Home /News /life-style /

HEALTH BANANA IS A POWERFUL FRUIT PACKED WITH HEALTH BENEFITS AND HERE HOW TO INCLUDE BANANA IN YOUR SKIN CARE IN WINTER SEASON GH SRD

Skin Care: శీతాకాలంలో చర్మ సంరక్షణకు అరటిపండు బెస్ట్.. ఎలా ఉపయోగించాలంటే..

Banana - Skin Care

Banana - Skin Care

Skin Care: శీతాకాలం వచ్చిందంటే చర్మ సమస్యలు ఎక్కువ అవుతాయ్. సాదారణంగా చర్మం పొడిగా మారటం, పొరలుగా ఊడటం వంటివి జరుగుతూ ఉంటాయి. అందువలన చల్లగా ఉన్నప్పుడు శీతాకాలంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.

అరటిపండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయం తెలిసిందే. పొటాషియం, విటమిన్ సి, బి6 వంటి పోషకాలకు నిలయం ఇది. అయితే అరటిపండ్లను జుట్టు, చర్మ సంరక్షణలో వాడవచ్చని చెబుతున్నారు బ్యూటీషియన్లు. ముఖ్యంగా శీతాకాలంలో చర్మ సంరక్షణకు అరటి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. దీంట్లో పెద్ద మొత్తంలో ఉండే పొటాషియం, పొడి చర్మంతో పాటు పొడి జుట్టుకు పోషణనిస్తుంది. అరటిపండు గుజ్జును ఫేస్‌, హెయిర్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. చర్మానికి వివిధ రకాల క్రీములు వాడటం, జుట్టుకు రంగు వేయడం వల్ల కలిగే దుష్ప్రభావాలకు బనానా ప్యాక్ చెక్ పెడుతుంది.

అరటి పండు చర్మానికి పోషణ ఇవ్వడంతో పాటు తేమగా, బిగుతుగా ఉంచుతుంది. ఫలితంగా ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అరటి పండులో పెరుగు కలిపి తయారు చేసే మిశ్రమానికి ఎలాంటి రసాయనాల లేపనాలు సాటిరావు. దీనితో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దీనికి ఒక టీస్పూన్ గ్లిజరిన్ లేదా తేనె, బాదం నూనె కూడా కలపవచ్చు. ఈ మిశ్రమం చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

* బనానా ఫేస్ ప్యాక్ ఎలా ఉపయోగించాలి
ముందు అరటి పండు గుజ్జును ఒక గిన్నెలో తీసుకొని, దానికి కొంచెం పెరుగు, తేనె కలపండి. ఇది మెత్తని పేస్ట్‌లా వచ్చేవరకు బాగా కలపాలి. ఆ తరువాత జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇదే ప్యాక్‌ను ముఖానికి కూడా పట్టించి ఆరిన తరువాత కడగవచ్చు. దీనివల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్‌లలో ఫేస్ మసాజ్ తర్వాత ఫ్రూట్ ఫేషియల్‌ చేస్తున్నారు. అయితే ఇప్పుడు బనానా ఫేషియల్‌ అనేది ట్రెండింగ్‌లో ఉంది. ఈ మిశ్రమాన్ని ఇంట్లోనే తయారు చేసుకొని ముఖం, జుట్టుకు పట్టించవచ్చు. వీటిలో ఉండే విటమిన్ బి, విటమిన్ సి చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇది కూడా చదవండి : ఎముకలు కొరికే చలి.. శీతల వాతావరణంలో వణికిపోతున్నారా? ఈ చిట్కాలు పాటించండి

అరటిపండు గుజ్జును ఇతర పండ్లతో కలిపి కూడా ఫేస్, హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. బాగా పండిన బొప్పాయి గుజ్జును ఈ మిశ్రమంలో కలపవచ్చు. అవసరమైతే బాగా తురిమిన యాపిల్ ముక్కలు, నారింజ గుజ్జును సైతం జోడించవచ్చు. వీటన్నింటి మిశ్రమంతో ఫ్రూట్ ఫేస్‌ ప్యాక్‌ను తయారు చేసుకొని, శీతాకాలంలో సహజంగా చర్మాన్ని సంరక్షించుకోవచ్చు.

బొప్పాయిలో ఉండే ఎంజైమ్‌, తలలో పేరుకుపోయే చుండ్రును శుభ్రం చేసే అద్భుతమైన ఏజెంట్‌గా పనిచేస్తుంది. నారింజలో విటమిన్ సి ఉంటుంది. వీటికి అరటి గుజ్జు చేరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ ఫేస్‌ప్యాక్ టోనర్‌గా కూడా పనిచేస్తుంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: Banana, Health Tips, Skin care

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు