Home /News /life-style /

HEALTH ADVANTAGES OF INCLUDING QUINOA IN YOUR DIET AND TOP THREE RECIPES TO TRY UMG GH

Quinoa: బరువు తగ్గడానికి క్వినోవా బెస్ట్ ఆప్షన్‌.. క్వినోవాతో ఈ వంటకాలు ట్రై చేయండి

క్వినోవాతో కలిగే ప్రయోజనాలివే.

క్వినోవాతో కలిగే ప్రయోజనాలివే.

హెల్దీ డైట్ (Healthy Diet) ప్లాన్ ఫాలో అయ్యేవారికి బాగా తెలిసిన క్వినోవా (Quinoa) లో ప్రోటీన్‌లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు, ఎముకలు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీంతోపాటు రక్తాన్ని తయారు చేస్తాయి.

హెల్దీ డైట్ ప్లాన్ ఫాలో అయ్యేవారికి బాగా తెలిసిన క్వినోవాలో ప్రోటీన్‌లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు, ఎముకలు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీంతోపాటు రక్తాన్ని తయారు చేస్తాయి. క్వినోవాలోని ఫైబర్ కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. క్వినోవా తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకోండి.

ఒక రోజులో ఎంత క్వినోవా తీసుకోవాలి?
ఒక రోజులో ఒకటి నుంచి రెండు కప్పుల వండిన క్వినోవా తినవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిది. సాధారణంగా దీనితో ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే క్వినోవా తిన్న తర్వాత కడుపునొప్పి, దురద లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే.. వీటిని తీసుకోకపోవడం మంచిది.

క్వినోవా ప్రయోజనాలు
బరువు తగ్గడం
క్వినోవాలో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చాలా సమయం కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్‌ కలిగిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే కరగని పీచు సంతృప్తికరమైన అనుభూతిని ఇస్తుంది, కాబట్టి అల్పాహారం కోసం క్వినోవా తినడం చాలా మంచిది. ఇది జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. దీంతో సులువుగా బరువు తగ్గుతారు.



గ్లూటెన్ రహితం
క్వినోవాలో గ్లూటెన్ ఉండదు. గ్లూటెన్‌ పడనివారికి సహాయపడుతుంది. వైట్‌ రైస్‌కి బదులుగా క్వినోవా తీసుకోవడం మేలు. ఇది శరీరానికి ప్రోటీన్, ఐరన్, ఫైబర్, కాల్షియంను అందిస్తుంది.

ఖనిజాలకు నిలయం
క్వినోవాలో జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన శరీరానికి అవసరం. ఈ ఖనిజాలు శరీరాన్ని అలసట, నిద్రలేమి, తలనొప్పి, కండరాల తిమ్మిర్లు, రక్తహీనత, మధుమేహం వంటివాటిని నివారిస్తాయి.

ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్
క్వినోవాలో మొక్కల ఆధారిత ప్రోటీన్, అమైనో ఆమ్లాలు ఉంటాయి. 100 గ్రాముల క్వినోవాలో మొత్తం 9 అమైనో ఆమ్లాలు, 8 గ్రాముల ప్రొటీన్లు ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన శరీరానికి అవసరం. ఇది సంపూర్ణ ఆహారాన్ని తయారు చేస్తుంది. అదే సమయంలో కండరాలకు పటుత్వాన్ని ఇస్తూ బరువు తగ్గేందుకు తోడ్పడతాయి.

తక్కువ GI
క్వినోవా గ్లైసెమిక్ ఇండెక్స్ విలువ తక్కువగా ఉంటుంది. అది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. కాబట్టి క్వినోవా శాశ్వత శక్తిని అందిస్తుంది.

ఈ వంటకాలు ట్రై చేయండి..
క్వినోవాను ఉడకబెట్టి, వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోసకాయ, ఉల్లిపాయ, క్యారెట్, పుదీనా ఆకులు, పచ్చిమిర్చి, పాలకూర, కొన్ని వేయించిన వేరుశెనగలను తీసుకోవాలి. వాటిని కడిగి మెత్తగా కోయాలి. ఈ కూరగాయలను ఉడికించిన క్వినోవాతో కలపాలి. దానికి చిటికెడు ఉప్పు, మిరియాలు, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకోవచ్చు.

క్వినోవాను కడిగి ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నచ్చిన కూరగాయలు, హెర్బ్స్‌ను కడిగి కోసి సిద్దం చేసుకోవాలి. ఒక స్పూన్ ఆలివ్ నూనెలో కూరగాయలు, హెర్బ్స్‌ వేయించాలి. అందులో నిమ్మరసం, ఉప్పు వేసి, ఒక నిమిషం కలపాలి. ఇప్పుడు ఉడికించిన క్వినోవా వేసి కాసేపు ఉంచితే చాలు.
Published by:Mahesh
First published:

Tags: Diet, Health, Healthy food, Life Style

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు