హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Acidity Prevention: ఎసిడిటీతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటిస్తే క్షణాల్లో మాయం..

Acidity Prevention: ఎసిడిటీతో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటిస్తే క్షణాల్లో మాయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది ఏదైనా కాస్త తినగానే తేన్పులు, ఆవలింతలు(Yawns), గ్యాస్(Gas) వంటివి వస్తుంటాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఇది క్రమంగా ఛాతీలో భరించలేని మంటకు దారితీయడంతో పాటు గొంతు(Throat) అంతా మండినట్లుగా అనిపిస్తుంది. ఈ సమస్యల నుంచి దూరం కావాలంటూ కింద చెప్పిన చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.

ఇంకా చదవండి ...

చాలా మంది ఏదైనా కాస్త తినగానే తేన్పులు, ఆవలింతలు(Yawns), గ్యాస్(Gas) వంటివి వస్తుంటాయి. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఇది క్రమంగా ఛాతీలో భరించలేని మంటకు దారితీయడంతో పాటు గొంతు(Throat) అంతా మండినట్లుగా అనిపిస్తుంది. ఈ లక్షణాలనే ఎసిడిటీ అంటారు. ఎక్కువగా తినడం, సమయం కాని సమయంలో తినడం, భోజనాల మధ్య ఎక్కువ గ్యాప్​ పాటించడం వల్ల ఈ సమస్య తీవ్రమవుతుంది. మరోవైపు, ఒత్తిడితో కూడిన జీవనశైలి, హానికరమైన ఆహారం వంటి అనేక అంశాలు ఎసిడిటీకి దారితీస్తాయి. అయితే కొన్ని సాధారణ జీవనశైలి మార్పులతో ఎసిడిటీని నివారించవచ్చు. ఎసిడిటీ నివారణకు అనేక చిట్కాలను సూచిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేంటో చూద్దాం.

ఎసిడిటీ(Acidity) రాకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే..

1. ఎక్కువగా కారం, పులుపు, ఉప్పు, పులియబెట్టిన, వేయించిన, ఫాస్ట్ ఫుడ్ తినడాన్ని మానుకోండి.

2. ఏ ఆహారమైనా సరే సమతుల్యంగా తినండి. అతిగా తినవద్దు.

3. పుల్లని పండ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

4. ఎక్కువ గంటలు ఆకలితో ఉండకండి. భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్​ పాటించకండి.

Kitchen Cleaning Tips: వంటగదిని శుభ్రం చేయాలా.. ఈ చిట్కాలను పాటించండి.. గదంతా ధగధగ మెరిసిపోతుంది..


5. బిజీ పనుల వల్ల భోజనాన్ని స్కిప్ చేయకండి.

6. రోజూ క్రమ పద్ధతిలో టైమ్​ ప్రకారం తినడం అలవాటు చేసుకోండి.

7. రాత్రి పడుకునే సమయంలో తినకండి. పడుకోవడానికి కనీసం గంట ముందు డిన్నర్​ చేయండి.

8. మీ కూరల్లో అధిక మొత్తంలో వెల్లుల్లి, ఉప్పు, నూనె, మిరపకాయలు లేకుండా చూసుకోండి.

మాంసాహారం ఎక్కువగా తినకపోవడమే మంచిది.

9. భోజనం చేసిన వెంటనే, పడుకోవడం మానుకోండి. ఇది మీ పొట్ట భాగంలో ఆహారం మిగిలిపోయేలా చేస్తుంది.

10. ధూమపానం, ఆల్కహాల్, టీ, కాఫీ, ఆస్పిరిన్ వంటి తరచూ తీసుకోవడం మానుకోండి.

11. ఒత్తిడి లేని జీవన శైలిని అలవాటు చేసుకోండి.

ఇప్పటికే ఎసిడిటీతో బాధపడుతుంటే?

ఇప్పటికే ఎసిడిటీతో బాధపడుతున్న వారు కొన్ని సులభమైన ఇంటి నివారణ చిట్కాలతో దానికి చెక్​ పెట్టవచ్చు. అవేంటో చూద్దాం.

Men’s Grooming: గడ్డంతో మీ అందం రెట్టింపు.. ఈ నాలుగు బియర్డ్​ ప్రొడక్ట్స్​తో ఆకర్షణీయమైన గడ్డం సొంతం చేసుకోండి..

1. ప్రతి రోజూ కొన్ని కొత్తిమీర వాటర్​ తాగండి.

2. భోజనం తర్వాత అర టీస్పూన్ సోంపు గింజలను నమలండి.

3. మధ్యాహ్నం సమయంలో కొబ్బరి నీళ్లు లేదా షర్బత్ రసం తాగండి.

4. ఖాళీ కడుపుతో కొన్ని నానబెట్టిన ఎండుద్రాక్షలను తినండి.

5. నిద్రవేళలో 1 టీస్పూన్ ఆవు నెయ్యితో గోరువెచ్చని పాలు తీసుకోండి. ఇది మీ నిద్రలేమి, మలబద్ధకానికి చెక్​ పెడుతుంది.

6. రోజ్ వాటర్, పుదీనా నీరు తాగండి, ఇది మీ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

7. తగినంత విశ్రాంతి తీసుకోండి, తగినంత నీరు తాగండి. మంచి నిద్ర, యోగా, ప్రాణాయామం, ధ్యానం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

First published:

Tags: Health, Health problem, Stomach Pain

ఉత్తమ కథలు