హోమ్ /వార్తలు /లైఫ్ స్టైల్ /

Dark Circles: కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి..

Dark Circles: కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వేధిస్తున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dark Circles: వీటివల్ల యుక్తవయసులో ఉన్నవారు కూడా ముసలివారి లాగా కనిపిస్తారు. కళ్లకింద చర్మం నల్లగా మారిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి.

చిన్నా పెద్దా.. ఆడా మగా తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సౌందర్య సమస్యలలో డార్క్ సర్కిల్స్ (Dark Circles) కూడా ఒకటి. కళ్ల కింద నలుపు రంగు వలయాలు ఏర్పడడాన్నే డార్క్ సర్కిల్స్ అంటారు. వీటివల్ల యుక్తవయసులో ఉన్నవారు కూడా ముసలివారి లాగా కనిపిస్తారు. ఈ సమస్యను ఎలా పోగొట్టాలో తెలియకపోతే.. అవి అలాగే వేధిస్తుంటాయి. కళ్లకింద చర్మం నల్లగా మారిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. చక్కటి నిద్ర, పోషక విలువలున్న ఆహారం తినడం ద్వారా ఈ సమస్య దరి చేరకుండా కాపాడుకోవచ్చు. అలాగే కొన్ని ఈజీ ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. వంటింట్లో లభించే అల్లం, తులసి వంటి సహజసిద్ధమైన మెడిసిన్‌తో డార్క్ సర్కిల్స్ తొలగించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అదెలాగో తెలుసుకుందాం.

• అల్లం, తులసి, కుంకుమపువ్వు (saffron) పదార్థాలతో టీ తయారు చేయండి. అందులో తగినంత తేనె కలిసి ఆ టీని రోజుకు ఒకసారి తాగండి. ఈ టీలోని ప్రతి పదార్థం చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇలా రోజూ ఒక్కసారి టీ తాగడం వల్ల డార్క్ సర్కిల్స్ క్రమంగా తగ్గుముఖం పడతాయి.

• గుప్పెడు వేరుశెనగలు, కొంచెం బెల్లం, కాస్త కొబ్బరి కలిపి రోజు సాయంత్రం తినాలి. ఇది మీ స్నాక్‌గా అలవాటు చేసుకుంటే నల్లటి వలయాలు కొద్ది రోజుల్లోనే మటుమాయమవుతాయి

డార్క్ సర్కిల్స్ తొలగించడానికి ఇంట్లోనే ప్యాక్ (homemade pack) కూడా తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుంటే..

• శనగపిండి, ఫ్రెష్ పాలను కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి ఒంటి సబ్బుగా వాడుకోవచ్చు. ఇది సోప్ గా వాడుతున్నప్పుడు ఫేస్ వాష్ చేయకూడదు. అలాగే ఇతర కెమికల్ సోప్స్ వాడకపోవడం ఉత్తమం.

నిద్రలేమి కారణంగా కంటి కింది చర్మం ఉబ్బటంతో పాటు నల్లటి వలయాల సమస్య తలెత్తుతుంది. కాబట్టి మధ్యాహ్నం 30 నిమిషాల పాటు ఓ కునుకు తీయండి. మధ్యాహ్నం వేళల్లో 30 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోకండి. అలాగే రాత్రి 11 గంటల లోపే నిద్రించండి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చెడు వ్యక్తులకు దూరంగా ఉండటం వల్ల కూడా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.

ఇది కూడా చదవండి : ఈ వంటింటి చిట్కాల‌తో మధుమేహానికి చెక్.. 30 నిమిషాల్లో షుగర్ లెవల్స్ త‌గ్గించుకోండిలా..

అతిగా నిద్రపోవడం వల్ల కూడా నల్లటి వలయాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరీ ఎక్కువ సేపు నిద్రపోకండి. టీవీ, మొబైల్ తదితర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కూడా మీ కళ్ళ చుట్టూ రక్తనాళాలు ఉబ్బి అక్కడి చర్మం నల్లగా మారుతుంది. అందుకే మీ కళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వండి. అలాగే తరచూ నీరు తాగడం వల్ల కళ్ల కింది చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Health Tips, Honey, Life Style

ఉత్తమ కథలు