ప్రేమ(Love) అనేది ఓ భావోద్వేగం. కొందరు తొలి చూపులోనే ప్రేమలో పడతారు. మరికొందరికి కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టొచ్చు. ఇంకొందరు ఎంత ప్రయత్నం చేసినా ప్రేమలో సక్సెస్(Success) సాధించలేరు. రోజు వెంటపడుతున్న అతనిలో ఏ మార్పు రాకపోవచ్చు. బహుశా మీతో కలిసి ఉండటానికి వారికి ఇష్టంలేకపోవచ్చు. అయినా మీరు వారి వెంట పడుతుంటే మీ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నట్లే. అయినా అతను ఎప్పటికైనా మీ ప్రేమను అంగీకరిస్తారన్న నమ్మకం ఉంటే మీరు మరికొంత కాలం వేచిచూడాలి. అయితే ఇది ఏమాత్రం సహేతుకంగా లేదు. ఎందుకంటే మీరు వారి కోసం ఇప్పటికే చాలా సమయం కేటాయించారు. ఇక్కడ ప్రేమించడం మానేయడానికి నాలుగు సందర్భాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
ఎమోషనల్ సపోర్ట్
మీరు ప్రేమించే వ్యక్తి రోలర్ కోస్టర్ లాంటి భావోద్వేగ పరిస్థితుల్లో ఉన్నప్పుడు సహాయంగా ఎవరైనా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే.. మీరు వారి దృష్టిలో పడతారు. మిగతా సమయంలో మీరు ఎంత ప్రయత్నించినా మీవైపు కన్నెత్తి కూడా చూడరు. స్నేహితులతో గొడవ పడినప్పుడు లేదా పని విషయంలో విభేదాలు వచ్చినప్పుడు మాత్రమే వారు మీ సపోర్ట్ కోరతారు. మిగతా సందర్భాల్లో మిమ్మల్ని అసలు పట్టించుకోరు. దీనిబట్టి ఇలాంటి వ్యవహార శైలి ఉన్నవారిని మీరు ఇష్టపడితే వెంటనే వదిలివేయడం ఉత్తమం.
బ్యాక్ అప్లా అనిపించినప్పుడు
మీ పార్ట్నర్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీతో కమ్యూనికేట్ అవుతున్నట్లు మీకు అనిపిస్తుందా.. కేవలం చిరాకుగా అనిపించినప్పుడు లేక ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు మాత్రమే మీతో మాట్లాడుతుంటే.. మిగతా సమయంలో వారి ప్రపంచంలో మీరు లేనట్లే. కేవలం మీరు వారికి ఓ బ్యాకప్‌లా మాత్రమే ఉపయోగపడుతున్నారు. ఇది మీ ప్రస్తుత భాగస్వామితో సన్నిహితంగా మెలగకుండా నిరోధిస్తుంది. దీంతో వెంటనే వారి రిలేషన్షిప్ కట్ చేయండి.
ఇద్దరూ ఒకేలా లేనప్పుడు
మీరు పార్ట్నర్ను ఎంతగా ఇష్టపడుతున్నా.. వారు మాత్రం తనకు నచ్చినట్లే ఉండాలనుకుంటే వెంటనే వదిలేయండి. పెళ్లి చేసుకోవాలని మీరు ఒప్పించాలని ఎంత ప్రయత్నం చేసినా, ఇప్పుడే తొందర ఏమొచ్చిందని చెప్పేవారికి మరోక్షణం ఆలోచించకుండా నో చెప్పండి. మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఇది ఓ పెద్ద సమస్యగా గుర్తించి బయటపడటానికి ఆలోచన చేయండి.
ఇష్టంలేదని స్పష్టం చేసిప్పుడు
మీపట్ల పార్ట్నర్కు ఎలాంటి ప్రేమ లేదని మీకు స్పష్టం చేసినా.. వారి వెంట పడటం అనవసరం. ఎందుకంటే వారికి మీపై ఎలాంటి ఇష్టంలేదని అర్ధం. ఎదుటివారు మనసు మార్చుకుంటారని మీరు ఆశించకూడదు. మీ పట్ల ఆసక్తి లేని వ్యక్తిని ఒప్పించడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే మీతో డేటింగ్ చేసే అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులు వెంటనే ఒకే చెబుతారు కాబట్టి. ఇలాంటి సమయంలో మీరు మరో వ్యక్తిని ప్రేమించడంపై దృష్టిపెడితే ఏమైనా ప్రయోజనం ఉండవచ్చు. మీరు ఎంత వెంటపడుతున్నా.. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతనిలో మీపట్ల తన వైఖరి మారకపోతే... అతనికి గుడ్‌బై చెప్పి మరొకరికి వెల్కం చెప్పండి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.