హోమ్ /వార్తలు /life-style /

Alcoholic Cardiomyopathy: ఆల్కహాలిక్ కార్డియోమయోపతి.. అతిగా మద్యం తాగితే వచ్చే గుండె సమస్యలు ఇవే..

Alcoholic Cardiomyopathy: ఆల్కహాలిక్ కార్డియోమయోపతి.. అతిగా మద్యం తాగితే వచ్చే గుండె సమస్యలు ఇవే..

Alcoholic Cardiomyopathy: ఆల్కహాలిక్ కార్డియోమయోపతి.. అతిగా మద్యం తాగితే వచ్చే గుండె సమస్యలు ఇవే..

Alcoholic Cardiomyopathy: ఆల్కహాలిక్ కార్డియోమయోపతి.. అతిగా మద్యం తాగితే వచ్చే గుండె సమస్యలు ఇవే..

Alcoholic Cardiomyopathy: ప్రస్తుతం ఎక్కువ మందికి మద్యం తాగే అలవాటు ఉంటోంది. మారుతున్న జీవన విధానాలు, సోషలైజింగ్‌, సోషల్ డ్రింకింగ్ పేరిట డ్రింకింగ్‌ కల్చర్‌ పెరుగుతోంది. చాలా మంది అతిగా మద్యం తాగడం హానికరం కాదని భావిస్తారు. అంతే కాకుండా ఎంజాయ్‌ చేయడానికి ఆల్కహాల్‌ కీలకమని కూడా నమ్ముతారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం ఎక్కువ మందికి మద్యం తాగే అలవాటు ఉంటోంది. మారుతున్న జీవన విధానాలు, సోషలైజింగ్‌, సోషల్ డ్రింకింగ్ పేరిట డ్రింకింగ్‌ కల్చర్‌ పెరుగుతోంది. చాలా మంది అతిగా మద్యం తాగడం హానికరం కాదని భావిస్తారు. అంతే కాకుండా ఎంజాయ్‌ చేయడానికి ఆల్కహాల్‌ కీలకమని కూడా నమ్ముతారు. మరికొందరు ఆల్కహాల్‌ తాగడం గుండెకు మంచి చేస్తుందని చెబుతారు. కానీ మద్యపానం వల్ల మంచి కంటే ఎక్కువ హాని ఉందని బెంగళూరులోని ఆస్టర్ CMI హాస్పిటల్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ-సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్ చెబుతున్నారు. ఎక్కువ కాలంపాటు మద్యపానం అలవాటు ఉంటే గుండెకు ముప్పు పెరుగుతుందని, ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఇంకా ఆయన తెలిపిన పూర్తి వివరాలు ఇలా..

* ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటే ఏంటి?

ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం రక్తపోటు (అధిక రక్తపోటు)కు కారణమవుతుంది. ఇది గుండె కండరాలను బలహీనపరుస్తుంది, దీంతో గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేదు. ఇది రక్తం, గుండె కండరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. హైపర్‌టెన్షన్‌కు ఎక్కువ కాలం చికిత్స తీసుకోకుండా వదిలేస్తే, అది హార్ట్‌ ఫెయిల్యూర్‌కి దారి తీస్తుంది. ఎక్కువకాలం నుంచి మద్యం తాగే అలవాటు ఉంటే.. కార్డియోమయోపతి, గుండె కండరాల వ్యాధి వచ్చే సూచనలు ఉన్నాయి. దీనివల్ల గుండె కండరాలు అసాధారణంగా ఎక్స్‌ప్యాండ్‌ అవుతాయి.

కార్డియోమయోపతిని ఎక్కువసేపు గమనించకపోతే.. ప్రాణాంతకంగా మారవచ్చు. క్రమరహిత హృదయ స్పందనలు కంజెస్టివ్‌ హార్ట్‌ ఫెయిల్యూర్‌కు దారి తీస్తాయి. ఈ పరిస్థితి సాధారణంగా 35 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో కనిపిస్తుంది. స్త్రీల కంటే పురుషులకు సంభవించే అవకాశం ఎక్కువ.

Dr Pradeep Kumar D, Sr Consultant – Interventional Cardiology, Aster CMI Hospital, Bengaluru

* వీరికి ప్రమాదం ఎక్కువ

5 నుంచి 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వ్యక్తులు ఆల్కహాలిక్ కార్డియోమయోపతికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వారానికి 14 కంటే ఎక్కువ డ్రింక్స్‌ లేదా రోజుకు 4 డ్రింక్స్‌ తీసుకునే పురుషులు, రోజుకు మూడు కంటే ఎక్కువ డ్రింక్స్‌ లేదా వారానికి ఏడు డ్రింక్స్‌ తీసుకునే స్త్రీలు సాధారణంగా అధిక మద్యపాన వర్గంలోకి వస్తారు. వీరిలో ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అవకాశాలు ఎక్కువ.

* సంకేతాలు, లక్షణాలు ఏంటి?

ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లోకి ప్రవేశించే వరకు ఎటువంటి సంకేతాలు లేదా లక్షణాలను చూపించదు. అడ్వాన్స్‌డ్‌ స్టేజ్‌లో ఉన్న వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

- అలసట, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు లేదా పని చేస్తున్న సమయంలో శ్వాస ఆడకపోవడం, కాళ్లు, పాదాలు, చీలమండల వాపు, మూత్రంలో మార్పులు, ఆకలి లేకపోవడం, ఏకాగ్రతలో ఇబ్బంది, బలహీనత, మైకం, మూర్ఛ, తలతిరగడం, రాపిడ్ పల్స్, దగ్గేటప్పుడు పింక్ కలర్‌ శ్లేష్మం రావడం, పడుకున్నప్పుడు దగ్గడం, ద్రవం పేరుకుపోవడం వల్ల కడుపు ఉబ్బరం, ఛాతీలో నొప్పి.

* కార్డియోమయోపతికి కారణాలు ఏంటి?

కార్డియోమయోపతి కారణాలు చాలా సందర్బాల్లో తెలియవు. కొన్ని సందర్భాల్లో వైద్యులు కార్డియోమయోపతికి గల కారణాలు గుర్తించగలరు. అవి..

1. జన్యు పరిస్థితులు

2. పెరిగిన హృదయ స్పందన రేటు , దీర్ఘకాలిక రక్తపోటు

3. గుండె కవాటాలలో సమస్యలు

4. గుండె పోటు కారణంగా గుండె కణజాలంలో నష్టం

5. అధిక మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం

6. ఊబకాయం, థైరాయిడ్, ఇతర రుగ్మతలు

7. గర్భధారణలో సమస్యలు

* కార్డియోమయోపతి ఎలా నిర్ధారిస్తారు?

కార్డియోమయోపతితో బాధపడుతున్నారో, లేదో తెలుసుకోవడానికి వైద్యులు ఈ కింది పరీక్షలను నిర్వహిస్తారు.

1. గుండెలో ఎన్‌లార్జ్‌మెంట్‌ గుర్తించడానికి ఛాతీ ఎక్స్-రే టెస్ట్‌

2. గుండె కవాటాల పనితీరును విశ్లేషించడానికి ఎకోకార్డియోగ్రామ్. ఇది సహాయం చేయకపోతే డాక్టర్ కార్డియాక్ మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI)ని కూడా చేయవచ్చు.

3. గుండెలో ఏవైనా అడ్డంకులు, హృదయ స్పందనలలో మార్పులను గుర్తించడం కోసం ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG).

4. వ్యాయామం అసాధారణ గుండె లయలను తీవ్రతరం చేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ట్రెడ్‌మిల్ స్ట్రెస్ టెస్ట్‌ నిర్వహిస్తారు.

5.గుండె శరీరంలోని రక్తాన్ని బలవంతంగా పంపింగ్ చేస్తుందో లేదో తనిఖీ చేయడానికి కార్డియాక్ కాథెటరైజేషన్ నిర్వహిస్తారు.

6. గుండె, దాని కవాటాల పరిమాణం, పనితీరును అంచనా వేయడానికి CT స్కాన్లు తీస్తారు.

7.శరీరంలో ఐరన్‌ లెవల్స్‌ను అంచనా వేయడానికి, థైరాయిడ్, మూత్రపిండాలు, కాలేయ పనితీరును తనిఖీ చేయడానికి రక్త పరీక్షలు చేస్తారు.

8.వ్యాధి పుట్టుకతో వచ్చినదో కాదో తనిఖీ చేయడానికి, తల్లిదండ్రులు, తోబుట్టువులలో ఈ పరిస్థితి వంశపారంపర్యంగా ఉందో లేదో తనిఖీ చేయడానికి వైద్యులు జన్యు పరీక్షను కూడా నిర్వహిస్తారు.

* కార్డియోమయోపతికి చికిత్స ఏంటి?

కార్డియోమయోపతికి అందించే చికిత్స పరిస్థితి, రకాన్ని, తీవ్రతను బట్టి మారుతూ ఉంటుంది. డైలేటెడ్ కార్డియోమయోపతి కేసులలో, వైద్యులు గుండె పనితీరును మెరుగుపరచడానికి మందులను సూచిస్తారు. అయితే పరిస్థితి తీవ్రంగా మారితే డాక్టర్ శస్త్రచికిత్స ఇంప్లాంట్‌లను సిఫార్సు చేయవచ్చు. రెస్ట్రిక్టివ్‌ కార్డియోమయోపతిలో, వైద్యుడు రక్తపోటును తగ్గించడానికి మందులను సూచించవచ్చు. అధిక రక్తపోటు స్థాయిలను గమనించడం, తీసుకునే ఉప్పు, నీటిని సరి చూసుకోవడం, శరీర బరువును ట్రాక్ చేయడం వంటివి సిఫార్సు చేస్తారు.కార్డియోమయోపతి తీవ్రమైన సందర్భాల్లో డాక్టర్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైసెస్ (VADలు) లేదా గుండె మార్పిడిని సిఫార్సు చేస్తారు.

* ఆల్కహాలిక్ కార్డియోమయోపతిని దూరంగా ఉంచడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?

మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. లేదా తక్కువగా తీసుకోవాలి. సోడియం తీసుకోవడం తగ్గించాలి. గుండెపై ఒత్తిడిని తగ్గించడానికి ఫ్లూయిడ్స్‌ తీసుకోవడం పరిమితం చేయండి. తగినంత వ్యాయామం చేయండి. గుండెకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే కఠినమైన వ్యాయామాలకు దూరంగా ఉండాలి. ధూమపానానికి దూరంగా ఉండండి. చక్కెర, సంతృప్త కొవ్వులు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోవడం పరిమితం చేయండి. ఆరోగ్యకరమైన BMIని మెయింటైన్‌ చేయండి.

* ఎంత మద్యం తాగడం అతి?

కొన్ని అధ్యయనాలు అప్పుడప్పుడు మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నప్పటికీ.. మద్యపానానికి దూరంగా ఉండటం ఉత్తమం. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి మద్యానికి దూరంగా ఉండాలి. ఆరోగ్యానికి మేలు చేసే యోగా తదితర మార్గాలను ఎంచుకోవాలి. ఆల్కహాల్ ఎప్పుడూ మంచిది కాదు. ఇది గుండెకు చేసే చాలా చిన్న మేలు క్యాన్సర్ లేదా కాలేయ వ్యాధుల వంటి తీవ్రమైన అనారోగ్యాల ముందు కనిపించవు. సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటే.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సాధారణ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం వంటివి సురక్షితమైన మార్గాలు.

First published:

Tags: Alcohol, Health care, Heart Attack

ఉత్తమ కథలు