Home /News /life-style /

HEALTH ARE LOW VACCINE RATES TO BLAME FOR OMICRON SPREAD AROUND THE GLOBE EXPERTS THINK SO JNK GH

Omicron Spread: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తికి తక్కువ వ్యాక్సినేషన్ రేటు కారణమా? నిపుణులు ఏమంటున్నారంటే..

ఒమిక్రాన్ వ్యాప్తికి తక్కువ వ్యాక్సినేషన్ రేటే కారణమా? (ప్రతీకాత్మక చిత్రం)

ఒమిక్రాన్ వ్యాప్తికి తక్కువ వ్యాక్సినేషన్ రేటే కారణమా? (ప్రతీకాత్మక చిత్రం)

Omicron Spread: సెప్టెంబరు నాటికి ప్రపంచంలోని 50 దేశాల జనాభాలో 10 శాతం కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తవలేదు. ఈ 50 దేశాల్లో చాలా వరకు ఆఫ్రికాలోనే ఉన్నాయి. గ్లోబల్ వ్యాక్సినేషన్ రేట్ 42 శాతంతో పోలిస్తే, అక్కడ అత్యంత స్వల్పంగా 7 శాతంగానే ఉంది.

ఇంకా చదవండి ...
కరోనా వైరస్ (Corona Virus) మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ఓమిక్రాన్ (Omicron) వేరియంట్‌గా రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోంది. తొలుత దక్షిణాఫ్రికాలో (South Africa) కనిపించిన ఈ కొత్త వేరియంట్‌లో పెద్ద సంఖ్యలో స్పైక్ ప్రోటీన్ మ్యుటేషన్లు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే చాలా దేశాలు ప్రయాణ నిబంధనలతో (Travel Restrictions) పాటు ఇతర ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతోపాటు వ్యాక్సినేషన్ (Vaccination) కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఈ నూతన వేరియంట్ పై పరిశోధనలు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వేరియంట్ జీనోమ్ సీక్వెన్స్ ను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఊహించిన దానికంటే ఎక్కువ మ్యుటేషన్లు ఇందులో ఉన్నాయా? తర్వాత ఏం జరగబోతుంది? అనే అంశాలపై పరిశోధన చేస్తున్నారు. అయితే వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉన్న దేశాలపై, ముఖ్యంగా స్వల్ప ఆదాయ దేశాలపై కొత్త వేరియంట్ ఎక్కువగా ప్రభావం చూపుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

* తక్కువ వ్యాక్సినేషన్ రేటుకు ఒమిక్రాన్ వ్యాక్తికి సంబంధం ఏంటి?
ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ఎపిడిమియోలజీలో పనిచేస్తోన్న మేరూ షీల్ ఈ విషయంపై స్పందించారు. "వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత, కణాలకు అంటుకుంటుంది. వెంటనే అది తనకు తాను కాపీ చేసుకుని ఇతర కణాలకు వ్యాపిస్తుంది. ఈ క్రమంలో ఇతరులకు కూడా సోకుతుంది. కొన్ని సార్లు నాన్-ఇమ్యూన్ వ్యక్తుల్లోనూ ఇదే విధానాన్ని అవలంభించి మ్యుటేషన్ చెందుతూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది" అని తెలిపారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి(Immune) ద్వారా వేరొకరికి వైరస్ వేగంగా వ్యాప్తి చెందకపోవచ్చని, తద్వారా కొత్త వేరియంట్లు ఉత్పన్నమయ్యే అవకాశాలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

diabetes care : డయాబెటిస్‌ చికిత్సకు రాయితీ -సుప్రీంకోర్టు CJI Ramana
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) డేటా ప్రకారం, సెప్టెంబరు నాటికి ప్రపంచంలోని 50 దేశాల జనాభాలో 10 శాతం కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తవలేదు. ఈ 50 దేశాల్లో చాలా వరకు ఆఫ్రికాలోనే ఉన్నాయి. గ్లోబల్ వ్యాక్సినేషన్ రేట్ 42 శాతంతో పోలిస్తే, అక్కడ అత్యంత స్వల్పంగా 7 శాతంగానే ఉంది. ఆఫ్రికా దేశాల్లో ఇంత తక్కువగా వ్యాక్సినేషన్ రేటు నమోదు కావడానికి కారణాలు లేకపోలేదు. వ్యాక్సిన్ డోసులు సరఫరా చేస్తామన్నా ప్రపంచ దేశాలు తక్కువగా పంపిణీ చేయడమే ఇందుకు ప్రధాన కారణం.

Acidity Problem: ఈ చిన్నపాటి చిట్కాలు పాటించండి.. ఎసిడిటీ సమస్యకు చెక్ పెట్టండి.. ఎయిర్ ఫినిటీ అనే హెల్త్ డేటా కంపెనీ అధ్యయనం ప్రకారం.. ఆఫ్రికాకు సరఫరా అవ్వాల్సిన వ్యాక్సిన్ డొనేషన్ల కంటే 15 శాతం తక్కువ డెలివరీ అయ్యాయి. ధనిక దేశాలతో పోలిస్తే పేద దేశాల్లో కోవిడ్ మహమ్మారి చాలా దారుణంగా ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఆర్థిక, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ కు కారణమైన డెల్టా వేరియంట్ కు ఒమిక్రాన్ పూర్తి భిన్నంగా ఉందని పరిశోధకులు తెలిపారు. ఇంతకుముందు వేరియంట్ల కంటే ఇది వైవిధ్యంగా ఉందంటున్నారు.


Low Testosterone Level Symptoms: మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిందా...అయితే శరీరంలో కలిగే లక్షణాలు ఇవే... * భారత్ లో ఒమిక్రాన్ వ్యాపిస్తే పరిస్థితి ఏంటి? వ్యాక్సిన్లు పనిచేస్తాయా?


SARS-CoV-2 వేరియంట్ కు చెందిన ఒమిక్రాన్ అధికంగా ఉత్పరివర్తనం(Heavily Mutated) చెందిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) మాజీ సైంటిస్ట్ డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్ అన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్ ద్వారా ఈ వేరియంట్ ను ఎదుర్కోవడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రజలే కీలక పాత్ర పోషించాలని చెప్పారు. మాస్కులు తప్పనిసరిగా ధరించడం, పరిశుభ్రంగా ఉండటం, సామాజిక దూరం లాంటివి పాటించడం వల్ల పరిస్థితిని అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు.

Weight loss: బరువును తగ్గించుకోలేకపోతున్నారా? అయితే మీ ఆహారంలో ఈ కూరగాయలను చేర్చండి..


వ్యాక్సిన్ తీసుకోని వారిపై, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఒమిక్రాన్ ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. అయితే కొంతమంది మాత్రం వ్యాక్సిన్లు ఎంతమేరకు ఈ నూతన వేరియంట్ పై పనిచేస్తాయో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండు, అంతకంటే ఎక్కువ డోసులు తీసుకుంటే వైరస్ నుంచి రక్షణ పొందే అవకాశముంటుందని చెబుతున్నారు.
First published:

Tags: Corona, Corona Vaccine, Omicron corona variant

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు