Home /News /life-style /

HEALTH ANTACIDS KIDNEY INJURY RISK SYMPTOMS GH VB

Kidney Problems: కిడ్నీలను ప్రభావితం చేసేవి అవేనా.. బోలు ఎముకల వ్యాధికి ఈ మందులు దారితీస్తాయా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యాంటాసిడ్స్ వల్ల తీవ్రమైన కిడ్నీ వ్యాధులు వస్తాయనేది నిరూపితం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసలు యాంటాసిడ్స్ కిడ్నీలను ప్రభావితం చేస్తాయా? లేదా అనే విషయాలపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

దేశంలో అనేక మంది తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి యాంటాసిడ్స్ మందుల వాడటం కూడా కారణం కావచ్చని భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. యాంటాసిడ్స్ వల్ల తీవ్రమైన కిడ్నీ వ్యాధులు వస్తాయనేది నిరూపితం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసలు యాంటాసిడ్స్ కిడ్నీలను ప్రభావితం చేస్తాయా? లేదా అనే విషయాలపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. దేశంలో ఏడు నుంచి 30 శాతం భారతీయులు గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (Gastro Esophageal Reflux Disease- GERD) అనే వ్యాధితో బాధపడుతున్నారని కార్డియాక్, వాస్కులర్ సర్జన్ డాక్టర్ శ్రీరామ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపారు.

Exercise vs Walking: రోజుకు 30 నిమిషాల వ్యాయామం మంచిదా..? పదివేల అడుగులు నడవడం మంచిదా..? తెలుసుకోండి..


ఆహారాన్ని జీర్ణం చేయడానికి, బ్యాక్టీరియాను తొలగించడానికి కడుపులో యాసిడ్స్ తయారవుతాయి. ఇలా కాకుండా కూడా కొన్ని సందర్భాల్లో కడుపులో యాసిడ్ తయారవుతుంది. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దీంతో గుండెల్లో మంటగా అనిపిస్తుంది.

GERD లక్షణాలు
భోజనం తరువాత ఛాతీలో మంటగా అనిపించడం, నోటిలో చేదు లేదా పుల్లని రుచి, మింగడం కష్టంగా అనిపించడం, వికారం, వాంతులు.. వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ సమస్యను ఆహారం, జీవనశైలి మార్పులతో నయం చేసుకోవచ్చు. అయితే అప్పటికీ సమస్య తగ్గకపోతే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ((Protan Pump Inhibitors- PPI)ఔషధాన్ని సూచిస్తున్నారు.

ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే ఏమిటి?
ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (PPI) అనేవి యాసిడ్ పెప్టిక్ వ్యాధి చికిత్సకు ఉపయోగించే మందులు. చాలా మందికి ఇవి సురక్షితమైనవి. అయితే కిడ్నీలపై వీటి ప్రభావంపై ఆందోళనకరంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Pollution Certificate: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆ వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికేట్ అవసరం లేదు.. వివరాలివే..


కిడ్నీలపై పీపీఐల ప్రభావం
కిడ్నీలపై పీపీఐల ప్రభావం రెండు విధాలుగా ఉంటుంది. తీవ్రమైన ఇంటర్‌స్టీషియల్ నెఫ్రిటిస్ ఇందులో మొదటిది. పీపీఐకి అలర్జీ ప్రతిచర్య ద్వారా మూత్రపిండాల వాపునకు దారితీస్తుంది. కిడ్నీ పనితీరును దిగజారుస్తుంది. ఈ సమస్య ఎదురైతే.. వెంటనే గుర్తించి చికిత్స తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో కార్డికోస్టెరాయిడ్స్ చికిత్స చేయాల్సి ఉంటుంది.

రెండోది తీవ్రమైన కిడ్నీ వ్యాధి (CKD), సీకేడీ పురోగమనం, చివరి దశ కిడ్నీల వ్యాధి రూపంలో ఉండవచ్చు. కానీ ఇది ఇంకా నిరూపితం కాలేదు. పీపీఐలను వాడే ప్రతి ఒక్కరూ తీవ్రమైన కిడ్నీ వ్యాధి బారిన పడతారని కాదు. ప్రమాదం ఉందని తెలుసుకోవడం ముఖ్యం. ఇది ఎలా జరుగుతుందనేది ఇంకా అధ్యయనం చేస్తున్నారు. పీపీఐ ఉపయోగం, కిడ్నీ పనితీరుపై ప్రభావంపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి.

Affair: పుట్టింటికి వెళ్లిన భార్య.. వెంటనే వస్తానని చెప్పి తిరిగి రాలేదు..; ముగ్గురు ప్రియులతో కలిసి..


డాక్టర్ సూచించకుండా యాంటాసిడ్స్ వాడటం వల్ల ఆస్టియోపోరోసిస్‌కు దారితీయవచ్చు. ఇది వృద్ధుల్లో తుంటి పగుళ్లకు దారితీస్తుంది. యాంటాసిడ్స్ కడుపులో కాల్షియం, ఐరన్ శోషణను అడ్డుకుంటూ ఎముకల అనారోగ్యానికి దారితీసే అవకాశం ఉంది. అయితే పీపీఐ వాడకాన్ని పరిమితం చేయడం ద్వారా తీవ్రమైన కిడ్నీ వ్యాధులు తగ్గుతాయా లేదా అనేది పరిశోధనలు తేల్చాల్సి ఉంది.

Double Shocking: ఇద్దరూ మగవాళ్లు అయి ఉండి ఇదేం బుద్ది.. ఆ పని కోసం ఎంత పనిచేశావయ్యా..


జీవనశైలిలో మార్పులు ముఖ్యం
యాసిడ్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. వీరు తిన్న తరువాత 30 నిమిషాల లోపు నిద్రపోకూడదు. వదులుగా ఉండే దుస్తులు ధరించడంతో పాటు ఆల్కహాల్, పొగాకు, చాక్లెట్లకు దూరంగా ఉండాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా ఎక్కువసార్లు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాలి.

మసాలాలు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. హడావుడి కాకుండా నెమ్మదిగా నములుతూ భోజనం చేయాలి. వీటితో పాటు బరువును అదుపులో ఉంచుకోవాలి. యాసిడ్ రిఫ్లక్స్ బాధితులు ఎసిడిక్ ఫుడ్ అయిన కార్బోనేటెడ్ పానీయాలు, చక్కెర పానీయాలు, ఉల్లిపాయలు తినడం మానేయాలి.
Published by:Veera Babu
First published:

Tags: Health, Kidney

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు