దోమల బెడద ఎక్కువగా ఉందా.. ఇలా చేయండి..

Benefits of Onion Peel : ఉల్లిపాయలు రేటు ఎక్కువగా ఉంటే... జాగ్రత్తగా వండుకుంటాం. తక్కువగా ఉంటే లైట్ తీసుకుంటాం. అయితే మనలో చాలా మంది ఉల్లి తొక్కలను పారేస్తూ ఉంటాం. నిజానికి వాటితో చాలా ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: August 20, 2019, 6:35 PM IST
దోమల బెడద ఎక్కువగా ఉందా.. ఇలా చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సాయంత్రం అవ్వగానే ఇంట్లోకి దోమలు వస్తున్నాయా? అయితే, మీకోసం ఓ మంచి చిట్కా.. ఓ గిన్నెలో నీరు పోసి, వాటిలో ఉల్లిపాయ తొక్కలు వేసి కిటికీలు, గుమ్మాల దగ్గర పెడితే చాలు.. దోమలు పరార్ అనాల్సిందే.  వాటికి ఉల్లిపాయల వాసన, ఘాటు పడదు. దీంతో అవి ఇంటి గుమ్మం తొక్కడానికి జంకుతాయి. ఒక్క దోమల బెడదనే కాదు.. ఉల్లిగడ్డతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లితో ప్రయోజనాలు ఏంటంటే.. జుట్టు రాలుతున్నా, చుండ్రు సమస్య ఉన్నా... ఉల్లి తొక్కల్ని వాడేసుకోవాలి. ఎలా అంటే, ఉల్లి తొక్కల్ని మెత్తగా నూరి, తలకు పట్టించాలి. పావుగంట తర్వాత అంతగా పవర్ ఉండని, సాధారణ షాంపూతో స్నానం చెయ్యాలి. ఇది ఎంత బాగా పనిచేస్తుందంటే... జుట్టు సమస్యలకు ఉల్లిపాయలు, తొక్కలు అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. ఉల్లిలోని సల్ఫర్... పాడైన, సన్నబడిన వెంట్రుకల్ని బలంగా చేస్తుంది. తెల్ల జుట్టును గోధుమ, బంగారం రంగులోకి మార్చుతుంది.

అంతేకాకుండా.. ఉల్లి తొక్కల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి మర్నాడు ఆ నీటితో నొప్పులు ఉన్న చోట రాస్తే నొప్పులు త్వరగా తగ్గుతాయి. ఆ నీటిని చర్మానికి రాసి అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ సమస్యలు తొలగిపోతాయి. ఉల్లి తొక్కలతో సూప్ చేసుకొని తాగితే బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెట్టే బెడా సర్దుకొని బయటకు పోతుంది. అది పోయిందంటే... అధిక బరువు తగ్గి, సన్నగా, చక్కటి శరీర ఆకృతి వస్తుంది. ఫలితంగా గుండె హ్యాపీగా ఉంటుంది. అంతేకాదు... ఆనియన్ సూప్... ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

కొంతమందికి గాళ్లు వాపు ఎక్కుతాయి. లేదా మంట పెడతాయి. అలాంటి వాళ్లు ఉల్లి తొక్కల్ని 10 నుంచీ 20 నిమిషాలు నీటిలో మరగబెట్టాలి. ఆ తొక్కల్ని తీసేసి, నీటిని టీ లాగా తాగేయాలి. నిద్రపోయే ముందు ఇలా చేస్తే మంచిది. నాలుగైదు రోజుల్లో గాయాలు మటుమాయం అవుతాయి.
First published: August 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading