Contraceptives: గర్భనిరోధక మాత్రలు (Contraceptive Pills) వాడితే పిల్లలు అసలు పుట్టారా..? వీటిపై ఉన్న అపోహలు ఇవే..
కాంట్రాసెప్టివ్ పిల్స్ (Contraceptive Pills) లేదా గర్భనిరోధక మాత్రలు గురించి మాట్లాడేందుకు చాలామంది సందేహిస్తుంటారు. గర్భాన్ని నిరోధించడానికి పిల్స్‌తో పాటు మరిన్ని పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయినా వీటి గురించి కూడా ఎక్కువగా ఎవరూ మాట్లాడరు. ఫలితంగా అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ (Pregnancy), సుఖ వ్యాధుల బారిన పడుతుంటారు. సాధారణంగా గర్భాన్ని నిరోధించడానికి కండోమ్‌లు, బర్త్ కంట్రోల్ పిల్స్, ఓరల్ కాంట్రాసెప్టివ్ సి పిల్స్ వంటి ఎన్నో పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. గైనకాలజిస్ట్‌తో మాట్లాడటం ద్వారా ఏది బాగా సూట్ అవుతుందో తెలుసుకోవచ్చు.
అయితే కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడటం వల్ల బరువు పెరుగుతామని, వీటివల్ల ఎప్పటికీ పిల్లల్ని కనలేమనే అపోహలు (Myths) చాలామందిలో ఉన్నట్లు ది ఉమెన్స్ కంపెనీ వ్యవస్థాపకురాలు, సీఈఓ అనికా పరాశర్ పేర్కొన్నారు. అపోహలేవో, నిజాలేవో కూడా వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* బరువు పెరగడం
అప్పుడే పిల్లలు వద్దనుకునే మహిళలకు, నెలసరి సమస్యలతో బాధపడుతోన్న ఆడవారికి కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉత్తమంగా నిలుస్తాయి. గర్భధారణను వాయిదా వేయాలనుకునే వారికి ఇతర గర్భనిరోధక పద్ధతులన్నింటిలో పిల్స్ మాత్రమే చాలా సురక్షితమైనవి, సమర్థవంతమైనవి. అయితే వీటిని వాడటం వల్ల బరువు పెరుగుతున్నామేమో అని చాలామంది మహిళలు అపోహ పడుతుంటారు. కానీ గర్భనిరోధక మాత్రలు బరువు పెరగడానికి కారణమవుతాయని ఏ పరిశోధనలోనూ శాస్త్రీయంగా రుజువు కాలేదు. మహిళలు బరువు పెరగడం గురించి అందుబాటులో ఉన్న ప్రస్తుత డేటా మాత్రం కేవలం ఇతర జీవనశైలి కారకాలతోనే ముడిపడి ఉండవచ్చు. వీటితో పాటు అవాంఛిత రోమాలు, మొటిమలు రావడానికి కూడా ఈ పిల్స్‌యే కారణమని కొందరు అనుకుంటారు కానీ వీటికి, దానికి ఎలాంటి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు.
* సంతానోత్పత్తిపై ప్రభావం
బర్త్ కంట్రోల్ పిల్స్ లేదా కాంట్రాసెప్టివ్ పిల్స్ కంటిన్యూగా వేసుకున్న మహిళల సంతానోత్పత్తిపై ఎలాంటి చెడు ప్రభావం లేదని అనికా పరాశర్ చెబుతున్నారు. ఈ మాత్రాలను తీసుకోవడం మానేసిన వెంటనే హెల్దీగా ఉన్న మహిళలు అందరిలాగే గర్భం ధరించవచ్చని చెబుతున్నారు. పిల్స్ తీసుకోవడం ఆపేశాక శరీరం కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఉంటూ దాని సహజ పునరుత్పత్తి విధులను తిరిగి ప్రారంభిస్తుందని ఆమె అన్నారు. అలానే వీటిని వాడేటప్పుడే కాదు మానేసేటప్పుడు కూడా మహిళలు గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.
* వయసు పైబడిన మహిళలు వాడొచ్చా?
వయసు పెరిగే కొద్దీ మహిళలకు గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి. అయినా కూడా వారు గర్భం దాల్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇలాంటి సర్‌ప్రైజింగ్ ప్రెగ్నెన్సీలను నివారించడానికి, తమ సంతానోత్పత్తి గురించి తెలుసుకోవడానికి మహిళలు గైనకాలజిస్ట్‌తో మాట్లాడటం మంచిది. చాలా సందర్భాలలో మహిళలు కనీసం ఒక సంవత్సరం పాటు పీరియడ్స్ ఆగిపోయే వరకు ఏదో ఒక రకమైన బర్త్ కంట్రోల్ పిల్ ఉపయోగించాలి.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఆధారాలు లేవు.)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.