Meal Timings: కష్టపడకుండా బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే కరెక్ట్ గా ఈ సమయాల్లో భోజనం చేయండి చాలు..!

ప్రతీకాత్మ క చిత్రం

చాలా డైట్లు ఏం తినాలి? ఎంత తినాలి? అని చెబుతాయి కానీ ఏ సమయంలో తినాలని మాత్రం చెప్పవు. సరైన సమయంలో ఆహారం తినడం వల్ల అది బాగా జీర్ణమై కొవ్వుగా మారకుండా ఉంటుంది.

  • Share this:
లాక్ డౌన్ మొదలయ్యాక చాలామంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించడం ప్రారంభించారు. అందులో కొందరు మానేసినా మరికొందరు మాత్రం ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే చాలామంది ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతుంటారు. బరువు తగ్గాలన్న కోరికతో బ్రేక్ ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్ మానేస్తూ ఉంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని చెబుతున్నారు నిపుణులు. మనం తీసుకునే ప్రతి మీల్ మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. అయితే వీటిని సరైన సమయంలో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. చాలా డైట్లు ఏం తినాలి? ఎంత తినాలి? అని చెబుతాయి కానీ ఏ సమయంలో తినాలని మాత్రం చెప్పవు. సరైన సమయంలో ఆహారం తినడం వల్ల అది బాగా జీర్ణమై కొవ్వుగా మారకుండా ఉంటుంది.

1960ల్లో ప్రముఖ న్యూటిషనిస్ట్ మనం చేయాల్సిన భోజనం గురించి చక్కటి సామెత చెప్పారు. బ్రేక్ ఫాస్ట్ ని చక్రవర్తిలా, మధ్యాహ్నం భోజనాన్ని రాకుమారుడిలాగా, సాయంత్రం భోజనాన్ని పేదవాడిలా చేయాలని చెప్పారు. అంటే ఉదయం నచ్చిన ఆహార పదార్థాలు తింటూ, మధ్యాహ్నం దాని కంటే కాస్త భోజనాన్ని చేయాలి. కానీ రాత్రి మాత్రం చాలా తక్కువగా.. సులువుగా అరిగే ఆహారపదార్థాలు తీసుకోవాలని అర్థం. అయితే ఎంత తినాలన్న దానితో పాటు ఎప్పుడు తినాలన్నది కూడా ముఖ్యమే.
ఇది కూడా చదవండి: పెళ్లి తర్వాత సినిమాలు మానేయమని రాజీవ్ కండీషన్ పెట్టాడు.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన యాంకర్ సుమ

ఉదయం బ్రేక్ ఫాస్ట్ ని తప్పకుండా తీసుకోవాలని మన ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. ఇది నిజమేనని హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో కూడా తేలింది. 26,902 మంది హెల్త్ ప్రొఫెషనల్స్ పై పదహారేళ్ల పాటు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వీరంతా 45 నుంచి 82 సంవత్సరాల మధ్యనున్న మగవారే విశేషం. ఇందులో భాగంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన వారితో పోల్చితే చేయనివారిలో గుండె పోటు ముప్పు 27 శాతం ఎక్కువగా ఉంటుందని తేలింది. ఈ బ్రేక్ ఫాస్ట్ ని కూడా 7 నుంచి 9 గంటలలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. చాలామంది మధ్యాహ్న భోజనం ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు.

ఇలా చేయడం కూడా సరైనదే. ఎందుకంటే ఈ సమయంలో మన యాక్టివిటీ లెవల్ ఎక్కువగా ఉంటుంది. ఆహారం కూడా తొందరగా అరిగిపోతుంది. ఆహారంలోని పోషకాలన్నింటినీ తీసుకోవడానికి వీలుంటుంది. మధ్యాహ్న భోజనాన్ని 12 నుంచి 2 గంటల మధ్యలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక రాత్రి సమయంలో మన శరీర క్రియల వేగం తగ్గుతుంది. పడుకోవడానికి ముందుగానే ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. పైగా జీర్ణ క్రియ కొనసాగుతూ ఉంటుంది కాబట్టి నిద్ర కూడా సరిగ్గా పట్టదు .అందుకే నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందు భోజనం పూర్తి చేయడం మంచిది.

ఇవి కూడా సులువుగా అరిగిపోయేలా ఉంటే మంచిది. రాత్రి భోజనాన్ని ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో పూర్తి చేయాలి. చాలామందికి ఇది ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ ఈ సమయంలో తినడం వల్ల మీ ఆరోగ్యానికి మంచిది. ఈ సమయంలో తినడం అసాధ్యమైతే కనీసం 9 గంటల లోపు భోజనం పూర్తి చేయాలి. అలాగే రాత్రి భోజనం చేసిన ఓ అరగంట తర్వాత నెమ్మదిగా నడవడం వల్ల ఆహారం తొందరగా అరిగిపోయే వీలుంటుంది. దీనివల్ల బరువు కూడా తొందరగా తగ్గే వీలుంటుంది. అయితే ఈ సమయంలో తినడంతో పాటు మీకు న్యూట్రిషనిస్ట్ అందించిన క్యాలరీ లిమిట్ లోపు తినేలా జాగ్రత్తలు తీసుకోండి.
Published by:Krishna Adithya
First published: