూరం చేసుకోవాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

Skincare: చర్మ సంరక్షణపై సరైన దృష్టి పెట్టనప్పుడు చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. స్కిన్ కేర్ విషయంలో సరైన పద్ధతులు పాటించకపోతే మొటిమలు, నల్ల మచ్చలతో పాటు ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మొటిమలు పురుషులు, మహిళలు అనే తేడాలు లేకుండా అందరినీ వేధిస్తాయి.

  • Share this:
చర్మ సంరక్షణపై సరైన దృష్టి పెట్టనప్పుడు చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. స్కిన్ కేర్ విషయంలో సరైన పద్ధతులు పాటించకపోతే మొటిమలు, నల్ల మచ్చలతో పాటు ఇతర సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మొటిమలు పురుషులు, మహిళలు అనే తేడాలు లేకుండా అందరినీ వేధిస్తాయి. సాధారణంగా ప్రతి ఒక్కరూ కౌమారదశలో మొటిమల సమస్యను ఎదుర్కొంటారు. అయితే చర్మ సంరక్షణలో చేసే తప్పులు, ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల లోపం.. వల్ల పెద్దవాళ్లు కూడా వీటి బారిన పడతారు. ఈ సమస్య నుంచి బయటపడే మార్గాలను వివరిస్తున్నారు డెర్మటాలజిస్టులు. ముందు సమస్యకు కారణాలు తెలుసుకున్న తరువాత, నివారణ పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు.

Pregnant Women: కరోనా వైరస్‌తో గర్భిణీలకు ముప్పే.. ఐసీఎంఆర్ అధ్యయనంలో షాకింగ్ నిజాలు..


మొటిమలు తరచుగా వేధించడానికి కారణాలు..
కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల మొటిమలు వస్తాయి. కృత్రిమ చక్కెరలు ఉండే జంక్‌ఫుడ్, చాక్లెట్, ఐస్ క్రీం వంటి పదార్థాలు తరచుగా తీసుకునే వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. ఇతర అనారోగ్యాలకు చికిత్సలో భాగంగా తీసుకునే కొన్ని రకాల మందులు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. ఫలితంగా మొటిమలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాయామం చేసిన తరువాత స్నానం చేయని వారు కూడా తరచుగా ఈ సమస్యను ఎదుర్కొంటారు. వ్యాయామాలు చేసేటప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది. ఆ తరువాత స్నానం చేయకపోతే.. చర్మంపై పేరుకుపోయే బ్యాక్టీరియా వల్ల మొటిమలు వంటి చర్మ సమస్యలు ఎదురవుతాయి.

Womens: కరోనా వ్యాక్సిన్​ వల్ల మహిళల్లో పీరియడ్స్‌పై ప్రభావం పడుతుందా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..


ఎండలో ఎక్కువ సమయం ఉండేవారి ముఖంపై మొటిమలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంది. ఎండ తీవ్రతతో చర్మం ఎర్రబారడంతో పాటు మృతకణాలు ఎక్కువగా పేరుకుపోవడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా చెమట ఎక్కువగా పడుతూ, బ్యాక్టీరియా పెద్ద మొత్తంలో పోగవుతుంది. దీనివల్ల మొటిమలు ఏర్పడతాయి. ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం వల్ల హార్మోన్ల సమత్యులత దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మొటిమలు ఎక్కువగా ఏర్పడతాయి.

Acidity Prevention: ఎసిడిటీతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటిస్తే క్షణాల్లో మాయం..


సమస్యను ఎలా దూరం చేసుకోవచ్చు..?
మొటిమలను నివారించే ప్రధాన మార్గం.. మెరుగైన చర్మ సంరక్షణ పద్ధతులు పాటించడమేనని చెబుతున్నారు చర్మవ్యాధుల నిపుణులు. సాలిసిలిక్ యాసిడ్ ఉండే ఫేస్ వాష్‌తో ముఖాన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు కడగాలి. తరువాత మాయిశ్చరైజ్ అప్లై చేయాలి. జిడ్డు చర్మతత్వం ఉన్నవారు సైతం మాయిశ్చరైజర్లు వాడాలి. లేదంటే చర్మం మరీ పొడిబారినప్పుడు.. శరీర గ్రంథులు ఎక్కువ నూనెలను ఉత్పత్తి చేస్తాయి. ముఖానికి వేసుకునే మేకప్‌ను పూర్తిగా తొలగించాలి. పరిశుభ్రంగా లేని వస్తువులను మేకప్ కోసం వాడితే మొటిమల సమస్య మరింత పెరుగుతుంది.

Vaccination Effects: కరోనా టీకాతో రుతుక్ర‌మంలో మార్పులు వస్తాయా..? నిపుణులు ఏం చెబుతున్నారు..


అందువల్ల కాస్మెటిక్ స్పాంజ్‌లు, రీ యూజబుల్ ప్యాడ్‌లు, క్లారిసోనిక్ బ్రష్ హెడ్‌లు, ట్వీజర్‌లు, ఐలాష్ కర్లర్లు.. వంటి వస్తువులను తరచుగా శుభ్రం చేసుకోవాలి. మొటిమలను గిల్లడం వల్ల కూడా సమస్య మరింత ఎక్కువ అవుతుంది. వాటిని గిల్లినప్పుడు బయటకు వచ్చే వ్యర్థాల కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెంది, మొటిమలు ఏర్పడటానికి దారితీస్తుంది. కొన్నిసార్లు చర్మం ఎర్రబడటం, వాపుతో పాటు మచ్చలు వచ్చే అవకాశాలను కూడా పెంచుతుంది.

Covid 19: కోవిడ్‌తో తీవ్ర కిడ్నీ సమస్యలు.. అధ్యయనంలో సంచలన నిజాలు.. హెచ్చరిస్తున్న వైద్యులు..


చర్మ తత్వానికి సరిపడే బ్యూటీ కేర్ ఉత్పత్తులను మాత్రమే ఎంచుకోవాలి. పొడి చర్మం, జిడ్డు చర్మ తత్వం ఉన్న వారు వేర్వేరు ప్రొడక్ట్స్ వాడాల్సి ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారు చర్మం పొరల్లో నూనెల ఉత్పత్తిని నిరోధించే కామెడోజెనిక్ ప్రొడక్ట్స్ ఎంచుకోవాలి. చర్మ లక్షణాలు, రకాన్ని తెలుసుకోవడానికి స్కిన్ సెన్సిటివిటీ టెస్ట్ చేసి, దాని ఆధారంగా మీకు సరిపోయే ఉత్పత్తిని కొనుగోలు చేయాలి. అయితే ఇప్పటికే సమస్య తీవ్రంగా ఉన్నవారు సొంత వైద్యాన్ని పక్కనపెట్టి నిపుణులను సంప్రదించడం మంచిది.
Published by:Veera Babu
First published: